Thursday, October 15, 2026
HomeLATESTAllu Aravind:కుమారుడికి అల్లు అరవింద్ ముద్దు పేరు పెట్టుకున్న టాలీవుడ్ డైరెక్టర్..!

Allu Aravind:కుమారుడికి అల్లు అరవింద్ ముద్దు పేరు పెట్టుకున్న టాలీవుడ్ డైరెక్టర్..!

Allu Aravind: ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ ముద్దు పేరును ఒక స్టార్ డైరెక్టర్ తన కుమారుడికి పెట్టుకున్నారని తెలిసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

on
- Advertisement -banner Ad

Allu Aravind:టాలీవుడ్లో టాలెంట్ ఉండే డైరెక్టర్లలో డైరెక్టర్ పరుశురామ్ కూడా ఒకరు. తన కెరియర్ ప్రారంభంలో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ వంటి దర్శకుల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. ఆ తర్వాత యువత అనే చిత్రాన్ని తెరకెక్కించి , డైరెక్టర్గా మొదటి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు పరశురామ్. ఆ తర్వాత రవితేజ తో తెరకెక్కించిన ఆంజనేయులు సినిమా యావరేజ్ గా ఆడినా, నిర్మాతలకు బాగానే లాభాలను తెచ్చిపెట్టింది. ఆ తర్వాత నారా రోహిత్ తో కలిసి సోలో సినిమాని తెరకెక్కించగా.. మంచి విజయాన్ని అందుకున్నారు.

పొగిడిన వాళ్లే గాయపరిచారు..

ఆ తర్వాత మళ్లీ రవితేజతో కలిసి సారొచ్చారు సినిమా తీయగా.. ఈ సినిమా పెద్దగా ఆడలేదు. డిజాస్టర్ గా మిగిలిపోయింది. దీంతో సహజంగానే ఈ డైరెక్టర్ కు అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో డైలమాలో ఉన్న సమయంలో ఈ డైరెక్టర్ కి అండగా నిలిచిన ఒక బడా ప్రొడ్యూసర్ గురించి తాజా ఇంటర్వ్యూలో తెలియజేశారు. డైరెక్టర్ పరశురామ్ మాట్లాడుతూ.. సోలో సినిమా తర్వాత మా చుట్టూ ఉన్నవాళ్లు.. త్రివిక్రమ్, పూరీ జగన్నాథ్ తర్వాత నువ్వే అంటూ పొగడడం మొదలుపెట్టారు. ఆ తరువాత రవితేజతో చేసిన సారొచ్చారు సినిమా నా డ్రీమ్ ప్రాజెక్టు కానీ కొన్ని తప్పుల వల్ల ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు, ఆ సినిమాతో నన్ను అప్పటివరకు త్రివిక్రమ్, పూరీజగన్నాథ్ అంటూ పొగిడిన వాళ్ళే వదిలేసి వెళ్లిపోయారని తెలిపారు.

- Advertisement -
Advertisement

also read:Chiranjeevi:చిరంజీవి ‘కాకా’లో కత్తిలాంటి విలన్…ఇక బాక్సాఫీస్ దగ్గర రచ్చరచ్చే!

బన్నీ వాసునే ఊపిరి పోశారు..

అలా వదిలేసి వెళ్లకుండా.. తనను మానసికంగా గాయపరిచి వెళ్లారని తెలిపారు డైరెక్టర్ పరశురామ్. సారొచ్చారు సినిమా తర్వాత నాకు మూడేళ్ల వరకు ఎలాంటి సినిమా ఆఫర్ కూడా రాలేదని , ఆ సమయంలో తనకు బన్నీ వాసు చాలా మంచి స్నేహితుడుగా మారారు. అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడే వారు కూడా.. ఏవైనా కథలు రాస్తున్నారా? అని అడిగేవారు. బన్నీ వాసుతో మాట్లాడితే తనకు చాలా రిలీఫ్ గా ఉండేది. అలాగే బన్నీ వాసు నుంచి ఫోన్ వస్తే ఏదైనా ఆఫర్ వస్తుందేమో అని చాలా ఆశగా చూసే వాడినని తెలిపారు. అలా మూడేళ్ల తర్వాత బన్నీ వాసు ఒక ఆఫర్ తీసుకువచ్చారని తెలిపారు.

- Advertisement -
Advertisement

అల్లు అరవింద్ నా జీవితంలో దేవుడు..

అయితే ఆ ఆఫర్ అల్లు అరవింద్(Allu Aravind) గారు నిన్ను మీట్ కావాలనుకుంటున్నారు అని చెప్పగానే వెంటనే వెళ్లి కలిశాను.. అల్లు శిరీష్ కి నేను చేసిన సోలో సినిమా అంటే చాలా ఇష్టం అన్నారు. ఆ తరహాలో ఒక సాఫ్ట్ మూవీ చేయాలని అల్లు అరవింద్ గారు తనని అడిగారని , ఆ వెంటనే పది లక్షల రూపాయలు చెక్కు కూడా అందించేసారని తెలిపారు. చాలా కష్టాలతో ఇబ్బంది పడుతున్న సమయంలో అప్పుడే శ్రీరస్తు శుభమస్తు సినిమా కథ అల్లు శిరీష్ తో తీశాను. ఆ సినిమా విజయం అందుకుంది.

also read:Bigg Boss 10 :బిగ్ బాస్ 10 ఓటింగ్ ట్రెండ్స్.. టాప్‌లో రోహిత్.. లీస్ట్‌లో ఆ ఇద్దరు!

- Advertisement -
Advertisement

ఆయన ముద్దు పేరే నా కొడుక్కు పెట్టాను..

అదే సమయంలో తనకి కుమారుడు పుట్టారు. అల్లు అరవింద్ గారు నాకు అవకాశం ఇచ్చారు. ఆయనకి క్లోజ్ గా ఉండేవారు ఆయనని ఎక్కువగా” అవి” అని పిలుస్తారట.. అదే పేరును తన కొడుక్కి అవ్యాన్ అనే పేరుతో పెట్టుకున్నానని పరుశురాం అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు.

మంచి సక్సెస్ మళ్ళీ అందుకుంటారా?

ఆ తర్వాత పరుశురాం డైరెక్షన్లో వచ్చిన గీతాగోవిందం సినిమా ఏకంగా 100 కోట్ల పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఆ తర్వాత మహేష్ బాబుతో సర్కారు వారి పాట సినిమా మంచి విజయాన్ని అందుకుంది. చివరిగా ఫ్యామిలీ స్టార్ సినిమా నీ తెరకెక్కించగా ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. మరి రాబోయే రోజుల్లో ఎలాంటి సినిమాతో ప్రేక్షకులను అలరిస్తారో చూడాలి డైరెక్టర్ పరుశురాం.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you