Sunday, July 12, 2026
HomeLATESTS Janaki:ఇళయరాజా ట్యూన్‌కు ఎస్. జానకి కన్నీళ్లు.. ఆ పాట వెనుక హృదయాన్ని కదిలించే కథ..!

S Janaki:ఇళయరాజా ట్యూన్‌కు ఎస్. జానకి కన్నీళ్లు.. ఆ పాట వెనుక హృదయాన్ని కదిలించే కథ..!

S Janaki:భారతీయ సినీ సంగీత ప్రపంచంలో లెజెండరీ గాయని ఎస్. జానకి ఓ పాట పాడుతున్న సమయంలో భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్న సంఘటన ఇప్పటికీ సంగీతాభిమానులను కదిలిస్తుంది.

on
- Advertisement -banner Ad

S Janaki:భారతీయ సినీ సంగీత ప్రపంచంలో ఎస్. జానకి పేరు ఓ చిరస్థాయి అధ్యాయం. ఐదు దశాబ్దాలకు పైగా తన మధుర గాత్రంతో కోట్లాది మంది సంగీత అభిమానులను అలరించిన ఆమె, వేలాది పాటలకు ప్రాణం పోశారు. ఆమె పాట వింటుంటే ఏదో తెలియని మనసుకు హాయిని కలిగించే భావన కలుగుతుంది. ఎంత డిప్రెషన్‌లో ఉన్నా సరే, ఆమె పాట వింటే ఆటోమేటిక్‌గా మనసు తేలికపడుతుంది. అంత మంచి గాయని ఎస్. జానకి(S Janaki). ప్రేమ, విరహం, భక్తి, మాతృత్వం.. ఏ భావనైనా సరే తన స్వరంతో హృదయాలను తాకేలా మలిచే అరుదైన స్వరం ఉన్న గాయని ఆమె. అందుకే ఆమె పాటలు కాలం మారినా సంగీత ప్రియుల ప్లే లిస్ట్‌లో ఎప్పటికీ ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకుంటాయి.

ఇళయరాజా-జానకి మరపురాని సంగీత ప్రయాణం:

సంగీత దర్శకుడు ఇళయరాజా, గాయని ఎస్. జానకి కలయిక దక్షిణాది సినీ సంగీతానికి ఎన్నో చిరస్మరణీయ గీతాలను అందించింది. ఇళయరాజా స్వర కల్పనకు జానకి గాత్రం జతకావడంతో ఎన్నో మెలోడీలు శాశ్వత క్లాసిక్స్‌గా నిలిచాయి. తన అనేక చిత్రాల్లో ఆమెతో పాటలు పాడించిన ఇళయరాజా, జానకిని అత్యంత ఆప్త గాయనిగా భావించేవారు.

- Advertisement -
Advertisement

also read:Lenin Movie:లెనిన్ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్.. ఎన్ని కోట్లంటే?

ఒక పాట ముందు భావోద్వేగానికి లోనైన జానకి:

సాధారణంగా రికార్డింగ్ సమయంలో ఎంత క్లిష్టమైన పాటైనా ప్రశాంతంగా పాడే జానకి, తన సినీ జీవితంలో ఒక పాట వద్ద మాత్రం కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. ఆ సినిమా మరేదో కాదు, 1978లో విడుదలైన తమిళ చిత్రం “అచ్చాణి”. అందులోని “మాతా ఉన్ కోవిలిల్” అనే పాటను రికార్డ్ చేస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. మేరీ మాత త్యాగం, మాతృత్వాన్ని ప్రతిబింబించే ఆ సాహిత్యం ఆమెను తీవ్రంగా కదిలించింది. కొన్ని పంక్తులు పాడిన వెంటనే భావోద్వేగానికి గురై రికార్డింగ్‌ను ఆపేశారు జానకి.

- Advertisement -
Advertisement

also read:Allu Arjun:పుష్ప రాజ్ పొలిటికల్ ఎంట్రి..? PKతో బన్నీ సీక్రేట్ మీటింగ్..? అసలు ప్లాన్ ఇదే..!

విరామం తర్వాత పూర్తైన చిరస్మరణీయ గీతం:

జానకి పరిస్థితిని గమనించిన ఇళయరాజా ఆమె వద్దకు వచ్చి ధైర్యం చెప్పి, కొంతసేపు విశ్రాంతి తీసుకునేలా చేశారు. అనంతరం మళ్లీ రికార్డింగ్ ప్రారంభించగా ఆ పాట అద్భుతంగా పూర్తయింది. తర్వాత అనేక ఇంటర్వ్యూలలో ఈ సంఘటనను జానకి గుర్తు చేసుకున్నారు. నేటికీ ఆలయ ఉత్సవాల్లో వినిపించే ఈ గీతం, విన్నవారిని భావోద్వేగానికి గురి చేసే అరుదైన భక్తి గీతంగా నిలిచిపోయింది. ఎస్. జానకి గాత్రంలోని ఆ అనుభూతి, ఇళయరాజా స్వరంలోని ఆత్మీయత కలిసి ఈ పాటను సంగీత చరిత్రలో చిరస్థాయిగా నిలబెట్టాయి.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you