Tuesday, August 25, 2026
HomeLATESTKorean kanakaraju: ఓటీటీలోకి కొరియన్ కనకరాజు మూవీ..!

Korean kanakaraju: ఓటీటీలోకి కొరియన్ కనకరాజు మూవీ..!

Korean kanakaraju: మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటించిన కొరియన్ కనకరాజు సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమయ్యింది.

on
- Advertisement -banner Ad

Korean kanakaraju: టాలీవుడ్లో మెగా హీరోల సినిమాలు ఈ ఏడాది భారీగానే విజయాలు సాధించాయి. దీంతో మెగా అభిమానులు సైతం ఫుల్ ఖుషిలో కనిపిస్తున్నారు. చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ సినిమా , రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా, వరుణ్ తేజ్ నటించిన కొరియన్ కనకరాజు(Korean kanakaraju)సినిమా మంచి విజయాలను అందుకున్నాయి. గత కొన్నేళ్లుగా వరుస ప్లాపులతో సతమతమవుతున్న వరుణ్ తేజ్ కు ఈ సినిమా బిగ్ రిలీఫ్ ఇచ్చిందని చెప్పవచ్చు. ఆగస్టు 7వ తేదీన విడుదలైన ఈ సినిమా హర్రర్ కామెడీ థ్రిల్లర్ చిత్రంగా నిలిచింది.

ఓటీటీ లోకి కొరియన్ కనకరాజు..

ఈ సినిమా సుమారుగా 60 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఓటీటిలో ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని సినీ ప్రేక్షకులు చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చేస్తున్నారు. థియేటర్లో విడుదలై ఇప్పటికి మూడు వారాలు అవుతూ ఉన్న ఇంకా ఈ సినిమాకి కలెక్షన్స్ వస్తూనే ఉన్నాయి. డైరెక్టర్ మేర్లపాక గాంధీ తెరకెక్కించిన ఈ సినిమా లో హీరోయిన్గా రితిక నాయక్ నటించింది. అలాగే కమెడియన్ సత్య ఈ సినిమాలో కీలకమని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు కొరియన్ కనకరాజు సినిమా ఓటీటి లోకి రాబోతోంది.

- Advertisement -
Advertisement

also read:Irumudi: రవితేజకు షాక్.. ఇరుముడిలో ఆ సీన్స్ తీసేయాలని డిమాండ్..!

స్ట్రీమింగ్ అప్పుడే..

ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి సంస్థలలో ఒకటైన నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు రూ .25 కోట్ల రూపాయల వరకు డీలింగ్ జరిగినట్లుగా సమాచారం. అయితే థియేటర్లలో విడుదలైన నాలుగు లేదా ఐదు వారాల తర్వాతే ఈ సినిమాని ఓటీటి లో స్ట్రిమింగ్ తీసుకువచ్చేలా ఒప్పందం కుదురుచుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా వినాయక చవితి పండుగ సందర్భంగా సెప్టెంబర్ 10వ తేదీన విడుదల అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. కొరియన్ కనకరాజు సినిమా విషయానికి వస్తే యూవి క్రియేషన్ బ్యానర్ వారు ఈ సినిమాని నిర్మించారు.

- Advertisement -
Advertisement

also read:Madhuri Rathod:”జనాలకి ఆ వీడియోలు అంటేనే ఇంట్రెస్ట్”..మాధురి రాథోడ్ సెన్సేషనల్ కామెంట్స్..!

వరుణ్ తేజ్ కెరియర్..

వరుణ్ తేజ్ సినిమాల విషయానికి వస్తే.. 2000 సంవత్సరంలో హాండ్స్ అప్ అనే చిత్రంతో చైల్డ్ యాక్టర్ గా తన కెరీర్ ని మొదలుపెట్టారు. ఆ తర్వాత 2014లో ముకుందా అనే సినిమాతో హీరోగా పరిచయం కాగా, కంచె సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత లోఫర్ , ఫిదా, తొలిప్రేమ, F2, గద్దల కొండ గణేష్, F3, తదితర చిత్రాలలో నటించారు. ఇప్పుడు కొరియన్ కనకరాజు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న వరుణ్ తేజ్ ప్రస్తుతం బరి అనే ఒక స్పోర్ట్స్ చిత్రంలో కనిపించబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వరుణ్ తేజ్ కి గాయమైనట్లుగా తెలుస్తోంది. దీంతో కొంతకాలం పాటు సినిమా షూటింగ్ వాయిదా పడినట్లు సమాచారం.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you