Sreeleela:తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలచింది అన్నట్లుగా మారిపోయింది శ్రీలీల పరిస్థితి. శ్రీలీల అంటే ఇన్నాళ్లు స్టార్ హీరోయిన్, టాప్ హీరోయిన్, చిన్న వయసులో ఇండస్ట్రీలోకి వచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ అనే మాటలు వినిపించేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. శ్రీలీల అంటే ఒక ఐరన్ లెగ్, హెడ్వెయిట్ గల హీరోయిన్, సినిమాను కమిట్ అయి వెంటనే రిజెక్ట్ చేస్తుంది, స్టార్డమ్ తిక్క కుదిరింది… ఇలాంటి మాటలు వినిపిస్తున్నాయి.
దానికి కారణం ‘లెనిన్’ మూవీ:
అఖిల్ కెరీర్లోనే వన్ ఆఫ్ ది ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌గా వచ్చిన ‘లెనిన్’ మూవీ నిన్న థియేటర్లలో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్‌ను సంపాదించింది. ఇంకా పక్కాగా చెప్పాలంటే అఖిల్ పదేళ్ల సినీ కెరీర్‌కు ఫస్ట్ హిట్ ఇదే అని చెప్పాలి. సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్‌లో భాగంగా నాగార్జున కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలు కూడా నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి.
శ్రీలీలను టార్గెట్ చేస్తూ ట్రోలింగ్:
ఇవన్నీ పక్కన పెడితే అఖిల్(AKHIL) ‘లెనిన్’ సినిమా అందరికీ హ్యాపీ న్యూస్ క్రియేట్ చేసినా, శ్రీలీలకు మాత్రం తీవ్ర తలనొప్పులు తీసుకొస్తోంది. శ్రీలీలను సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు కొంతమంది కుర్రాళ్లు. శ్రీలీల ఐరన్ లెగ్ అని, శ్రీలీల (Sreeleela) ఈ సినిమా నుంచి తప్పుకోవడం వల్లే అఖిల్‌కు సూపర్ డూపర్ హిట్ వచ్చింది అని ఆమెను డీగ్రేడ్ చేస్తూ, ‘లెనిన్’ సినిమా హిట్ అవ్వడానికి భాగ్యశ్రీ బోర్సే ప్లస్ అయిందంటూ పొగిడేస్తున్నారు.
మొదట హీరోయిన్గా శ్రీలీలనే ఎంపిక చేశారు:
శ్రీలీలను మొదటగా ఈ సినిమాలో హీరోయిన్గా ఎంపిక చేసుకుంది చిత్ర బృందం. కానీ శ్రీలీల కాల్షీట్లు అడ్జస్ట్ కాకపోవడంతో సినిమా నుంచి తప్పుకుంది. ఆమె సినిమా నుంచి తప్పుకోవడంతో భాగ్యశ్రీ(BHAGYASHRI BORSE) లైన్లోకి వచ్చింది.
భాగ్యశ్రీకి కీలకమైన హిట్:
నిజానికి భాగ్యశ్రీకి కూడా ఇప్పటివరకు హిట్ లేదు. ఈ సినిమా హిట్ అవ్వడం ఆమెకు కీలకమే. సినిమా కోసం చాలా కష్టపడి నటించింది. అదేవిధంగా ప్రమోషన్స్‌లో కూడా చురుగ్గా పాల్గొంది. ఫైనల్లీ సక్సెస్ సాధించింది. శ్రీలీల తప్పుకోవడం, భాగ్యశ్రీ రావడం, సినిమా హిట్ అవ్వడం… ఇవన్నీ భాగ్యశ్రీకి ప్లస్ అయ్యాయి.
‘శతకోటి దండాలు’ అంటూ ఘాటు ట్రోల్స్:
శ్రీలీలను ఐరన్ లేడీ అంటూ ట్రోల్ చేస్తూ, ‘లెనిన్’ సినిమా నుంచి తప్పుకున్నందుకు శతకోటి దండాలు అంటూ ఘాటుగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ ప్రారంభించారు. ‘కిస్సిక్’ బ్యూటీకి కష్టాలు స్టార్ట్ అయ్యాయి అంటూ ట్రోలింగ్ కూడా మొదలుపెట్టేశారు.
ALSO READ:NTR:ఎన్టీఆర్ గాడ్ ఆఫ్ వార్ కి పోటీగా ధనుష్ మరో మూవీ!
ఫ్యాన్స్ ఏమంటున్నారు?
ఒకప్పుడు శ్రీలీల అంటే ఎంత క్రేజీ హీరోయిన్ అనేది అందరికీ తెలిసిందే. అలాంటి క్రేజీ హీరోయిన్‌పై ఇలాంటి ఘాటు ట్రోలింగ్ నిజంగా ఘోర అవమానమని అంటున్నారు ఫ్యాన్స్. మరోపక్క శ్రీలీల ఫ్యాన్స్ మాత్రం దీనిని సమర్థించుకుంటున్నారు. వ్యక్తిగత ట్రోలింగ్ చాలా చాలా తప్పు అని, శ్రీలీల కావాలని సినిమా నుంచి తప్పుకోలేదని, కాల్షీట్లు అడ్జస్ట్ కాక తప్పలేదని అంటున్నారు.
ALSO READ:Sai Pallavi:”డబ్బు, కారు కోసం ముద్దు”.. కిస్సింగ్ సీన్స్ పై సాయి పల్లవి షాకింగ్ కామెంట్స్..!
బాలీవుడ్, కోలీవుడ్‌పై ఫోకస్:
మరోపక్క శ్రీలీలకు టాలీవుడ్లో అవకాశాలు కరువయ్యాయి. ఆమె మాత్రం బాలీవుడ్, కోలీవుడ్‌పై కన్నేసింది. అక్కడ వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. టాలీవుడ్లో సక్సెస్ సాధించలేకపోయినా, కోలీవుడ్, బాలీవుడ్లో సక్సెస్ సాధించి మళ్లీ గోల్డెన్ లేడీ అనిపించుకుంటుందేమో అంటూ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.




