Tuesday, July 14, 2026
HomeLATESTLenin:'లెనిన్'తో మార్మోగుతున్న ప్రమోద్ పంజు పేరు.. 'ఆపమని చెప్పన్నా' నటుడికి ఇదే అసలైన బ్రేక్..!

Lenin:’లెనిన్’తో మార్మోగుతున్న ప్రమోద్ పంజు పేరు.. ‘ఆపమని చెప్పన్నా’ నటుడికి ఇదే అసలైన బ్రేక్..!

Lenin:అఖిల్ అక్కినేని నటించిన 'లెనిన్' సినిమాతో నటుడు ప్రమోద్ పంజు పేరు ఇండస్ట్రీలో మార్మోగుతోంది. ఇప్పటికే 'సలార్' వంటి చిత్రంలో కనిపించిన ఆయనకు ఈ సినిమా అసలైన బ్రేక్‌గా నిలిచిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

on
- Advertisement -banner Ad

Lenin:ఇప్పుడు ఎక్కడ చూసినా సరే జనాలు అందరూ అక్కినేని అఖిల్ నటించిన ‘లెనిన్’ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. అఖిల్ హిట్ కొట్టాడు అంటూ సంబరాలు చేసుకుంటున్నారు. నిజానికి అఖిల్ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి పదేళ్లకు పైగా అయిపోయింది. ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క పెద్ద హిట్ కూడా దక్కలేదు. ఎట్టకేలకు ‘లెనిన్'(Lenin) సినిమాతో హిట్ కొట్టడంతో ఈ విజయాన్ని అఖిల్ అభిమానులు ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

భాగ్యశ్రీ బోర్సేకి కూడా తొలి విజయం:

కేవలం అఖిల్‌కే కాదు.. ఈ సినిమా హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేకి కూడా ఇదే తొలి హిట్. దీంతో సినిమా విడుదల తర్వాత ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణ చూసి భాగ్యశ్రీ కూడా చాలా ఎమోషనల్‌గా స్పందించింది. విడుదలైన తర్వాత ఈ సినిమా ఊహించని స్థాయిలో ప్రేక్షకాదరణ పొందుతోంది.

- Advertisement -
Advertisement

ఈ సినిమా అసలు లాభపడింది మాత్రం ప్రమోద్ పంజునే:

అయితే ఈ సినిమా విడుదల తర్వాత ఎక్కువగా ప్లస్ అయిన వ్యక్తి ఎవరు అంటే మాత్రం ప్రమోద్ పంజు అనే చెప్పాలి. ఈ పేరు చెబితే చాలా మందికి వెంటనే గుర్తు రాకపోవచ్చు. కానీ ‘సలార్’ సినిమాలో ప్రభాస్ పక్కన ఉంటూ “ఆపమని చెప్పన్నా” అంటూ ఒకే ఒక్క డైలాగ్‌తో బాగా ఫేమస్ అయిన నటుడు ఇతనే. ఈసారి ‘లెనిన్’ సినిమాలో విలన్ పాత్రలో నటించి ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు.

also read:Aamir Khan:పెళ్లి తర్వాత అమీర్ ఖాన్ సంచలన నిర్ణయం..!

- Advertisement -
Advertisement

వసంత్ పాత్ర సినిమాకే హైలైట్:

అఖిల్ ‘లెనిన్’ సినిమాలో హీరో, హీరోయిన్ తర్వాత అంతగా హైలైట్ అయిన క్యారెక్టర్ ఏది అంటే విలన్ వసంత్ పాత్రే. సినిమా మొదలైన అరగంట తర్వాత ఎంట్రీ ఇచ్చే ఈ పాత్ర క్లైమాక్స్ వరకు తన ఉనికిని ప్రతి ఫ్రేమ్‌లో చాటుకునేలా దర్శకుడు మురళీకిషోర్ తీర్చిదిద్దాడు. ప్రమోద్ పంజు నటనకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ సినిమా హిట్ ఆయన కెరీర్‌కు కూడా మంచి బూస్ట్ ఇచ్చిందనే చెప్పాలి.

also read:Jaya Krishna:మహేష్ కుటుంబం నుంచి కొత్త హీరో.. ట్రైలర్ తో ఆకట్టుకుంటున్న జై కృష్ణ..!

- Advertisement -
Advertisement

‘సలార్’లో వచ్చిన గుర్తింపు.. ‘లెనిన్’తో అసలైన బ్రేక్:

‘సలార్’ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ పక్కనే ఉంటూ ప్రభాస్‌ను ఆపమని చెప్పే బాచిరాజు మన్నార్ పాత్రలో ప్రమోద్ పంజు కనిపించాడు. “ఆపమని చెప్పన్నా” అనే ఒక్క డైలాగ్‌తో మంచి పాపులారిటీ సంపాదించుకున్నప్పటికీ, నటుడిగా పెద్దగా స్పేస్ దక్కించుకోలేకపోయాడు. అయితే ‘సలార్’తో రాని గుర్తింపు, భారీ విజయం ఇప్పుడు ‘లెనిన్’ సినిమాతో దక్కింది. ప్రస్తుతం ప్రమోద్ పంజు పేరు సోషల్ మీడియాలో కూడా బాగా మార్మోగుతోంది.

కన్నడ నుంచి తెలుగు వరకు ప్రయాణం:

ప్రమోద్ పంజు ఓ కన్నడ నటుడు. టీవీ సీరియల్స్ ద్వారా తన నటనా ప్రస్థానాన్ని ప్రారంభించాడు. ఆ తర్వాత వరుసగా సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నాడు. ఆయన చేసిన ప్రతి సినిమా హిట్ కాకపోయినా, పోషించిన పాత్రలు మాత్రం మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. అంతేకాదు, 2021లో ‘రత్నన్ ప్రపంచ’ చిత్రంలో నటనకు కర్ణాటక రాష్ట్ర అవార్డును కూడా అందుకున్నాడు.

తెలుగులో మరిన్ని అవకాశాలు వస్తాయా?

ప్రస్తుతం ‘లెనిన్’ సినిమా విజయాన్ని ప్రమోద్ పంజు ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ సినిమా సక్సెస్‌తో తెలుగులో ఆయనకు ఎలాంటి అవకాశాలు వస్తాయో, విలన్‌గా మరింత బిజీ అవుతాడో చూడాలి. ప్రస్తుతం మాత్రం ‘లెనిన్’ సినిమాతో ప్రమోద్ పంజు కెరీర్‌లో కొత్త అధ్యాయం ప్రారంభమైనట్టే కనిపిస్తోంది.

https://www.instagram.com/reel/Dapf7zdNUkp/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you