Poonam Kaur :టాలీవుడ్లో నటిగా, హీరోయిన్గా పేరు సంపాదించిన పూనమ్ కౌర్ గురించి చెప్పాల్సిన పనిలేదు. అందం, అభినయం ఉన్నప్పటికీ ఎందుకో సినిమాలలో సక్సెస్ కాలేకపోయింది. కానీ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు రకాల విషయాలను అభిమానులతో పంచుకుంటూ హాట్ టాపిక్ గా మారుతూ ఉంటుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో టాలీవుడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ను టార్గెట్ గా చేస్తూ ఈమె చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారుతూ ఉంటాయి. పూనం కౌర్ చాలా సందర్భాలలో పరోక్ష వ్యాఖ్యలు కూడా చేసింది.
త్రివిక్రంపై మరో సంచలన పోస్ట్..
గత కొద్దిరోజులుగా వరుస ట్విట్ట్లు వేస్తూ ఉన్న పూనం ఈసారి ఏకంగా త్రివిక్రమ్ పేరును ప్రస్తావించడంతో అసలు ఏం జరుగుతోంది అనే విషయంపై పలువురు నెటిజన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పూనం పోస్టులు ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే చర్చనీయాంశంగా మారుతున్నాయి. “నీలో ఇక పాత వినోదం లేదు త్రివిక్రమ్ శ్రీనివాస్.. గతంలో నువ్వు సాధించిన ఆ ఉన్నత స్థాయికి ఇప్పుడు మళ్లీ ఎప్పటికీ వెళ్లలేవు” అంటూ చేసిన పోస్ట్ ఒక్కసారిగా దుమారాన్ని సృష్టిస్తోంది. మాటలు మాంత్రికుడిగా పేరు సంపాదించిన త్రివిక్రమ్ డైరెక్షన్ ని ఆయన మార్కుని నేరుగా కామెంట్స్ రూపంలో చేయడంతో నేటిజన్ సైతం పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
also read:actress Haritha :ముద్దమందారం సీరియల్ నటి హరిత కొత్త అవతారం.. ఏకంగా బిజినెస్లోకి!
భార్యపైనే చేయి చేసుకున్న వ్యక్తి..

పూనం కౌర్(Poonam Kaur )చేసిన ఈ వ్యాఖ్యలు అటు డైరెక్టర్ సినిమా పైన విమర్శలా లేకపోతే వ్యక్తిగతంగా ఆయనను ఉద్దేశించి చేసినవా అనే విషయాలు ఇప్పుడు అభిమానులకు అర్థం కావడం లేదు.. ఇదంతా ఇలా ఉండగా పూనం కౌర్ చేసిన మరో పోస్ట్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.. అదేమిటంటే ఒక నటి కోసం తన సొంత భార్యపైనే చేయి చేసుకుని కోమాలోకి వెళ్లేలా దాడికి తెగబడ్డాడు అంటూ ఒక వ్యక్తి పైన మైండ్ బ్లోయింగ్ ఆరోపణలు చేయడం ఇప్పుడు మరోసారి సంచలనంగా మారింది. అయితే ఈ పోస్టులో ఆమె ఆ వ్యక్తి పేరును మాత్రం బహిర్గతం చేయకపోయినప్పటికీ చాలామంది గురూజీ అని పిలవబడే దర్శకుడిని ఉద్దేశించి ఈమె ఈ స్థాయిలో వ్యాఖ్యలు చేసిందంటూ చాలామంది చర్చించుకుంటున్నారు.
also read:Movie Sequels:సినిమాలలో సీక్వెల్స్ హవా.. రాబోయే సినిమాలు ఇవే..!
త్రివిక్రమ్ స్పందిస్తారా?
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎక్కువమంది త్రివిక్రమ్ ను గురూజీ అని పిలుస్తూ ఉండడంతో ఈ పోస్ట్ ఆయనను ఉద్దేశించే పెట్టిందా అంటూ పలువురు సైతం కామెంట్ చేస్తున్నారు. కానీ పూనం కౌర్ మాత్రం తన పోస్టులలో నేరుగా పేరును చెప్పకపోవడంతో చాలామంది ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించింది అన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. గడిచిన కొద్ది రోజుల క్రితం తన కుటుంబ సభ్యుల బలహీనతను ఆసరాగా చేసుకొని వారి ద్వారా తనకు వ్యతిరేకంగా ఒక ప్రకటన ఇప్పించుకున్నారని అంటూ త్రివిక్రమ్ ను ఉద్దేశించి పలు రకాల ఆరోపణలు కూడా చేసింది.
గత కొంతకాలంగా పూనం కౌర్, త్రివిక్రమ్ మధ్య విభేదాలు ఉన్నాయనే విషయం ఇండస్ట్రీలో అందరికీ తెలిసిన విషయమే . తన కెరియర్ నాశనం కావడానికి, అవకాశాలు రాకపోవడానికి త్రివిక్రమే కారణమంటూ చాలా సందర్భాలలో ఆమె పరోక్షంగా విమర్శించింది. ఇప్పుడు మరొకసారి విమర్శలు చేయడంతో ఈ విషయం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.




