Jailer 2 Collections:సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన ‘జైలర్’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు భారీ వసూళ్లను సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్‌గా రూపొందిన ‘జైలర్ 2’పై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. రజినీకాంత్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి రోజు వసూళ్లతో వార్తల్లో నిలిచింది.
జైలర్ 2కు భారీ ఓపెనింగ్స్:
రజినీకాంత్‌కు ఉన్న క్రేజ్, మొదటి భాగం సాధించిన విజయం, సీక్వెల్‌పై నెలకొన్న అంచనాలు ‘జైలర్ 2’కు ప్రధాన బలంగా మారాయి. ముఖ్యంగా మరోసారి టైగర్ ముత్తువేల్ పాండియన్ పాత్రలో తలైవా తనదైన స్టైల్లో మాస్ యాక్షన్‌తో అలరించారు. దీనికి తోడు దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్‌పై ఉన్న నమ్మకం కూడా సినిమా రేంజ్ మరింత పెంచింది.
తాజా సమాచారం ప్రకారం, ‘జైలర్ 2’ విడుదలైన తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.140 కోట్లకు పైగా వసూళ్లు(Jailer 2 Collections) సాధించినట్లు తెలుస్తుందిది. ఈ కలెక్షన్లతో సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్ నమోదు చేసినట్లు చర్చ నడుస్తోంది. దీంతో రజినీకాంత్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. దట్ ఈజ్ తలైవా పవర్ అంటూ పొగిడేస్తున్నారు.
also read:Anupama Parameswaran:భార్య అంటే పనిమనిషి కాదు.. అనుపమ షాకింగ్ కామెంట్స్..!
కూలీ రికార్డుపై జైలర్ 2 కన్ను :
రజినీకాంత్ గత చిత్రం ‘కూలీ’ కూడా విడుదలకు ముందే భారీ హైప్‌ను సొంతం చేసుకుంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.151 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు అప్పట్లో పలు నివేదికలు వెల్లడించాయి. దీంతో రజినీకాంత్ కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రాల గురించి చర్చ మొదలైంది.
ఇప్పుడు ‘జైలర్ 2’ కూడా అదే స్థాయిలో వసూళ్లు సాధించడం ఇంకా హైలెట్ గా మారింది. తొలి రోజు వసూళ్లు రూ.140 కోట్లకు పైగా ఉన్నాయనే టాక్ అభిమానుల్లో కొత్త జోష్ నింపింది.
also read:supritha:సురేఖా వాణి కూతురు సుప్రీతకు ఇన్ని కష్టాలా.. తొలిసారి మనసులో మాట!
రజినీకాంత్ మాస్ ఇమేజ్‌కు మరోసారి పరీక్ష:
‘జైలర్’ మొదటి భాగంలో రజినీకాంత్ నటన, పవర్ఫుల్ యాక్షన్ సన్నివేశాలు, అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. సీక్వెల్లోనూ ఇలాంటి అంశాలే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.
మొత్తానికి, ‘జైలర్ 2’ తొలి రోజు వసూళ్లపై వినిపిస్తున్న అంచనాలు బాగా హీట్ పెంచేశాయి. దీంతో రజినీకాంత్ బాక్సాఫీస్ స్టామినా మరోసారి చర్చనీయాంశంగా మారనుంది. రాబోయే రోజుల్లో సినిమా వసూళ్లు ఎలా ఉంటాయి? కూలీ రికార్డును అందుకుంటుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.
#Jailer2 Worldwide Day1 Collection ₹140 CRORES+ GROSS 🔥🔥🔥🔥🔥🔥
2026 KOLLYWOOD’s BIGGEST DAY1 GROSSER ❤️🔥
Superstar @rajinikanth 👑 https://t.co/9ZQfAmM87O
— Asian Box Office (@AsianBoxOffice) October 16, 2026




