Friday, August 28, 2026
HomeLATESTHi Movie Review:హాయ్ మూవీ రివ్యూ: నయనతార, కవిన్ లవ్‌స్టోరీ ఎలా ఉంది?

Hi Movie Review:హాయ్ మూవీ రివ్యూ: నయనతార, కవిన్ లవ్‌స్టోరీ ఎలా ఉంది?

Hi Movie Review:నయనతార, కవిన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘హాయ్’ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

on
- Advertisement -banner Ad

Hi Movie Review:లేడీ సూపర్‌స్టార్ నయనతార, యువ నటుడు కవిన్ జంటగా నటించిన తాజా చిత్రం ‘హాయ్’.(Hi Movie Review) విష్ణు ఎడవన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. ఆగస్టు 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేమకథా నేపథ్యంలో తెరకెక్కింది. అయితే కథ, కథనం విషయంలో కొత్తదనం కంటే పాత ఫార్ములాకే దర్శకుడు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చినట్లు అనిపిస్తుంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? తెలుసుకుందాం..!

కథ :

మయిల్ స్వామి (కవిన్) ప్రేమలో విఫలమైన తర్వాత జీవితంపై ఆసక్తిని కోల్పోతాడు. ఈ సమయంలో అతని జీవితంలోకి దేవయాని (నయనతార) ప్రవేశిస్తుంది. మొదట సాధారణ పరిచయంగా మొదలైన వీరి బంధం క్రమంగా ప్రేమగా మారుతుంది. అయితే వీరి ప్రయాణంలో అనేక భావోద్వేగ సంఘటనలు ఎదురవుతాయి. మయిల్ స్వామి, దేవయాని మధ్య ప్రేమ ఎలా బలపడింది? వారి బంధానికి ఎదురైన సమస్యలేంటి? చివరకు దేవయాని అతని ప్రేమను అంగీకరించిందా? అనే అంశాల చుట్టూ కథ సాగుతుంది.

- Advertisement -
Advertisement

also read:Friday TV Movies:ఈ శుక్రవారం టీవీలో అదిరిపోయే సినిమాలు.. పూర్తి లిస్ట్ ఇదే!

నటీనటుల పర్ఫామెన్స్:

నయనతార తన సహజమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో మరోసారి ఆకట్టుకుంటారు. అయితే దేవయాని పాత్రలో ఆమెకు పెద్దగా కొత్తగా చూపించే అవకాశం దక్కలేదు. గతంలో ఆమె పోషించిన కొన్ని పాత్రలను గుర్తు చేసే విధంగా ఉండటంతో నటన పరంగా ప్రత్యేకంగా అనిపించదు. కవిన్ మాత్రం మయిల్ స్వామి పాత్రకు సరిపోయేలా నటించాడు. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో తన పరిధి మేరకు మంచి ప్రయత్నం చేశాడు. లుక్స్ పరంగా కూడా పాత్రకు తగ్గట్టుగా కనిపించాడు.

- Advertisement -
Advertisement

రాధికా శరత్‌కుమార్, ప్రభు, భాగ్యరాజ్ వంటి సీనియర్ నటులు సినిమాలో ఉన్నప్పటికీ, వారి ప్రతిభకు తగ్గ స్థాయిలో పాత్రలను తీర్చిదిద్దలేకపోయారు. వీటీవీ గణేష్‌తో పాటు ఇతర హాస్యనటులు కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.

also read:Friday ott movies:ఫ్రైడే ఓటిటి మూవీస్..!

- Advertisement -
Advertisement

టెక్నికల్ టీం:

దర్శకుడు విష్ణు ఎడవన్ ఎంచుకున్న ప్రేమకథలో కొత్తదనం పెద్దగా కనిపించదు. ప్రేమలో విఫలమైన హీరో, ఆ తర్వాత ఎదురయ్యే భావోద్వేగ పరిణామాలు వంటి అంశాలు ఇప్పటికే ఎన్నో సినిమాల్లో చూసినవే. దీంతో కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులకు ముందే ఊహించగలిగేలా ఉంటాయి. సెకండాఫ్‌లో వచ్చే కొన్ని కామెడీ ట్రాక్స్ కథకు పెద్దగా బలం చేకూర్చలేదు. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ చుట్టూ వచ్చే హాస్య సన్నివేశాలు ఆశించిన స్థాయిలో నవ్వించవు. క్లైమాక్స్ కూడా పెద్దగా ఆశ్చర్యపరిచే అంశాలు లేకుండా సాగుతుంది.

జెన్ మార్టిన్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం సన్నివేశాలకు అనుగుణంగా ఉన్నాయి. అయితే ప్రత్యేకంగా గుర్తుండిపోయే స్థాయిలో మాత్రం లేవు. రాజేష్ శుక్లా సినిమాటోగ్రఫీ సినిమాకు మంచి విజువల్ అప్పీల్ తీసుకొచ్చింది. ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ ఫస్టాఫ్‌లో బాగానే ఉన్నప్పటికీ, సెకండాఫ్‌లో కథనం నెమ్మదించడం వల్ల సాగదీత అనిపిస్తుంది. నిర్మాణ విలువలు మాత్రం సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్లు:

*నయనతార, కవిన్ జోడీ

*కవిన్ నటన

*నయనతార స్క్రీన్ ప్రెజెన్స్

*సినిమాటోగ్రఫీ

*నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్లు :

*రొటీన్ ప్రేమకథ

*కొత్తదనం లేని కథనం

*ఊహించగలిగే సన్నివేశాలు

*సెకండాఫ్‌లో సాగదీత

*కామెడీ పెద్దగా వర్కవుట్ కాకపోవడం

*బలహీనమైన క్లైమాక్స్

పంచ్ లైన్ : కొత్తదనం లేని ‘హాయ్’.. నయనతార, కవిన్ జోడీ ఉన్నా లవ్‌స్టోరీ మాత్రం పాతదే!

రేటింగ్: 2/5

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you