Sunday, October 18, 2026
HomeLATESTKavya - Anirudh:కావ్య మారన్ - అనిరుధ్ పెళ్లి ఎప్పుడో తెలుసా..?

Kavya – Anirudh:కావ్య మారన్ – అనిరుధ్ పెళ్లి ఎప్పుడో తెలుసా..?

Kavya - Anirudh: రూమర్ జంటగా ఇన్ని రోజులు పిలవబడ్డ కావ్య అనిరుద్ ఎట్టకేలకు పెళ్లి చేసుకోబోతున్నారు.

on
- Advertisement -banner Ad

Kavya – Anirudh:కోలీవుడ్లో సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు సంపాదించిన అనిరుధ్ సన్ పిక్చర్ అధినేత కళానిధి మారన్ కుమార్తె కావ్య మారన్ ప్రేమలో ఉన్నారని గత కొద్దిరోజులుగా వార్తలు వినిపించాయి. అంతేకాకుండా అప్పుడప్పుడు వీరికి సంబంధించి కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా వివాహ తేదీ కన్ఫామ్ అయినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. చెన్నైలోని నవంబర్ 21వ తేదీన వీరి వివాహం జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తమిళ సినీ పరిశ్రమతో పాటుగా ఇండియన్ సినీ పరిశ్రమలో వుండే ప్రముఖులను, రాజకీయ నాయకులను ఆహ్వానించడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది.

కావ్య పెళ్లికి పత్రికలు పంచుతున్న తండ్రి..

తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దంపతులను కూడా శుక్రవారం రోజున ఆహ్వానించారు హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లో సీఎం నివాసంలో కళానిధి మారన్ తో పాటు భార్య కావేరి మారన్ కలిసి తమ కుమార్తె(Kavya – Anirudh) వివాహానికి రావాల్సిందిగా ముఖ్యమంత్రి దంపతులను ఆహ్వానించారు. ఈ విషయాన్ని తెలంగాణ సీఎంవో అధికారికంగా ప్రకటించారు. అలాగే ఇందుకు సంబంధించి ఫోటోలు కూడా వైరల్ గా మారుతున్నాయి. ఇదంతా ఇలా ఉంటే గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఈ జంట గురించి పెళ్లి వార్తలు చర్చనీ అంశంగా మారాయి.

- Advertisement -
Advertisement

ఏడాదికి పైగా ప్రేమలో..

అనిరుధ్, కావ్య మారన్ కుటుంబాలు పెళ్లికి సంబంధించి పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. కావ్య, అనిరుధ్ 2025 నుంచి ప్రేమలో ఉన్నారని ప్రచారం జరిగింది. కానీ గతంలో కూతురి గురించి వినిపిస్తున్న ప్రచారంలో ఎటువంటి నిజం లేదని ఇరువురి కుటుంబ సభ్యులు గతంలో వెల్లడించారు. కానీ అనిరుధ్ బంధువైన నటుడు వైజి మహేంద్రన్ మాత్రం ఒక ఇంటర్వ్యూలో అనిరుధ్ వివాహం గురించి తెలియజేశారు. వీరి వివాహం నవంబర్ 11న జరిగే అవకాశాలు ఉన్నాయని సోషల్ మీడియాలో కూడా వార్తలు వినిపించాయి.

డెస్టినేషన్ వెడ్డింగ్..

అయితే కొన్ని నివేదికల ప్రకారం.. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ తో పాటుగా పలువురు ప్రముఖులను తమ కూతురు వివాహానికి ఆహ్వానం పంపించినట్లు తెలుస్తోంది. చెన్నైలో జరగనున్న ఈ విందుకు పలువురు సినీ సెలబ్రిటీలు రాజకీయ నాయకులు కూడా హాజరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తానికి కావ్య మారన్, అనిరుధ్ వివాహం జరగబోతుందని తెలిసి అభిమానులు కూడా ఆనందపడుతున్నారు. మరి ఈ విషయాన్ని అఫీషియల్ గా ఈ జంట ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి మరి. ఇప్పటికే అనిరుధ్ తన మ్యూజిక్ తో భారీ విజయాలను అందుకుంటున్నారు. అనిరుధ్ ఏదైనా సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారంటే చాలు కచ్చితంగా ఆ సినిమా హిట్ అన్నట్టుగా మారిపోయింది. ఇటీవల సూపర్స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ 2 సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you