Mamitha Baiju:ప్రస్తుత వరస చిత్రాలతో బిజీగా ఉన్న మలయాళం హీరోయిన్స్ లలో మమితా బైజు కూడా ఒకరు. తన అందం, అభినయంతో, నటనతో ఎన్నో చిత్రాలలో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ మలయాళ సినీ పరిశ్రమతో పాటుగా తెలుగు ,తమిళ్ ఇండస్ట్రీలో కూడా తనదైన ముద్ర వేసుకుంటుంది. ఇప్పుడు దక్షిణాది ప్రేక్షకులకు మరింత దగ్గరవుతోంది ఈ ముద్దుగుమ్మ. ప్రేమలు సినిమా భారీ విజయం అవడంతో గుర్తింపు సంపాదించుకున్న మమితా బైజు ఆ తర్వాత మూడు బడా చిత్రాలలో నటించి అందరిని ఆకట్టుకుంది.
యంగ్ హీరో తో మమిత బైజు పెళ్లి..
ముఖ్యంగా విజయ్ తో జననాయగన్ సినిమాలో నటించి ఆకట్టుకోగా .. ఆ తర్వాత సూర్యతో నటించిన విశ్వనాథ్ అండ్ సన్స్, అలాగే నివిన్ పౌలితో నటించిన బెత్లెహెమ్ కుటుంబ యూనిట్ సినిమా కూడా మంచి విజయాలను అందించింది. ఇందులో తన సహజమైన నటన పాత్రకు తగ్గ బావోద్వేగాలు, ఆమె చిలిపి చేష్టలు , నటనతో కుర్రాళ్ళ ఫేవరెట్ హీరోయిన్ గా మారిపోయింది. అయితే గత కొద్ది రోజులుగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాబోతున్న జై హనుమాన్ ప్రాజెక్టులో కూడా ఒక కీలకమైన పాత్రలో నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వినిపిస్తున్నాయి. వీటికి తోడు మమితా బైజు(Mamitha Baiju) వివాహానికి సంబంధించి కూడా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
also read:Imanvi:డార్లింగ్ మనసు బంగారం.. ఇమాన్వీ బర్త్డేకు అదిరిపోయే గిఫ్ట్!
రూమర్స్ కి చెక్..
గత కొంతకాలంగా ఒక యంగ్ హీరోతో ప్రేమలో ఉందని, వీరిద్దరూ రీసెంట్గా ఇటీవలే ఒక ప్రైవేట్ పార్టీకి వెళ్లి వచ్చారని రూమర్స్ వినిపించాయి. అలాగే వీరిద్దరూ వివాహానికి కూడా ఇంట్లో వారు ఒప్పుకున్నారని, ఈ ఏడాది డిసెంబర్లో వివాహం చేసుకోబోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతుంది. కానీ ఆ యంగ్ హీరో పేరు మాత్రం బయటికి రాలేదు.. ఈ విషయంపై అభిమానులు ఆరా తీస్తున్నారు. అయితే మమితా బైజు ప్రతి విషయాన్ని కూడా ఆమె సోదరుడు మిథున్ బైజు నే నిర్ణయిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. తనకు వచ్చే లవ్ ప్రపోజల్ ని హ్యాండిల్ చేసేది కూడా అతడే అని తాజాగా సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులకు మమితా బైజు ఫన్నీగా సమాధానాన్ని తెలిపింది.
also read:Sree Mukhi: మినీ ఫ్రాక్ లో శ్రీముఖి అందాలు.. అదరహో అనిపిస్తున్న గ్లామర్ హోయలు!
మమితా మూవీ ప్రాజెక్ట్..
దీంతో మమితా బైజు వివాహానికి సంబంధించి రూమర్స్ కి పుల్ స్టాప్ పడింది. ఈ ఏడాది వరుసగా హిట్లు అందుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తమిళంలో ఇరండు వానంలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని డి రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో విష్ణు విశాల్ హీరోగా నటిస్తూ ఉండడం గమనార్హం. వరుస విజయాలతో మంచి పాపులారిటీ సంపాదించుకుంటున్న మమితా బైజు పెళ్లి వార్త అనగానే అభిమానులు సైతం ఆశ్చర్యపోయారు. కానీ ఈ విషయం పైన ఆమె స్వయంగా ఫన్నీగా రియాక్షన్ ఇవ్వడంతో ఇప్పుడు అభిమానులు ఈ విషయాన్ని లైట్ తీసుకుంటున్నారు. మరి రాబోయే రోజుల్లో స్టార్ హీరోల చిత్రాలలో నటించి లక్కీ హీరోయిన్గా మారుతుందేమో చూడాలి మరి.




