Saturday, July 11, 2026
HomeLATESTSai Pallavi:"డబ్బు, కారు కోసం ముద్దు".. కిస్సింగ్ సీన్స్‌ పై సాయి పల్లవి షాకింగ్ కామెంట్స్..!

Sai Pallavi:”డబ్బు, కారు కోసం ముద్దు”.. కిస్సింగ్ సీన్స్‌ పై సాయి పల్లవి షాకింగ్ కామెంట్స్..!

Sai Pallavi:నటి సాయి పల్లవి కిస్సింగ్ సీన్స్‌పై చేసిన తాజా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సినిమాల్లో అలాంటి సన్నివేశాలపై తన అభిప్రాయాన్ని ఆమె స్పష్టంగా వెల్లడించారు.

on
- Advertisement -banner Ad

Sai Pallavi:సాయి పల్లవి ఈ పేరు చెప్తే అందరికీ మొదటిగా గుర్తొచ్చేది ‘ఫిదా’ సినిమానే. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ద్వారానే తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది ఈ అందాల ముద్దుగుమ్మ. ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ ఉన్నారు. అందంగా ఉండి, నటన టాలెంట్ ఉండి అభిమానులను మెప్పించే సత్తా ఉన్న హీరోయిన్స్ బోలెడు మంది. కానీ సాయి పల్లవి అంటే ఎందుకు అంత క్రేజ్ అంటే మాత్రం ఆమె తెరపై కనిపించినందుకే కాదు, తెర వెనక జీవితం కూడా అందరికీ ఇష్టం, గౌరవం.

సీన్ల విషయంలో సాయి పల్లవి స్ట్రాంగ్ స్టాండ్:

సాయి పల్లవి(Sai Pallavi) అందరిలాంటి హీరోయిన్స్ కాదు. ముఖానికి మేకప్ వేసుకొని, పెదాలకు లిప్‌స్టిక్ వేసుకొని, డైరెక్టర్ ఏ సీన్ చెప్తే ఆ సీన్లు కళ్లు మూసుకొని గొర్రెలా నటించే హీరోయిన్ అంతకన్నా కాదు. తాను సినిమాకి కమిట్ అయ్యేముందే ఆ సినిమాలో తనకు అభ్యంతరకరంగా ఉన్న సీన్స్ ఏమైనా ఉన్నాయా..? ఆ సీన్స్ నటించడం వల్ల తన తల్లిదండ్రులు, తన ఫ్రెండ్స్ ఇబ్బందులకు గురవుతారా అని ఆలోచించి, అలాంటి సీన్స్ ఉంటే కోట్లు ఇచ్చినా సరే చేయను అంటూ తేల్చి చెప్పేసే హీరోయిన్. దానికి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నటించే ఛాన్స్ వచ్చినా రిజెక్ట్ చేసి పడేసింది సాయి పల్లవి. అంత గట్స్ ఉన్న హీరోయిన్. మరి అలాంటి హీరోయిన్‌ను కెలికితే ఊరుకుంటుందా..? నో వే. సైలెంట్‌గానే ఇచ్చి పడేస్తుంది.

- Advertisement -
Advertisement

also read:Tollywood:అనుష్క మూవీ డైరెక్టర్ పై కేసు నమోదు!

కిస్సింగ్ సీన్స్‌పై ఏమంది?:

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరోయిన్ సాయి పల్లవి, తన వద్దకు వచ్చిన డైరెక్టర్స్ ముద్దు సీన్స్ నటించమంటున్నారు అని, అలాంటి కాన్సెప్ట్ ఉన్న స్టోరీస్ తన వద్దకు ఎందుకు తీసుకొస్తున్నారు అని ఫైర్ అయింది. నెమ్మదిగా చెబుతూనే, ఏ డైరెక్టర్‌కు ఎక్కడ దించాలో అక్కడ గట్టిగానే దించేసింది సాయి పల్లవి.

- Advertisement -
Advertisement

ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “నేను ఇప్పటికే చాలా ఇంటర్వ్యూల్లో చెప్పాను. కిస్సింగ్ సీన్స్‌లో నటించడం నా వల్ల కాదు. నాకు భాగస్వామి ఉండాలి, క్యారెక్టర్ పరంగా అంతే. అది నటన కోసం మాత్రమే స్క్రీన్ మీద వేరొకరిని ముద్దు పెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు. అది నా ఫీలింగ్. వేరే వాళ్లు చేస్తే తప్పు అని నేను అనడం లేదు.” అని చెప్పుకొచ్చింది.

also read:Mokshagna:నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం పాన్ ఇండియా డైరెక్టర్?

- Advertisement -
Advertisement

డబ్బు, లగ్జరీ జీవితంపై సాయి పల్లవి అభిప్రాయం:

ఇంకా మాట్లాడుతూ.. “ఒక మనిషి ప్రశాంతమైన జీవితం గడపడానికి ఏం కావాలో చెప్పండి. డబ్బు ఉండాలి, సంతోషకరమైన కుటుంబం ఉండాలి, ఇల్లు ఉండాలి. అలా చూసుకుంటే నేను ఇప్పటికే కోటీశ్వరురాలిని. నా దగ్గర భగవంతుడి దయవల్ల అవన్నీ ఉన్నాయి.” అని సాయి పల్లవి చెప్పుకొచ్చింది. అంతేకాదు, డబ్బు, లగ్జరీ జీవితం పై తనకున్న దృక్పథాన్ని వివరిస్తూ సాయి పల్లవి చేసిన ఈ వ్యాఖ్యలు అందరి హృదయాలను ఆకట్టుకుంటున్నాయి. “సాయి పల్లవి అంటే ఇదే” అంటూ ఫ్యాన్స్ ఆ రేంజ్‌లో ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇంటిమేట్ సీన్స్ చేయనని క్లారిటీ:

అంతేకాదు, సాయి పల్లవి మాట్లాడుతూ.. “నా నటన చూసి నన్ను సినిమాలోకి తీసుకోండి. లేదంటే వదిలేయండి. ముద్దు సీన్లు నటించడానికి, ఇంటిమేట్ సీన్స్ నటించడానికి నా దగ్గరికి రావద్దు. నాకంటే వేరే వాళ్లను ఎంపిక చేసుకోండి. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు.” అంటూ కుండబద్దలు కొట్టినట్టు చెప్పేసింది.

సోషల్ మీడియాలో హాట్ టాపిక్:

ఇప్పుడు ప్రజెంట్ ఎలాంటి హీరోయిన్స్ ఇండస్ట్రీలో ఉన్నారో అందరికీ తెలిసిందే. ఒక కోటి రూపాయలు ఎక్స్ట్రా ఇస్తే బయట కూడా తీసేసి, నడుము తిప్పుతూ, బాడీ పార్ట్స్ చూపిస్తూ తెగ వయ్యారాలు పోస్తూ ఉంటారు. అలాంటి హీరోయిన్స్ అందరికీ సాయి పల్లవి బుద్ధి చెప్పినట్టుగా మాట్లాడింది అంటూ ఫ్యాన్స్ తెగ పొగడేస్తున్నారు. సాయి పల్లవి ఏ హీరోయిన్స్‌ని నెగిటివ్‌గా ఉద్దేశించి మాట్లాడకపోయినా, కొంతమంది ఆమె వ్యాఖ్యలను గ్లామరస్ పాత్రలు చేసే స్టార్ హీరోయిన్స్‌పై నెగిటివ్‌గా రియాక్ట్ అవుతున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు సాయి పల్లవి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. కొంతమంది సాయి పల్లవి మాట్లాడిన మాటలను ప్రశంసిస్తుంటే, మరికొంతమంది మాత్రం ఈమె ఆ హీరోయిన్స్‌ని ఉద్దేశించి మాట్లాడి ఉంటుందని నెగిటివ్‌గా ట్రోల్ చేస్తున్నారు

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you