Wednesday, September 2, 2026
HomeLATESTBadshah Divorce:కోట్లాది మంది ఫ్యాన్స్ హార్ట్స్ బ్రేక్..స్టార్ సింగర్ విడాకులు..!

Badshah Divorce:కోట్లాది మంది ఫ్యాన్స్ హార్ట్స్ బ్రేక్..స్టార్ సింగర్ విడాకులు..!

Badshah Divorce:బాలీవుడ్ ప్రముఖ సింగర్, ర్యాపర్ బాద్‌షా మరియు నటి ఈషా రిఖీ తమ వివాహ బంధానికి ముగింపు పలికారు.

on
- Advertisement -banner Ad

Badshah Divorce:నేటి కాలంలో ప్రేమ, పెళ్లి, విడాకులు అనేది చాలా చాలా కామన్‌గా మారిపోయింది. ఎలా అంటే చూసినగాని ప్రేమ పుట్టడం, ఆ ప్రేమ పెళ్లి వరకు వెళ్లడం, పెళ్లి తర్వాత కొన్నాళ్లు బాగానే ఉండటం, ఆ తర్వాత మా మధ్య సఖ్యత లేదు, బాండింగ్ కుదరట్లేదు అంటూ విడాకులు తీసుకోవడం, సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టడం, మా ప్రైవసీని గౌరవించండి అంటూ చేతులు దులుపుకోవడం, అటు ఇటు కొన్నాళ్ల తర్వాత ఇద్దరూ కూడా వేరే వేరే వ్యక్తులను మళ్లీ పెళ్లి చేసుకోవడం. ఇది చాలా మంది స్టార్ సెలబ్రిటీల విషయంలో చూస్తూనే వస్తున్నాం.

ఐదు నెలలకే విడిపోవాలని నిర్ణయం..:

ఇప్పుడు తాజాగా ప్రముఖ బాలీవుడ్ సింగర్, రాపర్ బాద్షా(Badshah Divorce), పంజాబీ నటి ఇషా కూడా అదే లిస్టులోకి వచ్చేశారు. పెళ్లయిన కేవలం ఐదు నెలలకే వీరిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకోవడం ఇండస్ట్రీనే కాదు, జనాలను కూడా ఆశ్చర్యపరుస్తుంది. సాధారణంగా పెళ్లయిన తర్వాత రెండు, మూడు ఏళ్లు కలిసి ఉంటారు. ఆ తర్వాతే ఎవరికైనా గొడవలు వస్తాయి. కానీ వీళ్లు మాత్రం కేవలం 5 అంటే 5 నెలలకే విడాకులు తీసుకోవాలి అంటూ నిర్ణయించుకున్నారు. నిర్ణయించుకోవడమే కాదు, ఆ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా కూడా అఫీషియల్‌గా బయట పెట్టారు. మా ప్రైవసీని గౌరవించండి అంటూ ఒక పోస్ట్ పెట్టారు. దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే బాగా హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతుంది.

- Advertisement -
Advertisement

also read:Pawan Kalyan Birthday:పవన్ కళ్యాణ్ బర్త్‌డే.. చిరంజీవి స్పెషల్ విషెస్ వైరల్!

సోషల్ మీడియా వేదికగా అధికారిక ప్రకటన :

సింగర్ బాద్షా తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ పోస్ట్ పెట్టారు. “నేను, ఇషా ఇద్దరం కూడా ఒకరిని ఒకరు గౌరవించుకుంటున్నాం. పరస్పర అంగీకారంతోనే విడిపోవాలని నిర్ణయించుకున్నాం. మేం విడాకులు తీసుకుంటున్నాం. మా ప్రైవసీని గౌరవించండి” అంటూ రాసుకొచ్చారు.

- Advertisement -
Advertisement

also read:Madhuri Rathod:మాధురి రాథోడ్ ఫిర్యాదుతో ఈశ్వర్ సాయికి షాక్.. పోలీసుల కీలక నిర్ణయం!

బాద్షాకు ఇది రెండో వివాహం:

బాద్షా మొదటిసారిగా 2012లో జాస్మిన్ మసీహ్‌ను పెళ్లి చేసుకున్నారు. 2020లో వారి మధ్య వచ్చిన మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 2026లో పంజాబీ నటి ఇషాను పెళ్లి చేసుకున్నారు బాద్షా. ఇప్పుడు వీళ్లు కూడా విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో ప్రేమ పెళ్లి అంటేనే గౌరవం లేకుండా పోయింది అంటూ పెద్దలు మండిపడుతున్నారు. అసలు పెళ్లికి గౌరవం ఇస్తున్నారా అంటూ ఫైర్ అవుతున్నారు.

- Advertisement -
Advertisement

సాహోలో బాద్షా పాటకు మంచి క్రేజ్ :

కాగా పాన్ ఇండియా సూపర్‌స్టార్ ప్రభాస్ నటించిన సాహో సినిమాలో ‘బ్యాడ్ బాయ్’ పాట పాడింది ఈ బాద్షానే. తన వాయిస్‌తో అందరినీ మిస్మరైజ్ చేసే బాద్షా.. ఫ్యామిలీ లైఫ్‌లో మాత్రం రాంగ్ డిసిషన్స్ తీసుకోవడం పట్ల ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. ప్రెజెంట్ ఈ న్యూస్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేసేస్తుంది.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you