Mrunal thakur:టాలీవుడ్, బాలీవుడ్లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న హీరోయిన్లలో మృణాల్ ఠాకూర్ కూడా ఒకరు. సీతారామం చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఈ ముద్దుగుమ్మ.. అంతకుముందు బాలీవుడ్లో పలు చిత్రాలలో సీరియల్స్ లో కూడా నటించింది. సీతారామం చిత్రం తర్వాత హాయ్ నాన్న సినిమాతో మరో విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ది ఫ్యామిలీ స్టార్, కల్కి , డెకాయిట్ వంటి చిత్రాలతో ప్రేక్షకులను బాగా అలరించింది. ప్రస్తుతం హిందీ, తెలుగు చిత్రాలతో బిజీగా ఉన్న మృణాల్ ఠాకూర్ సినిమాలకు కాస్త విరామం ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
సినిమా ఆఫర్స్ రిజెక్ట్ చేస్తున్న మృణాల్..
గడచిన తొమ్మిది నెలలుగా ఏ సినిమాని అంగీకరించలేదట ఈ ముద్దుగుమ్మ.. అయితే అవకాశాలు లేకపోవడం వల్ల ఆమె సినిమాలకు దూరంగా లేదని, తన వద్దకు వస్తున్న కథలలోని పాత్రలు తనకి నచ్చకపోవడం వల్లే ఆమె అంగీకరించలేదనే విధంగా వినిపిస్తున్నాయి. కేవలం వరుస ప్రాజెక్టులు చేయడమే కాకుండా తన మనసుకు నచ్చే కథ కోసం వేచి చూడటానికి ఇంత ప్రాధాన్యత ఇస్తోందట మృణాల్ ఠాకూర్. అందుకే సినిమా ఎంపిక విషయంలో నటిగా తనకు తన పాత్ర తృప్తిని కలిగిస్తేనే ఆ పాత్రకు మంచి గుర్తింపు తెచ్చి పెట్టేలా ఉంటుందనే భావనతో ఉన్నది.
also read:Actress Anandi:స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న హీరోయిన్ ఆనంది..!
రాకా లో నటిస్తోందా?
కేవలం బిజీగా ఉండడం కోసం సినిమాలకు సంతకం చేయకుండా తన పాత్ర వల్ల తనకు గర్వపడేలా బలమైన పాత్రలను ఎంచుకోవడమే తన లక్ష్యం అన్నట్లుగా తెలియజేస్తుంది. ప్రస్తుతమైతే అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో రాబోతున్న రాకా సినిమాలో నటిస్తోందని రూమర్స్ వినిపించాయి. ఇప్పటివరకు ఇందుకు సంబంధించి అధికారికంగా ప్రకటన కూడా వెలబడలేదు. గతంలో కూడా తన తదుపరి ప్రాజెక్టులను స్వయంగా తానే ప్రకటిస్తానని కూడా తెలియజేసింది. ప్రస్తుతం అయితే మృణాల్ ఠాకూర్ తదుపరి సినిమా ఏంటి? అనే విషయంపై అభిమానులు కూడా చాలా ఆసక్తికరంగా ఎదురు చేస్తున్నారు. అంతేకాకుండా ఆమె పడుతున్న ఈ నిరీక్షణకు ఒక అద్భుతమైన పాత్ర రావాలని కోరుకుంటున్నారు.
also read:Kriti Sanon: ట్రెడిషనల్ లుక్ లో ఆకట్టుకుంటున్న కృతి సనన్!
మృణాల్ ఠాకూర్ కెరియర్..
మృణాల్ ఠాకూర్ కెరియర్ విషయానికి వస్తే.. 2014లో హలో నందన్ అనే మరాఠి సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. 2018లో లవ్ సోనియా అనే చిత్రంతో బాలీవుడ్లోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ.. హిందీ జెర్సీ సినిమాలో నటించి మరింత క్రేజీ సంపాదించింది. ఆ తర్వాతే సీతారామం చిత్రంలో అవకాశం రావడంతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చింది. కెరియర్ పరంగా స్టార్ హీరోల చిత్రాలలో నటించే అవకాశాలు అందుకుంటున్నా.. సరైన సక్సెస్ మాత్రం అందుకోలేకపోతోంది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్గా ఉంటూ గ్లామర్ ఫోటోలను షేర్ చేయడమే కాకుండా అప్పుడప్పుడు పలు రకాల ఈవెంట్స్ కి కూడా వెళ్తూ అట్రాక్షన్ గా నిలుస్తూ ఉంటుంది.




