Friday, November 6, 2026
HomeINTERVIEWSRenu Desai:పవన్ కళ్యాణ్ తో విడాకులపై రేణూ దేశాయ్ ఏమందంటే?

Renu Desai:పవన్ కళ్యాణ్ తో విడాకులపై రేణూ దేశాయ్ ఏమందంటే?

Renu Desai: సినీనటి రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ తో విడాకులపై సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్ పై ఆవేదన వ్యక్తం చేసింది.

on
- Advertisement -banner Ad

Renu Desai:టాలీవుడ్ లో హీరోయిన్ గా, పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా పేరు సంపాదించిన రేణూ దేశాయ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సమాజంలో జరిగే ఎలాంటి విషయాలపైన స్పందిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మూగజీవాలపైన జరిగే అన్యాయాల పైన స్పందిస్తూ ఉంటుంది రేణూ దేశాయ్. ఈ మధ్యకాలంలో తరచూ పలు చిత్రాలలో నటిస్తూ ఉంది. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో రేణూ దేశాయ్ తన వ్యక్తిగత జీవితం పైన చేసిన వ్యాఖ్యలతో వార్తలలో నిలుస్తోంది.

విడాకులు తీసుకుని 14 ఏళ్ల అయినా వనవాసం అయిపోలేదు..

తాను విడాకులు తీసుకొని 14 సంవత్సరాలు అయినా ఇప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ మాజీ భార్యగానే చూస్తున్నారు అంటూ ఆమె ఆవేదనను తెలియజేసింది. శ్రీరాముడు కూడా వనవాసం 14 ఏళ్ళే చేశారు మరి తన వనవాసం ఎప్పుడు ముగుస్తుందో అని ప్రశ్నించింది? తన వ్యక్తిగత జీవితం పైన వస్తున్న విమర్శలు సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ పైన కూడా స్పందించింది.. తెలుగు సినీ ప్రేక్షకులకు తన గురించి ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నానని తెలియజేసింది.

- Advertisement -
Advertisement

also read:Niharika NM: బ్లూ చీరలో గ్లామర్ తో ఆకట్టుకున్న నిహారిక.. ఫోటోలు వైరల్!

ఇంత సక్సెస్ సాధించినా.. ఇంకా ఎందుకు విమర్శిస్తున్నారు..

రేణూ దేశాయ్(Renu Desai) మాట్లాడుతూ.. బద్రి చిత్రంతో తన జీవితం మొదలయ్యిందని చాలామంది భావిస్తుంటారు, అంతకుముందు తనకంటూ ఒక జీవితం ఉన్న విషయాన్ని అందరూ మర్చిపోతున్నారని తెలిపింది. 2012లో విడాకులు మంజూరైన తర్వాత తాను వ్యక్తిగతంగా, వృత్తిపరంగా కూడా సక్సెస్ అయ్యానని తెలిపింది రేణు దేశాయ్. ఒక మరాఠీ సినిమాను నిర్మించాను. అది మంచి విజయాన్ని కూడా అందుకుంది. మరో సినిమాకి కథ రాయడంతో పాటు నిర్మాణం దర్శక బాధ్యతలు కూడా చేపట్టానని తెలిపింది. అంతేకాకుండా ఎన్నో డాన్స్ షోలకు పనిచేశాను. కవిత్వాలు రాశాను.. ప్రస్తుతం సినిమాలలో నటిస్తున్నానని తెలియజేసింది.

- Advertisement -
Advertisement

also read:OTT:ఓటీటీలో సందడి చేసే సినిమాలివే.. లిస్ట్ ఇదిగో!

పవన్ కళ్యాణ్ మాజీ భార్య అనే గుర్తింపు ఎప్పుడు తొలగిపోతుందో..

ఇన్ని రంగాలలో పనిచేసిన తనకు ప్రత్యేక గుర్తింపు రాలేదని ఎలా అంటారంటూ ఆమె ప్రశ్నించారు? సోషల్ మీడియాలో తన పైన వస్తున్న విమర్శలకు స్పందిస్తూ ఒక కుక్కను కాపాడిన కూడా తనను విమర్శిస్తూ ఉన్నారని పవన్ కళ్యాణ్ లేకపోతే తనకు జీవించే అర్హత లేనట్టుగా మరి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు.. తన వ్యక్తిత్వం, పనులు జీవితాన్ని పక్కన పెట్టి కేవలం పవన్ కళ్యాణ్ మాజీ భార్య గానే గుర్తించడం తనకు చాలా బాధగా ఉందంటూ రేణూ దేశాయ్ తెలియజేసింది. ప్రస్తుతం రేణూ దేశాయ్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. రేణూ దేశాయ్, పవన్ కళ్యాణ్ కుమారుడు అఖీరా త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు సంబంధించి కసరత్తులు కూడా జరుగుతున్నాయనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అలాగే కుమార్తె విషయంలో కూడా అన్ని విషయాలలో ఆచితూచి అడుగులు వేస్తూ ఉంటుంది రేణూ దేశాయ్. చివరిగా 2023లో టైగర్ నాగేశ్వరరావు సినిమాలో లవణం అనే పాత్రలో నటించింది.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you