Indraja:ఒకప్పుడు తెలుగు, తమిళ సినీ పరిశ్రమలలో స్టార్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి ఇంద్రజ గురించి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా విజయవంతంగా ముందుకు వెళ్తున్నారు. ఒకప్పుడు స్టార్ హీరోల సరసన వరుస హిట్ సినిమాలలో నటించి ప్రేక్షకులను అలరించిన ఆమె పెళ్లి తర్వాత కొంతకాలం సినిమాలకు దూరమయ్యారు. అయితే మళ్లీ నటిగా.. సినిమాలతో పాటు టెలివిజన్ కార్యక్రమాలలోనూ బిజీగా మారిపోయారు.
జబర్దస్త్ లో పర్మనెంట్ జడ్జ్ గా గుర్తింపు :
ఇంద్రజ ప్రస్తుతం ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ కు జడ్జిగా వ్యవహరిస్తూ ప్రేక్షకులు అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. ఈ షో ప్రారంభమైనప్పటి నుంచి చాలా కాలం పాటు రోజా జడ్జిగా కొనసాగగా ఆమె రాజకీయాలలో బిజీ కావడంతో షో నుంచి తప్పుకున్నారు. అనంతరం ఖుష్బూ, సంఘవి సహ పలువురు నటిమణులు జడ్జిలుగా కనిపించిన చివరికి ఇంద్రజకే స్థిరమైన జడ్జిగా కొనసాగే ఛాన్స్ దక్కింది. ఆమె ప్రశాంతమైన తీరు, చక్కటి స్పందన, హుందాతనం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.
also read:Rajamouli :అందరు అనుకున్నట్లే జరిగింది..రాజమౌళి నెక్స్ట్ సినిమా పై బిగ్ బ్లాస్టింగ్ అప్డేట్!?
ఎపిసోడ్ కి భారీ పారితోషకం :
ఇంద్రజకు(Indraja) ఈ షో ద్వారా మంచి ఆదాయం వస్తుంది అని ఇండస్ట్రీ వర్గాలలో చర్చ జరుగుతుంది . అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఒక్కో ఎపిసోడ్ కు సుమారు రూ.2.5 లక్షల వరకు పారితోషకం అందుకుంటున్నట్లు తెలుస్తుంది. నెలకు నాలుగు నుంచి ఐదు ఎపిసోడ్లు చిత్రీకరిస్తారు. ఈ నేపథ్యంలో ఆమెకు దాదాపు నెలకే రూ.10 లక్షల పైగా ఆదాయం వస్తుంది అంటూ సమాచారం. అయితే ఈ పారితోషకం పై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. సోషల్ మీడియాలో మాత్రమే ట్రెండ్ అవుతుంది.
also read:Jana nayagan:విజయ్ జననాయగన్ రిలీజ్ డేట్ లాక్!
ప్రేక్షకులలో మంచి ఆదరణ :
ఇంద్రజ పై పెద్దగా వివాదాలు లేకపోవడం , కుటుంబ ప్రేక్షకులలో మంచి ఇమేజ్ ఉండడం జబర్దస్త్ కు అదనపు బలంగా మారిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆమె హాస్యాన్ని ఆస్వాదించే విధానం. కంటెస్టెంట్ లని ప్రోత్సహించే తీరు, షో కి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఆ కారణంగానే ఇంద్ర జబర్దస్త్ షోలో ఇంత బాగా సక్సెస్ అయ్యింది. ఇదే సమయంలో మళ్లీ జడ్జిగా చేరిన నాగబాబుకు ఒక్కో ఎపిసోడ్ కు రూ.5 నుంచి రూ.6 లక్షల వరకు పారితోషకం అందుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇంద్రజ జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాలతో పాటు సినిమాలు, వెబ్ సిరీస్లలోను నటిస్తూ తన సెకండ్ ఇన్నింగ్స్ ను విజయవంతంగా ముందుకు తీసుకెళుతున్నారు.




