Friday, October 16, 2026
HomeLATESTRamayana Yash:రామాయణ రూ.4,000 కోట్ల బడ్జెట్ పై నిజం చెప్పిన యశ్..!

Ramayana Yash:రామాయణ రూ.4,000 కోట్ల బడ్జెట్ పై నిజం చెప్పిన యశ్..!

Ramayana Yash: కన్నడ సినీ నటుడు యశ్ రామాయణ సినిమా బడ్జెట్ పై తన అభిప్రాయాన్ని చెప్పి ఇండియన్ సినిమా పట్ల తనకున్న గౌరవాన్ని నిరూపించారు.

on
- Advertisement -banner Ad

Ramayana Yash:భారతీయ సినీ చరిత్రలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం రామాయణ. ఈ చిత్రాన్ని బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఇందులో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతాదేవి పాత్రలో, యశ్ రావణుడిగా కనిపించబోతున్నారు. సుమారుగా 4వేల కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు వార్తలయితే జోరుగా జరుగుతున్నాయి. ఇటీవల సినిమా ప్రమోషన్స్ లో పదేపదే బడ్జెట్ గురించి ప్రస్తావిస్తూ విమర్శలు చేయడం పైన యశ్ మాట్లాడుతూ ఈ విధంగా స్పందించారు.

బడ్జెట్ బయటకు చెప్పడం పై యశ్ క్లారిటీ..

ఇటీవల నిర్వహించిన సినిమా ప్రమోషన్స్ లో అంతర్జాతీయ ప్రేక్షకులకు భారతీయ సినిమా స్థాయిని పరిచయం చేయడానికి ఈ బడ్జెట్ వివరాలను వెల్లడిస్తున్నామంటూ తెలియజేశారు యశ్. అక్టోబర్ 15న బెంగళూరులో జరిగిన రామాయణ ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో యశ్ (Ramayana Yash)పాల్గొని ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. విదేశాలలో చిత్రాన్ని ప్రమోట్ చేసేటప్పుడు దాని నిర్మాణ స్థాయి పెట్టుబడి గురించి ధైర్యంగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది అని తన అభిప్రాయంగా వెల్లడించారు. తక్కువ బడ్జెట్ చిత్రంగా పరిచయం చేస్తే అంతర్జాతీయ ప్రేక్షకులు ఆ సినిమాకి తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవచ్చు అంటూ తెలియజేశారు.

- Advertisement -
Advertisement

also read:Poonam Kaur :త్రివిక్రమ్ పై మరో సంచలన పోస్ట్ చేసిన పూనం కౌర్..!

అందుకే బహిర్గతం చేస్తున్నాము..

నమిత్ మల్హోత్ర రామాయణ చిత్రం కోసం 4,000 కోట్ల రూపాయల ఖర్చు చేస్తున్నామని చెప్పినప్పటి నుంచి చాలామంది ఆయనను విమర్శిస్తున్నారు.. మనదేశంలో ఇదే ఒక సమస్య.. విదేశాలకు వెళ్లి మన చిత్రాలను ప్రమోట్ చేసేటప్పుడు తక్కువ బడ్జెట్ అని చెబితే కచ్చితంగా అక్కడ ప్రేక్షకులు దానికి తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవచ్చు.. సినిమా నిర్మాణానికి ఎంత పెట్టుబడి పెట్టామో ఆ విషయాన్ని ఆత్మవిశ్వాసంతో కచ్చితంగా చెప్పాలి. మన దేశాన్ని మనం ఏమి చేయగలము ప్రపంచానికి చూపించాలి అంటూ యశ్ తెలియజేశారు. యశ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

- Advertisement -
Advertisement

also read:actress Haritha :ముద్దమందారం సీరియల్ నటి హరిత కొత్త అవతారం.. ఏకంగా బిజినెస్‌లోకి!

ఇండియన్ సినిమాని తక్కువ చేయకూడదు..

రామాయణ చిత్రం కేవలం ఒక భారీ బడ్జెట్ చిత్రంగానే కాకుండా భారతీయ సినిమా సాంకేతిక సామర్థ్యాన్ని అంతర్జాతీయ వేదికల పైన ప్రదర్శించే అవకాశం వంటిది అంటూ తన అభిప్రాయంగా తెలిపారు యశ్. ఇలాంటి భారీ ప్రాజెక్టు నిర్మించడానికి అవసరమైన పెట్టుబడి, సాంకేతిక నైపుణ్యం ప్రపంచ ప్రేక్షకులకు తెలియజేయడమే ముఖ్యమని వెల్లడించారు. అలాగే మన దేశంలో రూపొందించే చిత్రాలను మనమే తక్కువ చేసి మాట్లాడకూడదని, ఇండియన్ సినీ పరిశ్రమలో సాధిస్తున్న పురోగతిని గుర్తించి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులందరికీ కూడా మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు యశ్. ఇలాంటి చిత్రాలను విమర్శించే ముందు వాటి వెనుక ఉన్న ప్రయత్నాన్ని లక్ష్యాన్ని కూడా ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలని సూచించారు. రామాయణ చిత్రంలో రవి దుబే, రకుల్ ప్రీతిసింగ్ తదితర నటీనటులు కీలకమైన పాత్రలో నటిస్తున్నారు ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా, ఈ ఏడాది దీపావళికి మొదటి భాగాన్ని విడుదల చేయబోతున్నారు. రెండవ భాగాన్ని వచ్చే ఏడాది దీపావళి కానుకగా రిలీజ్ చేసేలా చిత్ర బృందం ప్లాన్ చేసింది. తెలుగు సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని అక్టోబర్ 19వ తేదీన జేఆర్సి కన్వెన్షన్ లో జరగనున్నట్లు అధికారికంగా చిత్ర బృందం ప్రకటించారు.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you