Wednesday, September 2, 2026
HomeLATESTPawan Kalyan Birthday:పవన్ కళ్యాణ్ బర్త్‌డే.. చిరంజీవి స్పెషల్ విషెస్ వైరల్!

Pawan Kalyan Birthday:పవన్ కళ్యాణ్ బర్త్‌డే.. చిరంజీవి స్పెషల్ విషెస్ వైరల్!

Pawan Kalyan Birthday:పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా విషెస్ తెలిపారు.

on
- Advertisement -banner Ad

Pawan Kalyan Birthday:నేడు సెప్టెంబర్ 2. ఇది కేవలం ఒక డేట్ అనుకుంటే పొరపాటు పడినట్టే. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి ఇది ఒక అద్భుతమైన రోజు. నేడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ఈరోజు పవన్ కళ్యాణ్ మర్చిపోయినా సరే.. పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం ఎప్పటికీ మర్చిపోరు. ఆయన పుట్టినరోజును ఒక పుట్టినరోజులా కాకుండా పండగలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ల సొంత పుట్టినరోజును అయినా మర్చిపోతారేమో కానీ.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు మాత్రం ఎప్పటికీ మర్చిపోరు.

పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పవన్ కళ్యాణ్(Pawan Kalyan Birthday) అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి సైతం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయనతో దిగిన ఆప్యాయంగా ఉండే ఫొటోను షేర్ చేస్తూ ట్వీట్ చేశారు.

- Advertisement -
Advertisement

పవన్ ఓ సంకల్ప సాధకుడు: చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి తన సోషల్ మీడియా వేదికగా రాసుకొస్తూ.. ‘‘కళ్యాణ్ బాబు ఓ సంకల్ప సాధకుడు. అంతేకాదు, అంకితభావం, ప్రేమ, బాధతో కూడిన సంకల్పం. అనుక్షణం ప్రజలకు మంచి చేయాలని చిత్తశుద్ధి కళ్యాణ్ బాబుకు చిన్నప్పటి నుంచే ఉంది. చిన్నప్పటి నుంచి కళ్యాణ్‌ను దగ్గరుండి చూస్తున్నాను. ఆయన వ్యక్తిత్వం నాకు తెలుసు. ఏ పని చేసినా సరే.. పూర్తిగా ఆ పని మీదే నిమగ్నమైపోతారు.

తన ప్రతి అడుగు పదిమందికి మేలు చేయాలని వేస్తాడు. ఎవరికీ అన్యాయం చేయడు. ఫ్యామిలీపై ఎంత ప్రేమ చూపిస్తాడో.. అంతకు డబుల్ రెట్లు నమ్మిన ప్రజలపై ప్రేమ చూపిస్తాడు.

- Advertisement -
Advertisement

also read:Madhuri Rathod:మాధురి రాథోడ్ ఫిర్యాదుతో ఈశ్వర్ సాయికి షాక్.. పోలీసుల కీలక నిర్ణయం!

ప్రజాసేవలో పవన్ కళ్యాణ్ అంకితభావం:

ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత గిరిజన ప్రాంతాల అభ్యున్నతికి, పర్యావరణ పరిరక్షణకు, మౌలిక అవసరాల కోసం ఎంత అంకితభావంతో పని చేస్తున్నాడనేది మనం చూస్తూనే ఉన్నాం. ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని ఎన్నో సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపిస్తూ.. అభివృద్ధిని మారుమూల ప్రాంతాలకు సైతం తీసుకెళ్తున్న పవన్ కళ్యాణ్‌ను చూస్తే చాలా గర్వంగా ఉంది.

- Advertisement -
Advertisement

తనను గెలిపించిన పిఠాపురం ప్రజలకు ఒక ప్రజాప్రతినిధిగానే కాకుండా.. ఒక కుటుంబ సభ్యుడిగా అండగా నిలుస్తున్నాడు. తెలుగు ప్రజలందరూ మెచ్చే నాయకుడిగా భవిష్యత్తు లక్ష్యాలను చేరుకునే క్రమంలో ప్రతి అడుగు విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

పవన్ కళ్యాణ్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో హ్యాపీగా జీవిస్తూ.. ఇంకా ఎంతో శక్తితో ప్రజాసేవ చేయాలని శ్రీ ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తున్నాను. నా తమ్ముడు పవన్ కళ్యాణ్‌కు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు’’ అంటూ సుదీర్ఘంగా పోస్ట్ చేశారు.

also read:Pragya Jaiswal: గౌన్ లో అందాలు ఆరబోస్తున్న బాలయ్య బ్యూటీ!

సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న చిరంజీవి పోస్ట్:

సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ పోస్ట్ బాగా ట్రెండ్ అవుతోంది. అన్నాదమ్ముల అనుబంధాన్ని మెగా ఫ్యాన్స్ బాగా హైలెట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్‌కు సోషల్ మీడియా వేదికగా పలువురు స్టార్ ప్రముఖులు, ఫ్యాన్స్ శుభాకాంక్షలు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడూ ఇలాగే హ్యాపీగా ఉండాలని ఆశీర్వదిస్తున్నారు.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you