GV Narayana Rao:తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కోట్లాది మంది ఫేవరెట్ నిర్మాత, నటుడు జీవీ నారాయణరావు కన్నుమూశారు. ప్రముఖ సీనియర్ నటుడు అయిన జీవీ నారాయణరావు (GV Narayana Rao)అనారోగ్య సమస్యలతో బాధపడుతూ తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చికిత్స తీసుకుంటూ వచ్చిన ఆయన బుధవారం సాయంత్రం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మరణవార్తతో సినీ వర్గాల్లో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహచర నటులు ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నారు.
నటనపై ఆసక్తితో సినీ రంగంలోకి:
జీవీ నారాయణరావు కృష్ణాజిల్లా కురుమద్దాలి గ్రామంలో జన్మించారు. ఆయనకు చిన్నప్పటి నుంచే నటనపై ఎక్కువ ఆసక్తి ఉండేది. ఆ కారణంగానే ఒకపక్క చదువుకుంటూనే మరోపక్క నటన రంగంలోకి అడుగు పెట్టాలని ప్రయత్నించారు. ఆ లక్ష్యంతోనే మద్రాస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో నటనపై శిక్షణ తీసుకున్నారు. అనంతరం వెండితెరపై అడుగుపెట్టి తనదైన స్టైల్‌లో ముందుకెళ్లారు.
ఎటువంటి కథ అయినా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రనే ఎంచుకునేవారు. 1976లో విడుదలైన ‘అంతులేని కథ’ చిత్రం ద్వారా జీవీ నారాయణరావు వెండితెరకు గ్రాండ్‌గా పరిచయమయ్యారు. ఆ తర్వాత ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ తనలోని డిఫరెంట్ యాంగిల్స్‌ను బయటపెడుతూ పలు చిత్రాల్లో విభిన్న రోల్స్ పోషిస్తూ ముందుకు వెళ్లారు.
ఎన్నో హిట్ చిత్రాల్లో నటన:
తన కెరీర్‌లో ‘ముత్యాల పల్లకి’, ‘అంగడి బొమ్మ’, ‘చిలకమ్మ చెప్పింది’, ‘గ్యాంగ్ లీడర్’, ‘హిట్లర్’ వంటి ఎన్నో పిక్ సూపర్ డూపర్ ప్రాపర్టీ హిట్స్ ఉన్నాయి. సినిమాల్లోనే కాకుండా బుల్లితెరపై కూడా తనదైన స్టైల్‌లో మెరిశారు. సీరియల్స్‌లో కూడా నటించి కుటుంబ ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు.
also read:Anil Ravipudi: వారణాసి తర్వాత ఆ డైరెక్టర్ తో మహేష్ సినిమానా?
నిర్మాతగానూ ప్రత్యేక గుర్తింపు:
నటనతో పాటు జీవీ నారాయణరావు నిర్మాతగా కూడా పలు చిత్రాలను ప్రేక్షకులకు అందించడం గమనార్హం. ‘యముడికి మొగుడు’, ‘పెళ్లి నీకు శుభం నాకు’, ‘దేవాంతకుడు’ వంటి సినిమాలను నిర్మించి సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. వెండితెరపై నటుడిగా, తెరవెనక నిర్మాతగా, బుల్లితెరపై మరో నటుడిగా ఎన్నెన్నో మంచి ప్రాజెక్టుల్లో పనిచేసిన ఆయన నటన ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
also read:Samantha:వర్కౌట్స్ తో షాక్ ఇస్తున్న సమంత..!
చిరంజీవి, రజనీకాంత్‌తో స్నేహం :
జీవీ నారాయణరావుకు సినీ పరిశ్రమలో ఎంతో మంది ప్రముఖులతో మంచి ఫ్రెండ్షిప్ ఉంది. మరీ ముఖ్యంగా సూపర్ స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవితో ఆయనకున్న స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
‘మా’ సంతాపం:
జీవీ నారాయణరావు మృతిపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసింది. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన నిర్మించిన సినిమాల ద్వారా, నటించిన సినిమాల ద్వారా ఎప్పటికీ మన మధ్య ఉంటారని అభిమానులు అంటున్నారు.




