Thursday, August 27, 2026
HomeLATESTVenu Swamy:హీరో, హీరోయిన్ సూసైడ్ చేసుకుని చనిపోతారు.. వేణు స్వామి షాకింగ్ కామెంట్స్..!

Venu Swamy:హీరో, హీరోయిన్ సూసైడ్ చేసుకుని చనిపోతారు.. వేణు స్వామి షాకింగ్ కామెంట్స్..!

Venu Swamy: ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణుస్వామి టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీపై చేసిన సంచలన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

on
- Advertisement -banner Ad

Venu Swamy:ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి గురించి చెప్పాల్సిన పనిలేదు. రెండు తెలుగు రాష్ట్రాలలో బాగా సుపరిచితమే తెలుగు సినీ పరిశ్రమలో ఉండే సెలబ్రెటీలు , రాజకీయ నాయకులు, జాతకాలను చెబుతూ నిరంతరం వార్తలలో నిలుస్తూ ఉంటారు. అప్పుడప్పుడు ఈయన చేసే వ్యాఖ్యలు కూడా సంచలనంగా మారుతూ ఉంటాయి. త్వరలోనే ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్ మరణిస్తారంటూ ఆయన చేసిన ఒక ప్రకటన సంచలనంగా మారింది.. ఈ వ్యాఖ్యలు సినీ సెలబ్రెటీల జీవితాలకు సంబంధించింది కావడం చేత వివాదాస్పదంగా నిలుస్తున్నాయి.

హీరో, హీరోయిన్ చనిపోతారు..

గతంలో సమంత, నాగచైతన్య విడిపోతారని ముందే చెప్పాను. అంటూ గతంలో పేర్కొన్న ఒక వీడియోని తెలియజేస్తూ వైరల్ గా మారారు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి కూతురు జాతకం, ఆమె బాబాయ్ జాతకాన్ని పోలి ఉందంటూ పలు రకరకాల వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు తాజాగా ఇద్దరు టాలీవుడ్ ప్రముఖులు మరణిస్తారనే ప్రకటన సోషల్ మీడియాలో మరింత ప్రకంపనలు సృష్టిస్తోంది. వేణు స్వామి(Venu Swamy) తాజాగా ఒక యంగ్ హీరో సూసైడ్ చేసుకుంటాడని, అంతేకాకుండా ఒక హీరోయిన్ కూడా చనిపోతుందంటూ బాంబ్ పేల్చారు. అయితే హీరో హీరోయిన్ పేరు మాత్రం చెప్పలేదు.

- Advertisement -
Advertisement

also read:Allu Arjun:అల్లు అర్జున్ కు అరుదైన గౌరవం..!

వచ్చే 2 ఏళ్లలో ప్రమాదం..

ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన వేణు స్వామి సినీ సెలబ్రిటీల గురించి, సినిమా వాళ్లకు ఆయన చేసిన పూజల గురించి తెలియజేశారు. ఈ క్రమంలోనే 40 ఏళ్ల లోపు ఉన్న హీరో ఆత్మహత్య చేసుకుంటారని, తాను చెప్పింది కచ్చితంగా జరుగుతుందంటూ ధీమాతో తెలియజేశారు. అలాగే ఒక హీరోయిన్ కూడా మరణిస్తుందని, 2027-28 సంవత్సరంలో మరణించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు వేణు స్వామి. ఈ ఇద్దరు కూడా ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ విషయం విన్న పలువురు నెటిజన్స్, సినీ అభిమానులు సైతం వేణు స్వామిని ఏకిపారేస్తున్నారు. పాపులారిటీ కోసం ఇలాంటివి చెప్పడం అవసరమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -
Advertisement

also read:Ranabali:విజయ్ దేవరకొండ రణబాలి మూవీ వాయిదా..?

నిజమవుతుందా?

అంతేకాకుండా మేష, వృశ్చిక రాశిలకు చెందిన హీరో హీరోయిన్స్ మరణిస్తారని వేణు స్వామి చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. మరి ఆయన చెప్పింది జరుగుతుందో లేదో తెలియాలంటే మరో కొన్ని రోజులు ఆగాల్సిందే. వేణు స్వామి తో చాలామంది హీరోయిన్స్ సైతం పూజలు చేయించుకున్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వారందరి సినీ లైఫ్ కూడా మారిపోయాయని పలువురు నెటిజన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఇక వేణు స్వామి కూడా అటు బిజినెస్ పరంగా ఇటు జాతకాలు చెబుతూ భారీగానే సంపాదిస్తున్నారు. అప్పుడప్పుడు సినిమాలకు సంబంధించి జాతకాలను తెలియజేస్తూ ఫ్లాప్ అవుతుందా హిట్ అవుతుందా అని తెలియజేస్తూ ఉంటారు.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you