Saturday, July 11, 2026
HomeLATESTLenin Movie:లెనిన్ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్.. ఎన్ని కోట్లంటే?

Lenin Movie:లెనిన్ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్.. ఎన్ని కోట్లంటే?

Lenin Movie: అఖిల్ అక్కినేని హీరోగా నటించిన లెనిన్ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

on
- Advertisement -banner Ad

Lenin Movie:అక్కినేని అఖిల్ ప్రధాన పాత్రలో, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన తాజా చిత్రం లెనిన్. ఈ చిత్రాన్ని డైరెక్టర్ మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. జూలై 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది. విడుదలైన మొదటి షో నుంచి ఈ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ లభించింది. ముఖ్యంగా అఖిల్(Akhil) యాక్టింగ్ ఈ సినిమాలో గత సినిమాల కంటే భిన్నంగా ఉందని, ఈ సినిమాతో మరొకసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చూపించారని అభిమానులు సైతం కామెంట్స్ చేస్తున్నారు. ఇక చిత్ర బృందం సైతం లెనిన్ సినిమాకి సంబంధించి వరుస కలెక్షన్స్ పోస్టర్ ను విడుదల చేశారు.

అఖిల్ లెనిన్ డే వన్ కలెక్షన్స్..

లెనిన్(Lenin Movie) సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 16.7 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఇది అఖిల్ కెరియర్ లోనే అతి పెద్ద మొదటి రోజు కలెక్షన్స్ గా నిలిచింది. అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చి పదేళ్లు పూర్తి అయినప్పటికీ సరైన సక్సెస్ మాత్రం అందుకోలేదు. దీంతో ఆ విమర్శలను ఈ సినిమా తుడిచిపెట్టింది. సినిమా ప్రారంభం నుంచే అఖిల్ యాక్టింగ్ అద్భుతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ సినిమాకి జూనియర్ ఎన్టీఆర్ అందించిన వాయిస్ ఓవర్, ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్టులు ఈ సినిమా మరింత ఆకట్టుకునేలా చేస్తున్నాయి.

- Advertisement -
Advertisement

also read:Allu Arjun:పుష్ప రాజ్ పొలిటికల్ ఎంట్రి..? PKతో బన్నీ సీక్రేట్ మీటింగ్..? అసలు ప్లాన్ ఇదే..!

కలిసొచ్చిన వీకెండ్స్..

ముఖ్యంగా శనివారం , ఆదివారం కూడా సెలవులు కావడం చేత కలెక్షన్స్ కూడా మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లెనిన్ సినిమాకి ప్రధాన బలం స్క్రీన్ ప్లే అని కూడా విశ్లేషకులు తెలియజేస్తున్నారు. ఈ సినిమాలో మాస్ ఎలిమెంట్స్ , స్క్రీన్ ప్లేతో విమర్శకుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. మొత్తానికి డైరెక్టర్ మురళి కిషోర్ అబ్బూరు ఈ సినిమాతో అఖిల్ కి విజయాన్ని అందించారంటూ అభిమానులు సైతం కామెంట్స్ చేస్తున్నారు. సినిమా సక్సెస్ అవ్వడంతో అటు చిత్ర బృందంతోపాటు నటీనటులు కూడా సక్సెస్ మీట్ లో భాగంగా పాల్గొంటూ ఎమోషనల్ గా మాట్లాడారు.

- Advertisement -
Advertisement

also read:Anchor Jhansi:టాలీవుడ్‌లో తనకు జరిగిన మోసంపై తొలిసారి స్పందించిన యాంకర్ ఝాన్సీ..సోషల్ మీడియాలో చర్చ..!

కన్నీళ్లు పెట్టుకున్న అఖిల్..

ఇక అఖిల్ నిన్నటి రోజున ఏకంగా తన తండ్రిని గట్టిగా కౌగిలించుకొని మరీ ఎమోషనల్ అయిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. రెండవ రోజు కూడా అడ్వాన్స్ బుకింగ్స్ లో కూడా బెటర్ గానే కనిపిస్తోంది. మరి లెనిన్ సినిమా అఖిల్ కెరియర్ లో ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి. మొదట ఈ సినిమాలో హీరోయిన్గా శ్రీ లీలను ఎంపిక చేయగా కొన్ని కారణాల చేత ఆమె తప్పుకోగా హీరోయిన్ భాగ్యశ్రీ నీ తీసుకున్నారు ..ఈ విషయం పైన కూడా నిర్మాత నాగవంశీ విమర్శలు చేసే వారికి క్లారిటీ ఇచ్చారు.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you