Sunday, July 12, 2026
HomeLATESTRajinikanth:రజినీకాంత్‌పై ఉమ్మేసిన స్టార్ హీరోయిన్.. ఏళ్ల తర్వాత బయటపడిన షాకింగ్ సీక్రెట్!

Rajinikanth:రజినీకాంత్‌పై ఉమ్మేసిన స్టార్ హీరోయిన్.. ఏళ్ల తర్వాత బయటపడిన షాకింగ్ సీక్రెట్!

Rajinikanth:దర్శకుడు భారతీరాజా తెరకెక్కించిన చిత్రంలో శ్రీదేవి నిజంగానే రజనీకాంత్ ముఖంపై ఉమ్మివేసిన సన్నివేశం గురించి తాజాగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ సన్నివేశం ఎలా తెరకెక్కింది? రజనీకాంత్ ఎందుకు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు?

on
- Advertisement -banner Ad

Rajinikanth:ఇప్పుడంటే టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది. సినిమాల్లో ప్రతి సీన్‌ను గ్రాఫిక్స్, ఏఐ టెక్నాలజీతో అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. మరికొన్ని సన్నివేశాలను డూప్‌ల సహాయంతో పూర్తి చేస్తున్నారు. కానీ ఒకప్పుడు పరిస్థితి అలా ఉండేది కాదు. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా కొన్ని సన్నివేశాల్లో స్వయంగా నటించాల్సిందే. కాళ్లు పట్టుకునే సీన్ కావచ్చు, బయట లాగే సీన్ కావచ్చు, ముఖంపై ఉమ్మివేసే సీన్ కావచ్చు.. ఎంత కష్టమైనా అలాంటి సన్నివేశాల్లో నటించాల్సి వచ్చేది. అలా చేస్తేనే రియాలిటీకి దగ్గరగా ఉంటుందని, ప్రేక్షకులకు కూడా బాగా నచ్చుతుందని భావించేవారు.

రజనీకాంత్ మాత్రం అందరిలా కాదు:

కొంతమంది హీరోలు అలాంటి సన్నివేశాల్లో నటించడానికి ఇష్టపడేవారు కాదు. కానీ రజనీకాంత్ మాత్రం అందరిలా కాదు. సినిమా కోసం ఎంత కష్టమైన సన్నివేశమైనా సహజంగా నటించేందుకు సిద్ధపడేవారు. ఆయన నటించిన ఓ సినిమాలో హీరోయిన్ నిజంగానే రజనీకాంత్ ముఖంపై ఉమ్మివేసిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతోంది. అసలు ఆ సినిమా ఏది? రజనీకాంత్ ముఖంపై ఏ హీరోయిన్ ఉమ్మివేసింది? డైరెక్టర్ ఏమన్నారు? ఆ సినిమా ఎలాంటి విజయం సాధించింది? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

- Advertisement -
Advertisement

షూటింగ్ సమయంలో జరిగిన ఓ ఆసక్తికర సంఘటన:

పల్లెటూరి జీవితాన్ని, సహజమైన భావోద్వేగాలను వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించిన దర్శకుడు భారతీరాజా మరణం సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచేసింది. ఈ సందర్భంగా ప్రముఖ తమిళ గేయరచయిత వైరముత్తు, భారతీరాజా దర్శకత్వంలో తెరకెక్కిన క్లాసిక్ చిత్రం ’16 వయతినిలే’ షూటింగ్ సమయంలో జరిగిన ఓ ఆసక్తికర సంఘటనను గుర్తు చేసుకున్నారు. రజనీకాంత్(Rajinikanth), కమల్ హాసన్, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో కొత్త తరహా కథనంతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

ఒక్క సన్నివేశం కోసం చిత్రబృందం పడిన తంటాలు:

ఈ సినిమాలో కీలకమైన ఓ సన్నివేశంలో రజనీకాంత్ పాత్ర కమల్ హాసన్‌ను తీవ్రంగా కొడుతుంది. ఆ దృశ్యాన్ని చూసి ఆగ్రహానికి గురైన శ్రీదేవి(sridevi) పాత్ర, రజనీకాంత్ ముఖంపై ఉమ్మివేయాల్సి ఉంటుంది. ఈ సన్నివేశాన్ని సహజంగా చిత్రీకరించాలని భారతీరాజా భావించారు. అయితే మొదట నిజంగా ఉమ్మివేయకుండా సబ్బు నురగతో చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. కానీ కెమెరాలో చూసిన తర్వాత ఆ సీన్ సహజంగా కనిపించకపోవడంతో మరో మార్గం కోసం ఆలోచించాల్సి వచ్చింది.

- Advertisement -
Advertisement

రజనీకాంత్ తీసుకున్న గొప్ప నిర్ణయం:

అప్పుడు పరిస్థితిని గమనించిన రజనీకాంత్, ఎలాంటి స్టార్ ఇమేజ్‌ను పట్టించుకోకుండా ముందుకు వచ్చారు. “సన్నివేశం బాగా రావాలంటే నిజంగానే నా ముఖంపై ఉమ్మివేయండి. ఎలాంటి సంకోచం అవసరం లేదు. నాకేం ఇబ్బంది లేదు” అని శ్రీదేవికి సూచించినట్లు వైరముత్తు వెల్లడించారు. అయితే ఈ మాట విన్న శ్రీదేవి తీవ్ర సంకోచానికి గురై, ఓ స్టార్ హీరోపై అలా చేయలేనని స్పష్టంగా చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారట.

దర్శకుడిని ఒప్పించిన రజని:

ఆ తర్వాత రజనీకాంత్ స్వయంగా భారతీరాజాను కలిసి, కథకు న్యాయం చేయాలంటే ఆ సన్నివేశం సహజంగా రావాల్సిందేనని వివరించారు. దర్శకుడు కూడా తొలుత సంకోచించినప్పటికీ, రజనీకాంత్ పట్టుదలతో చివరకు అంగీకరించారు. అనంతరం రజనీకాంత్ ఇచ్చిన ధైర్యంతో శ్రీదేవి ఎంతో ఇబ్బంది పడుతూనే ఆ సన్నివేశంలో నటించారు. ఈ ఘటనను గుర్తు చేసుకున్న అభిమానులు, పాత్ర కోసం వ్యక్తిగత ఇమేజ్‌ను పక్కనపెట్టి సినిమాకు ప్రాధాన్యం ఇచ్చిన రజనీకాంత్ అంకితభావాన్ని ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you