Rajamouli :కోట్లాదిమంది అభిమానులు ఎప్పుడు ఎప్పుడు అంటూ ఈగర్‌గా వెయిట్ చేస్తున్న కాంబోకు త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతుందన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ హాట్‌గా ట్రెండ్ అవుతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త బాగా వైరల్ అవుతోంది.
రాజమౌళి డైరెక్షన్‌లో సూర్య?
ఎస్.ఎస్. రాజమౌళి డైరెక్షన్‌లో కోలీవుడ్ సూపర్ స్టార్ హీరో సూర్య సినిమాలో నటించబోతున్నారన్న టాక్ గ్లోబల్ స్థాయిలో ట్రెండ్ అవుతోంది. సూర్య ఎలాంటి నటుడో అందరికీ తెలిసిందే కదా. నచ్చితే ఎలాంటి డిసిషన్‌కైనా చేయడానికి సిద్ధంగా ఉంటాడు. ఇక రాజమౌళి(Rajamouli ) గురించి అస్సలు చెప్పనవసరం లేదు. ఒక హీరో దగ్గర నుంచి ఎలాంటి నటన రాబట్టుకోవాలో ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. పెద్ద పెద్ద స్టార్స్ అయిన ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో వర్క్ చేసి, వాళ్ల నుంచి కూడా ఓ రేంజ్‌లో నటనను రాబట్టాడు. అలాంటి సెన్సేషనల్ డైరెక్టర్‌తో ఇప్పుడు కోలీవుడ్ సూపర్ స్టార్ హీరో సూర్య చేతులు కలిపాడని, త్వరలోనే వీళ్ల కాంబోలో సినిమా రాబోతుందన్న న్యూస్ బయటకు రావడంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.
మగధీర తర్వాత నుంచే ఈ కాంబో కోసం ఎదురుచూపులు:
నిజానికి మగధీర సినిమా తర్వాత నుంచే వీరిద్దరి కాంబోలో సినిమా రావాలని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేశారు. అంతేకాదు, ఆర్ఆర్ఆర్ సినిమా కథను ముందుగా సూర్యను ఉద్దేశించుకొని రాసుకున్నారనే టాక్ కూడా వినిపించింది. కానీ ఎందుకో ఈ కాంబో సెట్ కాలేదు. ఫైనల్లీ ఇన్నాళ్లకు ఇప్పుడు వీళ్లిద్దరి కాంబోలో సినిమా రాబోతుందన్న న్యూస్ బలంగా వినిపిస్తూ ఉండడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.
also read:Jana nayagan:విజయ్ జననాయగన్ రిలీజ్ డేట్ లాక్!
ప్రస్తుతం మహేష్ బాబు సినిమాతో బిజీ:
ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబు సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. మహేష్ బాబును ఒక సరికొత్త లుక్‌లో చూపించడానికి బాగా కష్టపడుతున్నారు. ఈ సినిమా పూర్తయిన వెంటనే సూర్యతో తెరకెక్కించే సినిమా గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వబోతున్నారనే టాక్ వినిపిస్తోంది.
also read:Shah Rukh Khan:ఒక ఇంటితోనే రూ.282 కోట్ల లాభం.. షారుఖ్ ఖాన్ రియల్ ఎస్టేట్ మ్యాజిక్ అదుర్స్..!
అఫీషియల్ క్లారిటీ మాత్రం లేదు:
అంతేకాదు, ఇప్పటికే సూర్యకు కథ కూడా వివరించారని, ఇది ఇప్పటివరకు ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో ఎవరూ తెరకెక్కించని స్టోరీ అని కూడా టాక్ వినిపిస్తోంది. అయితే రాజమౌళి గానీ, సూర్య గానీ దీనిపై ఎలాంటి అఫీషియల్ ప్రకటన చేయలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త ఫుల్ ట్రెండ్ అవుతోంది. ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో వీరిద్దరి పేర్లు మార్మోగిపోతున్నాయి. చూడాలి మరి, దీనికి సంబంధించిన అధికారిక అప్డేట్ ఎప్పుడు వస్తుందో..???




