OTT:ఓటీటీలోకి చాలా సినిమాలు, వెబ్ సిరీస్‌లు వస్తూనే ఉంటాయి. కానీ జనాలను ఆకట్టుకునేది మాత్రం కొన్ని సినిమాలే. అది భారీ బడ్జెట్ సినిమా కానక్కర్లేదు. సింపుల్ కాన్సెప్ట్‌తో, డైలీ రొటీన్ కథ అయినా సరే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. అలాంటి ఒక సినిమానే ఇప్పుడు ఓటీటీ (OTT)లో దుమ్మురేపుతోంది. ఓటీటీలో రొమాంటిక్ థ్రిల్లర్ సినిమాలకు కొదవేలేదు. ఎప్పుడు ఏ రొమాంటిక్ థ్రిల్లర్ వచ్చినా వెంటనే సక్సెస్ అవుతోంది. అయితే ఇప్పుడు ఈ సినిమా మంచి వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఇంతకీ ఈ సినిమాలో అంతగా ఏముంది? ఎందుకు జనాలు ఎగబడి చూస్తున్నారు అని అనుకుంటున్నారా?
ఊహించని ట్విస్టులతో సస్పెన్స్:
ఊహించని ట్విస్టులే ఈ సినిమాకు ప్రధాన బలం. సినిమా స్టార్ట్ అయిన మొదలు నుంచి ఎండింగ్ వరకు ప్రేక్షకులను టెన్షన్‌లో ఉంచే విధంగా కథ సాగుతుంది. “అరెరే… ఇప్పుడు ఇది జరుగుతుందేమో” అని ఊహించేలోపే డైరెక్టర్ మరో ట్విస్ట్‌తో కథను పూర్తిగా మలుపు తిప్పేస్తాడు.
కథ ఏంటంటే…:
ఈ సినిమా కథ విషయానికి వస్తే, రియల్ లైఫ్‌లో జరుగుతున్న అంశాలను ఆధారంగా తీసుకుని డైరెక్టర్ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ మధ్యకాలంలో వివాహేతర సంబంధాలపై నిత్యం ఎలాంటి వార్తలు వింటున్నామో అందరికీ తెలిసిందే. అలాంటి వివాహేతర సంబంధం కాన్సెప్ట్‌ను ప్రధానంగా చేసుకొని ఈ సినిమాను రూపొందించాడు.ఈ సినిమాలో షైనీ, రెజీ అనే భార్యాభర్తలు ఉంటారు. వీరు చాలా అన్యోన్యంగా జీవిస్తూ ఉంటారు. వీరికి ఒక కొడుకు కూడా ఉంటాడు. అయితే భర్త రెజీ సిటీలో ఉద్యోగం చేస్తూ, వీలు కుదిరినప్పుడల్లా ఇంటికి వస్తూ ఉంటాడు. ప్రతి నెలా డబ్బులు పంపిస్తూ ఉంటాడు. ఆ డబ్బులతో ఊరిలో భార్య షైనీ, అత్తమామలు, కొడుకుతో కలిసి జీవిస్తూ ఉంటుంది. భార్య షైనీ చాలా మంచిదనే అభిప్రాయంలో ఉంటాడు భర్త రెజీ. అత్త మంచాన పడటంతో, మామతో కలిసి ఆమెకు సేవలు చేస్తూ ఊరిలోనే జీవనం కొనసాగిస్తూ ఉంటుంది షైనీ.
వివాహేతర సంబంధంతో మొదలైన అసలు కథ:
అయితే అనుకోకుండా తన క్లాస్‌మేట్ కిరణ్ అనే వ్యక్తి పరిచయం అవుతాడు. ఆ వ్యక్తికి షైనీ కాస్త దగ్గరవుతుంది. ఆ పరిచయం క్రమంగా వివాహేతర సంబంధానికి దారితీస్తుంది. ఇద్దరూ కలిసి ఉండేందుకు అత్తమామలు అడ్డుగా ఉన్నారని భావించి వారిని చంపేయాలని పక్కా ప్లాన్ వేస్తారు. ముందుగా మామను చంపేందుకు షైనీ, కిరణ్ కలిసి ప్రయత్నిస్తారు. అయితే వారి ప్లాన్‌ను మంచాన ఉన్న అత్త, మామ వింటారు. వెంటనే ఆ ఇద్దరినీ ఒక రూమ్‌లో బంధిస్తారు.
ALSO READ:Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఆపరేషన్ పూర్తి!
చివరికి ఏమైంది? :
ఆ తర్వాత ఏం జరిగింది? షైనీ, కిరణ్ బయటపడ్డారా? అత్తమామలను ఎలా చంపాలని అనుకున్నారు? నిజంగానే వారిని చంపేశారా? అనే విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
సినిమాకు హైలైట్ ఇదే:
ఒక విషయం మాత్రం చెప్పాల్సిందే. డైరెక్టర్ పెట్టిన ట్విస్టులు మామూలుగా లేవు. తెరపై కథ ఇంట్రెస్టింగ్‌గా కనిపిస్తూనే ప్రేక్షకులను థ్రిల్‌కు గురి చేస్తుంది. అదే సమయంలో కొన్ని సందర్భాల్లో నవ్వులు కూడా పూయిస్తుంది.
ALSO READ:Sreeleela:అఖిల్ హిట్‌తో శ్రీలీలకు కొత్త తలనొప్పి స్టార్ట్.. నెట్టింట ట్రోలింగ్ వెనుక అసలు కారణం ఇదే!
కుటుంబాలకు మంచి సందేశం:
వివాహేతర సంబంధాల వల్ల కుటుంబాలు ఎలా నాశనం అవుతాయో ఈ సినిమా కళ్లకు కట్టినట్లు చూపించింది. ఇంతకీ ఈ సినిమా పేరు ఏంటా అనుకుంటున్నారా? ఉడాల్ (udal ). ఈ సినిమా ఆమజొన్ ఫ్రిమె విదెఒలో అందుబాటులో ఉంది. ఈ సినిమాను డైరెక్టర్ ఎందుకు తెరకెక్కించాడో తెలియదు కానీ, చూసిన వాళ్లు మాత్రం “ఈ సినిమా చూసిన తర్వాత ఇలాంటి సంబంధాలకు దూరంగా ఉంటే మంచిది. ప్రతి ఒక్కరికీ ఒక కుటుంబం ఉందనే విషయాన్ని గుర్తు చేసుకోవడం మరింత ఉత్తమం” అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి… ఈ సినిమా ఎంతమంది జీవితాల్లో మార్పు తీసుకొస్తుందో…?




