Pawan Kalyan:ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ,జనసేన పార్టీ అధినేత సినీ నటుడు పవన్ కళ్యాణ్ గత కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. వైద్య పరీక్షలు నిర్వహించగా వీలైనంత త్వరగా పవన్ కళ్యాణ్ కు శస్త్ర చికిత్స అవసరమని వైద్యులు తెలియజేశారు. అయితే పవన్ కళ్యాణ్ చేయవలసిన కొన్ని అధికారిక కార్యక్రమాలు ఉండడం వల్ల వాటిని ముగించుకొని శస్త్ర చికిత్స చేయించుకుంటానని వైద్యులకు చెప్పారు పవన్. గత కొద్దిరోజులుగా తన రెండు భుజాల నొప్పితో ఇబ్బంది పడుతున్న పవన్ కళ్యాణ్.. రెండు భుజాలకు ఒకేసారి శస్త్ర చికిత్స చేయించుకుంటే తీవ్రమైన సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వైద్యులు సూచించారు.
శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ కళ్యాణ్..
అందుచేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మొదట కుడి భుజానికి సంబంధించి రొటేటర్ కఫ్ ఇంజ్యూరిస్ శనివారం రోజున ఆపరేషన్ చేశారు వైద్యులు. ఇందుకు సంబంధించి ముందస్తు వైద్య పరీక్షలు శుక్రవారం రోజున నిర్వహించగా, శనివారం రోజు సుమారుగా మూడున్నర గంటల పాటు వైద్యులు ఈ ఆపరేషన్ చేసినట్లుగా తెలుస్తోంది. మరో భుజానికి చేయాలి అంటే మరో రెండు నెలల వ్యవధి తరువాత శస్త్ర చికిత్స చేయించుకోవలసి ఉంటుందని వైద్యులు సూచించారు.
ALSO READ:Sreeleela:అఖిల్ హిట్‌తో శ్రీలీలకు కొత్త తలనొప్పి స్టార్ట్.. నెట్టింట ట్రోలింగ్ వెనుక అసలు కారణం ఇదే!
2016లోనే భుజాలకు గాయాలు..
పవన్ కళ్యాణ్ 2016లో తన భుజాలకు గాయాలయ్యాయని , ఆ సమయంలో ప్రథమ చికిత్స తీసుకున్న పవన్ కళ్యాణ్.. వైద్యులు సైతం విశ్రాంతి ఎక్కువగా తీసుకోవాలని సూచించారట. కానీ 2018 లో చేపట్టిన పోరాట యాత్ర సందర్భంగా జనసేన పార్టీకి సంబంధించిన కార్యక్రమానికి వెళ్ళగా చాలామంది అభిమానులు పవన్ కళ్యాణ్ చేతులు పట్టుకొని లాగే వారిని అలాగే మరి కొంతమంది దూసుకు వచ్చి పవన్ కళ్యాణ్ తో కరచాలనం చేస్తున్న సమయంలో చేతులు గుంజేవారని.. ఆ సమయంలో చాలా నొప్పి భరించారట పవన్ కళ్యాణ్.
ALSO READ:NTR:ఎన్టీఆర్ గాడ్ ఆఫ్ వార్ కి పోటీగా ధనుష్ మరో మూవీ!
రెండు నెలల తర్వాత మరో సర్జరీ..
ఇదంతా ఇలా ఉంటే ఈ ఏడాది ఏప్రిల్ నెలలో పవన్ కళ్యాణ్ ముక్కుకి శస్త్ర చికిత్స జరిగింది . అదే సందర్భంలో వైద్య పరీక్షల నిర్వహించగా పవన్ కళ్యాణ్ భుజాలకు రొటేటర్ కఫ్ ఇంజ్యూరిస్, మజిల్ టెర్స్ తీవ్రమైన స్థాయిలో ఉన్నట్టుగా వైద్యులు గుర్తించారు. దీంతో శనివారం రోజున శస్త్ర చికిత్స చేయించుకున్నారు పవన్ కళ్యాణ్. ఈ విషయం విన్న అటు అభిమానులు ,జనసేన కార్యకర్తలు, నేతలు సైతం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని దేవాలయాలలో ప్రత్యేకమైన ప్రార్ధనలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన విషయం మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి శస్త్ర చికిత్స
•రెండు భుజాలకీ రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్… తొలుత కుడి భుజానికి శస్త్ర చికిత్స
•మూడున్నర గంటలపాటు శస్త్ర చికిత్స
•2016లో తగిలిన గాయాలకు తోడు… పోరాట యాత్ర నుంచి గత ఎన్నికల ప్రచారం వరకూ పార్టీ శ్రేణులు, అభిమానులు…— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) July 11, 2026




