Wednesday, October 14, 2026
HomeLATESTAishwarya Pisse:ఏడేళ్ల ప్రేమ వివాహానికి ఎండ్ కార్డ్.. భర్తతో విడాకులు తీసుకున్న ఐశ్వర్య పిస్సే!

Aishwarya Pisse:ఏడేళ్ల ప్రేమ వివాహానికి ఎండ్ కార్డ్.. భర్తతో విడాకులు తీసుకున్న ఐశ్వర్య పిస్సే!

Aishwarya Pisse:తన విడాకుల విషయంపై వస్తున్న ఊహాగానాలకు ముగింపు పలికేందుకే ఈ ప్రకటన చేస్తున్నట్లు ఐశ్వర్య తెలిపింది.తాను, తన భర్త గత ఏడాదిన్నరగా విడివిడిగా ఉంటున్నామని ఆమె వెల్లడించింది.

on
- Advertisement -banner Ad

Aishwarya Pisse:ఐశ్వర్య పిస్సే.. కన్నడ బుల్లితెరపై నటిగా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ తెలుగు ప్రేక్షకులకు కూడా ఈమె సుపరిచితమే. ముఖ్యంగా ‘అగ్నిసాక్షి’ సీరియల్‌తో తెలుగు ఆడియెన్స్‌కు దగ్గరైంది. అయితే తాజాగా ఈ అందాల నటి తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కీలక విషయాన్ని వెల్లడించింది. తన భర్త హరి వినయ్‌తో విడిపోయినట్లు, విడాకులు తీసుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దీంతో ఆమె అభిమానులు ఆశ్చర్యానికి గురవుతున్నారు.

ఏడేళ్ల క్రితం ప్రేమ వివాహం.. ఇప్పుడు విడాకులు :

ఐశ్వర్య పిస్సే కన్నడలో పలు విజయవంతమైన సీరియళ్లలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. కెరీర్‌లో బిజీగా ఉన్న సమయంలోనే హరి వినయ్‌తో ప్రేమలో పడిన ఆమె.. సుమారు ఏడేళ్ల క్రితం అతడిని వివాహం చేసుకుంది. కొంతకాలంగా వీరిద్దరూ విడిపోయారని, వేర్వేరుగా జీవిస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తాజాగా ఐశ్వర్య చేసిన ప్రకటనతో ఈ వార్తలకు స్పష్టత వచ్చింది.

- Advertisement -
Advertisement

తాను, తన భర్త గత ఏడాదిన్నరగా విడివిడిగా ఉంటున్నామని ఆమె వెల్లడించింది. ఎంతో ఆలోచించిన తర్వాత పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేసింది. ఇది పూర్తిగా తమ వ్యక్తిగత నిర్ణయమని పేర్కొంది.

నవ్య స్వామికి సోదరుడే మాజీ భర్త :

ఐశ్వర్య పిస్సే(Aishwarya Pisse) మాజీ భర్త హరి వినయ్ గురించి మరో ఆసక్తికరమైన విషయం కూడా ఉంది. అతడు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నటి నవ్య స్వామికి స్వయానా సోదరుడు. నవ్య స్వామి గతంలో ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించింది. ఐశ్వర్యతో తనకున్న అనుబంధాన్ని సరదాగా ‘హాఫ్ హజ్బెండ్’ అంటూ ఆమె పేర్కొన్న సందర్భం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఐశ్వర్య విడాకుల వార్త ఇప్పుడు బుల్లితెర వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -
Advertisement

పుకార్లపై ఐశ్వర్య ఘాటు స్పందన :

తన విడాకుల విషయంపై వస్తున్న ఊహాగానాలకు ముగింపు పలికేందుకే ఈ ప్రకటన చేస్తున్నట్లు ఐశ్వర్య తెలిపింది. తన వ్యక్తిగత జీవితంపై ఆధారాలు లేని కథనాలు ప్రచురించడం, తప్పుదారి పట్టించే వీడియోలు రూపొందించడం, సీరియళ్లలోని సన్నివేశాలను సందర్భానికి సంబంధం లేకుండా ఉపయోగించడం సరికాదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.

వార్తలకు ఆదరణ పెంచుకోవడం, వ్యూస్‌, లైక్స్‌ కోసం తన వ్యక్తిగత పరిస్థితిని ఉపయోగించుకోవడం బాధాకరమని పేర్కొంది. తెరపై కనిపించే పాత్రలకు, నిజ జీవితానికి మధ్య వ్యత్యాసాన్ని గుర్తించాలని అభిమానులు, సోషల్ మీడియా వినియోగదారులను కోరింది.

- Advertisement -
Advertisement

గోప్యతకు భంగం కలిగిస్తే చట్టపరమైన చర్యలు :

తన వృత్తి ప్రజలకు సంబంధించినదైనా, వ్యక్తిగత జీవితం మాత్రం ప్రైవేటు విషయమని ఐశ్వర్య స్పష్టం చేసింది. ఈ క్లిష్ట సమయంలో తమకు ప్రశాంతత, గోప్యత అవసరమని, తన నిర్ణయాన్ని అందరూ గౌరవించాలని విజ్ఞప్తి చేసింది. తప్పుడు ప్రచారం, పరువుకు భంగం కలిగించే కథనాలు కొనసాగితే చట్టపరమైన మార్గాలను ఆశ్రయిస్తానని హెచ్చరించింది.

ప్రస్తుతం ఐశ్వర్య పిస్సే చేసిన ఈ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇన్నాళ్లూ కలిసి ఉన్న జంట విడిపోవడం అభిమానుల్లో చర్చకు దారితీసింది. అయితే ఈ సమయంలో ఆమె కోరినట్లుగా వ్యక్తిగత గోప్యతను గౌరవించడం, నిర్ధారణ లేని వార్తలను ప్రచారం చేయకుండా ఉండటం ఎంతో ముఖ్యం.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you