Music director Deva:ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవా కన్నుమూసినట్టు తెలుస్తోంది. గత కొద్దిరోజులుగా తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఆయన శనివారం రోజున తుది శ్వాస విడిచినట్లు సమాచారం. ప్రస్తుతం ఈయన వయసు 75 సంవత్సరాలు. ఈ వార్త విన్న సినీ ప్రముఖులు , ఆయన అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. 1986లో తమిళ సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. దేవా తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ వంటి భాషలలో వందలాది చిత్రాలకు సంగీతాన్ని అందించారు.
మూడు దశాబ్దాల సినీ కెరియర్లో ఎన్నో సూపర్ హిట్ మూవీస్..
1950 నవంబర్ 20న దేవా(Music director Deva) జన్మించారు. తమిళ సినీ పరిశ్రమలో ప్రముఖ సంగీత దర్శకులలో ఒకరిగా పేరు సంపాదించారు.. తన విలక్షణమైన జానపద స్వరాలతో ప్రధాన చిత్రాలకి అందించిన సంగీతం ఆయన చేసిన కృషికి ప్రసిద్ధి చెందారు. మూడు దశాబ్దాలకు పైగా తన కెరీర్లో పురోగతి సాధించిన దేవా తెలుగు, తమిళ్ ,కన్నడ, మలయాళం భాషలలో ఎన్నో వందలాది చిత్రాలకు సంగీతాన్ని అందించారు. దేవాకి ప్రముఖ చిత్ర నిర్మాతలు, నటులతో మంచి స్నేహబంధం ఉండేది. అన్నామలై, భాష, కాదల్ కొట్టాయి, ప్రియముదన్, వాలీ, ఖుషీ వంటి చిత్రాలు ఈయన కెరీర్ కి మైలురాయిగా నిలిచాయి.
ALSO READ:Ananya Nagalla:రెడ్ డ్రెస్లో అనన్య నాగళ్ల గ్లామర్ షో.. ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్!
కొడుకు కూడా సంగీత దర్శకుడు..
వాణిజ్యపరంగా విజయవంతమైన ఎన్నో చిత్రాలకు బిజిఎం రూపొందించడంలో ఇతని సంగీతం కీలకమైన పాత్ర పోషించింది. చెన్నై గాన సంప్రదాయంలో సంగీత దర్శకుడుగా పేరు సంపాదించారు. ఉత్సాహభరితమైన జానపద ప్రభావం గల పాటలు ప్రత్యేకంగా నిలిచాయి. దేవా వివిధ శైలులలో తన బహుముఖ ప్రజ్ఞానాలను కూడా ప్రదర్శించారు. ఈయన సేవలకు గాను తమిళనాడు ప్రభుత్వం కళైమామని పురస్కారంతో పాటు ఎన్నో గౌరవాలు కూడా అందుకున్నారు. అలాగే ఆయన చేసిన కృషికి గాను ఉత్తమ సంగీత దర్శకుడుగా తమిళనాడు రాష్ట్ర చలనచిత్రం పురస్కారం కూడా అందుకున్నారు. దేవా కుమారుడు శ్రీకాంత్ దేవా కూడా సినీ పరిశ్రమలో సంగీత దర్శకుడుగా రాణిస్తున్నారు.
ALSO READ:Ranbir Kapoor:రామాయణ ఈవెంట్ లో రణబీర్ కపూర్ చేతికి కట్టుకున్న వాచ్ ధర ఎంతో తెలుసా..?
దేవా మ్యూజిక్ అందించిన తెలుగు చిత్రాలు..
దేవా తెలుగులో అందించిన చిత్రాల విషయానికి వస్తే.. తొలిప్రేమ, మాస్టర్, ప్రేమలేఖ, పంచతంత్రం, నాగ తదితర చిత్రాలు కూడా ఉన్నాయి. దేవ తన సోదరుడు అయిన చంద్రబోస్తో కలిసి మ్యూజిక్ బ్యాండ్ కూడా ఎక్కువగా నడిపేవారు. తమిళ సినీ పరిశ్రమలో గానా పాటలు అనగానే దేవా నే గుర్తుకు వచ్చే అంతలా తన పేరుని క్రియేట్ చేసుకున్నారు. ఇళయరాజ వంటి సంగీత దర్శకులు హవా కొనసాగుతున్న సమయంలో కూడా దేవస్థాన ప్రత్యేకమైన మ్యూజిక్ తో అందరిని ఆకట్టుకున్నారు. అయితే ఆయన ఆకస్మిక మరణం పట్ల పలువురు సినీ సెలబ్రిటీలు, అభిమానులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.




