Wednesday, September 9, 2026
HomeLATESTBalakrishna:బాలయ్య -కొరటాల శివ షూటింగ్ మొదలు అప్పుడే..!

Balakrishna:బాలయ్య -కొరటాల శివ షూటింగ్ మొదలు అప్పుడే..!

Balakrishna: నటసింహ నందమూరి బాలకృష్ణ కొరటాల శివ దర్శకత్వంలో చేయబోయే కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యేది ఆరోజే నట.

on
- Advertisement -banner Ad

Balakrishna:నందమూరి బాలకృష్ణ , డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో సినిమా అనౌన్స్మెంట్ ప్రకటించినప్పటి నుంచి ఈ సినిమా గురించి ఏవేవో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. సినిమా షూటింగ్ మొదలవుతుందనుకున్న సమయంలో బాలయ్యకు సినిమా షూటింగ్లో గాయం కావడం చేత సినిమా షూటింగ్ ఆలస్యం అయ్యిందని తెలుస్తోంది. మళ్లీ ఆ తర్వాత ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన కూడా వెలువడలేదు. ముఖ్యంగా ఈ సినిమాలో గతంలో ఎన్నడు లేని విధంగా బాలకృష్ణ సరికొత్త మేకోవర్ తో కనిపించబోతున్నట్లు వార్తలు వినిపించాయి. సాధారణంగా డైరెక్టర్ కొరటాల శివ మార్క్ చిత్రాలలో కనిపించే సామాజిక దృక్పథం, కుటుంబం భాగద్వేగాల సీన్స్ సినిమాలో ప్రధాన బలంగా ఉండబోతున్నాయట.

బాలకృష్ణ – కొరటాల శివ మూవీ షూటింగ్ ఆరోజే..

కేవలం మాస్ హంగులకే కాకుండా ప్రతి ఒక్కరిని కదిలించి యూనివర్సల్ ఎమోషనల్ పాయింట్ తోనే తాజా చిత్రాన్ని సిద్ధం చేయబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇందుకు సంబంధించి మొదటి షెడ్యూల్ ని కూడా అక్టోబర్ మొదటి వారం నుంచి మొదలుపెట్టబోతున్నట్లు వినిపిస్తోంది. సినిమా షూటింగ్ మొదలైనప్పటికీ కూడా కథానాయకుడుగా బాలకృష్ణ(Balakrishna) పాల్గొనడం లేదని, ఆయన లేని కొన్ని ప్రదాన సీన్స్ ని కూడా తీసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కోసం ఆర్ట్ డైరెక్టర్ ఆధ్వర్యంలోనే భారీ సెట్ వేసినట్లుగా తెలుస్తోంది. దాదాపుగా 15 రోజులపాటు నిరంతరం షూటింగ్ జరగబోతున్నట్లు సమాచారం.

- Advertisement -
Advertisement

also read:Epic Movie:సెన్సార్ పూర్తి చేసుకున్న ఎపిక్.. ఫ్యామిలీ ఆడియన్స్ దూరమేనా?

హీరోయిన్, విలన్ గా ..ఇద్దరు హీరోయిన్స్..

ఈ సినిమాలో హీరోయిన్ ఎంపిక పైన గత కొద్దిరోజులుగా ఏవేవో రూమర్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మలయాళ భామ ఐశ్వర్య లక్ష్మి నే హీరోయిన్గా దాదాపుగా ఖరారు చేసినట్లు టాక్ వినిపిస్తోంది. అలాగే మరో వైవిధ్యమైన పాత్రలో నటించేందుకు మరొక హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ని ఇందులో లేడీ విలన్ గా సరికొత్త నెగటివ్ షేడ్ లో కనిపించే విధంగా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈసారి సరికొత్తగా డైరెక్టర్ కొరటాల శివ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే అనిరుధ్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. అలాగే సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యే సమయానికి ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయడానికి చిత్ర బృందం ప్రయత్నాలు చేస్తుంది.

- Advertisement -
Advertisement

also read:Prabhash:ప్రభాస్ సినిమాలపై అభిమానులకు టెన్షన్..!

బాలకృష్ణ తదుపరి చిత్రాలు..

ఐశ్వర్య లక్ష్మి కింగ్ ఆఫ్ కోత, మట్టి కుస్తీ, మట్టి కుస్తీ 2 , పొన్నియన్ సెల్వన్ తదితర చిత్రాలలో నటించింది. బాలకృష్ణ ప్రస్తుతం డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో దాదా సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది.. ఈ చిత్రాన్ని కూడా ఈ ఏడాది డిసెంబర్ 24 న విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన వీడియోలు కూడా సినిమా పైన అంచనాలను పెంచేశాయి. ఇందులో కూడా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. మంచు మనోజ్ విలన్ పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you