Tejaswini:నందమూరి కుటుంబానికి చెందిన సభ్యులు సాధారణంగా ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండరు. ట్రెండ్ అవ్వడానికి కూడా ప్రయత్నించరు. వాళ్ల పర్సనల్ లైఫ్‌ను చాలా ప్రైవేట్‌గా ఉంచుకుని ముందుకు వెళ్తూ ఉంటారు. అడపాదడపా బయట కనిపించడం తప్పించి, వాళ్ల పనులు వాళ్లు చూసుకోవడం మినహా అనవసర విషయాల్లో జోక్యం చేసుకోరు. ఎప్పుడూ మీడియా ముందుకు రావాలని ఆత్రుత చూపించరు. అయితే అప్పుడప్పుడు తమ ప్రత్యేక ప్రతిభతో అభిమానులను ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. తాజాగా నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని మరోసారి తన టాలెంట్‌ను ప్రూవ్ చేసుకుంది. సాయి పల్లవి పాటకు డాన్స్ చేస్తూ అద్భుతంగా మెస్మరైజ్ చేసింది. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇప్పటికే ఒకసారి డాన్స్ వీడియోతో అందరి దృష్టిని ఆకర్షించిన ఆమె, ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాను షేక్ చేస్తూ నెటిజన్ల నుంచి ప్రశంసలు అందుకుంటోంది.
సారంగదరియా పాటకు అద్భుతమైన ప్రదర్శన:
సాయి పల్లవి కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ పాటగా నిలిచిన సారంగదరియా సాంగ్‌కు తేజస్విని(Tejaswini) స్టెప్పులు వేసింది. పాటలోని ప్రతి బీట్‌కు సరిపోయేలా ఆమె చూపించిన హావభావాలు, గ్రేస్, ఎనర్జీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఆమె డాన్స్ మూవ్స్ చూస్తే ప్రొఫెషనల్ డాన్సర్‌ను తలపించే స్థాయిలో ఉన్నాయి అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. గతంలో వైరల్ అయిన వీడియోతో పోలిస్తే ఈసారి ఆమె ప్రదర్శన మరింత మెచ్యూరిటీగా ఉందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
also read:Lenin:’లెనిన్’తో మార్మోగుతున్న ప్రమోద్ పంజు పేరు.. ‘ఆపమని చెప్పన్నా’ నటుడికి ఇదే అసలైన బ్రేక్..!
సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుందా?:
తేజస్విని డాన్స్‌పై చూపిస్తున్న ఆసక్తిని చూసి ఆమె త్వరలోనే సినీ రంగంలోకి అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయంటూ చర్చ మొదలైంది. అయితే ఇప్పటివరకు దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు. భవిష్యత్తులో ఆమె సినిమాల్లోకి వస్తుందనే విషయంపై కూడా నందమూరి కుటుంబం నుంచి ఎలాంటి సంకేతాలు లేవు. అయినప్పటికీ ఆమెకు ఉన్న స్క్రీన్ ప్రెజెన్స్, కాన్ఫిడెన్స్ చూసి భవిష్యత్తులో నటిగా లేదా ఇతర విభాగాల్లో కనిపించే అవకాశాలు ఉన్నాయేమో అంటూ సినీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.
also read:Aamir Khan:పెళ్లి తర్వాత అమీర్ ఖాన్ సంచలన నిర్ణయం..!
నిర్మాణ రంగంలోనూ చురుకైన పాత్ర:
ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న చిత్ర నిర్మాణ కార్యక్రమాల్లో తేజస్విని భాగస్వామిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆమె ప్రముఖ జువెలరీ బ్రాండ్‌కు ప్రచారకర్తగా కూడా ఎంపికై ఒక ప్రకటనలో కనిపించింది. ఇప్పుడు వరుసగా వైరల్ అవుతున్న డాన్స్ వీడియోలతో ఆమె సోషల్ మీడియాలో మంచి గుర్తింపు సంపాదిస్తోంది. దీంతో నందమూరి అభిమానులు తేజస్విని భవిష్యత్తు ప్రయాణంపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Balayya Daughter Tejaswini Dance Video 💃#NandamuriTejaswini pic.twitter.com/tCkTtKISB4
— Praneeth (@praneethballa) July 12, 2026




