The dirty picture 2:ఒకప్పుడు వెండితెర పై తమ గ్లామర్ తో ఆకట్టుకొని, ఎంతోమంది స్టార్ హీరోల చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్న నటీమణులు చివరకు అనూహ్య పరిస్థితులలో కన్ను మూసిన సెలబ్రిటీలు చాలామంది ఉన్నారు. అలా ఎంతోమంది సెలబ్రెటీల జీవితాల కథను ఆధారంగా తీసుకొని పలు చిత్రాలు తెరకెక్కిస్తున్నారు. అలా తెరకెక్కించిన చిత్రాలలో ది డర్టీ పిక్చర్ సినిమా కూడా అప్పట్లో ప్రసంశలు అందుకుంది. ముఖ్యంగా సిల్క్ స్మిత జీవిత కథ ఆధారంగా కొన్ని అంశాలను ఇందులో రూపొందించి ఈ సినిమాని విడుదల చేశారు.
నిషా నూర్ జీవిత కథగా ది డర్టీ పిక్చర్ 2..
ఈ సినిమా విడుదలయి.. ఇప్పటికి 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రముఖ నిర్మాతలలో ఒకరైన నిర్మాత ఏక్తాకపూర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. సినీ పరిశ్రమలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న ఒక మహిళ తన నిజ జీవితం కథతో ది డర్టీ పిక్చర్ 2 (The dirty picture 2)సినిమాను రూపొందించబోతున్నట్లు స్వయంగా ఏక్తా కపూర్ వెల్లడించింది. ఇప్పుడు ఈ సినిమాలో ఎవరు కథానాయికగా నటిస్తారు అనే విషయం ఇప్పుడు అందరిలో ఆసక్తి పెంచేలా చేస్తోంది. కానీ వినిపిస్తున్న రూమర్ ప్రకారం ఒకప్పుడు సినీ పరిశ్రమలో ఒక వెలుగు వెలిగిన నటి నిషా నూర్ జీవిత కథ ఆధారంగానే ఈ చిత్రాన్ని తీయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
also read:Aishwarya Pisse:ఏడేళ్ల ప్రేమ వివాహానికి ఎండ్ కార్డ్.. భర్తతో విడాకులు తీసుకున్న ఐశ్వర్య పిస్సే!
జీవితంలో కొన్ని ప్రత్యేకమైన ఘటనలతో మూవీ..
1980లో మలయాళం, తమిళ సినీ పరిశ్రమలో నిషా నూర్ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నది. మోహన్ లాల్, కమలహాసన్, మమ్ముట్టి వంటి అగ్ర హీరోల సరసన నటించిన ఎంతోమంది దర్శకులతో పనిచేసింది నిషా నూర్.. ఎన్నో పాత్రలలో నటించి తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న నిషా నూర్ వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంటూ ఆమె కెరియర్ లో .. ఆ తర్వాత అనూహ్యంగా మలుపులు తిరిగాయి . వెంట వెంటనే అవకాశాలు తగ్గడం, వ్యక్తిగత సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు తలెత్తడం వంటివి ఆమె జీవితం పైన ఎలా ప్రభావితం చేశాయి అనే కథాంశంతో సినిమాని తెరకెక్కించబోతున్నట్లు వినిపిస్తోంది.
also read:Tollywood Directors:టాలీవుడ్‌లో కుర్ర డైరెక్టర్ల ఓవర్ కాన్ఫిడెన్స్.. రెండో సినిమాతోనే అసలు పరీక్ష!
నిషా నూర్ పాత్ర పోషించేదెవరు?
ముఖ్యంగా సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి అయ్యుండి.. ఆమెను వ్యభిచారంలోకి నెట్టారనే ఆరోపణలు కూడా అప్పట్లో ఎక్కువగా వినిపించాయి. ముఖ్యంగా ఆమెకు ఎయిడ్స్ సోకిందని చివరి రోజుల్లో చాలా దయనీయ పరిస్థితులలో జీవించారని అప్పట్లో కథలుగా వార్తలు వినిపించాయి. కానీ వీటన్నిటిని అధికారికంగా ధ్రువీకరించలేదు. నిషా నూర్ చివరిగా 2007లో మరణించింది. మరి ఇప్పుడు ఈమె జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా సినిమాని తీయబోతున్నట్లు వినిపిస్తున్నాయి. సిల్క్ స్మిత జీవితంలో జరిగిన కొన్ని అంశాలను తీసుకొని తెరకెక్కించిన ది డర్టీ పిక్చర్ సినిమాలో విద్యాబాలన్ నటించారు. ఈ సినిమా నటనతో ప్రశంశలు అందుకుంది. 2011లో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోగా, జాతీయస్థాయిలో విద్యాబాలన్ కి గుర్తింపు తెచ్చి పెట్టింది. మరి ఇప్పుడు ది డర్టీ పిక్చర్ 2 సినిమా తెరకెక్కిస్తున్నారని తెలిసి మరింత ఆసక్తి పెంచేసారు ఏక్తా కపూర్. మరి ఇందులో ఎవరెవరు నటిస్తారో చూడాలి.
the dirty picture 2 happening.. confirmed by Ekta Kapoor. https://t.co/zCNqt2cybS
— ABID KKC ~ GunmaasterG9 🔫 ~ (@KkcAbid) October 12, 2026




