Saturday, August 8, 2026
HomeBLOGPeddi Movie: బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ అలజడి మొదలు

Peddi Movie: బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ అలజడి మొదలు

Peddi Movie: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ‘పెద్ది’ సినిమా పేరు ఒక సెన్సేషన్‌గా మారింది. వినూత్నమైన ప్రచార చిత్రాలతో, గ్రౌండ్ లెవల్ ప్రమోషన్లతో ఈ సినిమాపై

Post by: Swami Naidu

Peddi Movie: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ‘పెద్ది’ సినిమా పేరు ఒక సెన్సేషన్‌గా మారింది. వినూత్నమైన ప్రచార చిత్రాలతో, గ్రౌండ్ లెవల్ ప్రమోషన్లతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో విపరీతమైన క్యూరియాసిటీ నెలకొంది. గత మూడు నెలలుగా ONESEA MEDIA మేనేజింగ్ డైరెక్టర్ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో జరుగుతున్న ‘పెద్ది’ ప్రమోషన్లు సినిమా రేంజ్‌ను ఎక్కడికో తీసుకెళ్లాయి. ఈ వినూత్న ప్రచార కార్యక్రమాలు ఇప్పుడు మెగా క్యాంప్‌ను సైతం ఆకర్షించాయి.

GOLD BOX ఆఫీసులోకి.. (Peddi Movie)

‘పెద్ది’ సినిమా ప్రమోషన్లలో భాగంగా ప్రత్యేకంగా డిజైన్ చేసిన ‘పెద్ది కార్’ తాజాగా GOLD BOX ఆఫీసులోకి ప్రవేశించింది. మెగా ప్రొడ్యూసర్, మెగా డాటర్ శ్రీమతి సుస్మిత కొణిదెల ఈ కార్‌ను స్వయంగా పరిశీలించారు. సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి పెద్ది కార్ ప్రమోషన్ అనే ఐడియా చాలా బాగుందని, టీమ్ పడుతున్న కష్టాన్ని ఆమె మనస్ఫూర్తిగా అభినందించారు. గత మూడు నెలలుగా కాలేజీల్లో పెద్ది డాన్స్ కాంపిటీషన్లు, పెద్ది క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహిస్తూ, విజేతలకు కిట్స్ అందజేస్తూ ‘పెద్ది’ టీమ్ గ్రౌండ్ లెవల్‌లో దూసుకుపోతోంది.

- Advertisement -
Advertisement

Also Read- VeeraBhadrudu: సూర్య ‘వీరభద్రుడు’ సెన్సార్ పూర్తి

వారికి భరోసా

ఈ ప్రమోషన్ల తీరును చూసిన సుస్మిత.. ‘ఇది కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకూడదు.. మీ ప్రమోషన్లు పాన్ ఇండియా లెవల్లో విస్తరించాలి’ అని టీమ్‌కు దిశానిర్దేశం చేశారు. తమ సలహాలు, సూచనలు ఎప్పుడూ ఉంటాయని Onesea Media వారికి భరోసా ఇచ్చారు. వినూత్నంగా ఆలోచిస్తూ సినిమాను జనాల్లోకి తీసుకెళ్తున్న ONESEA MEDIA ప్రతినిధులు దుర్గాప్రసాద్, చైతన్య, మాధవ్, హరీష్, సురేష్, భవాని శంకర్, పూర్ణలను సుస్మిత గారు ప్రత్యేకంగా అభినందించారు. అఖిల భారత చిరంజీవి యువత మద్దతుతో త్వరలో ఈ ప్రమోషన్లు మరిన్ని నగరాలకు విస్తరించనున్నాయి.

- Advertisement -
Advertisement

Also Read- TV Movies: మే 6, బుధవారం టీవీలలో వచ్చే సినిమాలివే!

రవణం స్వామినాయుడు
అఖిల భారత చిరంజీవి యువత

- Advertisement -
Advertisement

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

GUEST BLOG POSTS

Related articles