Friday, July 17, 2026
HomeLATESTOTT : ఓటీటీలోకి రాబోతున్న టోవినో థామస్ మూవీ!

OTT : ఓటీటీలోకి రాబోతున్న టోవినో థామస్ మూవీ!

OTT: టోవినో థామస్ కాయాదు లోహర్ ప్రధాన పాత్రలో వచ్చిన పల్లి చట్టంబి సినిమా ఇప్పుడు ఓటిటి స్ట్రీమింగ్ డేట్ లాక్ చేసుకుంది.

on
- Advertisement -banner Ad

OTT:థియేటర్లలో విడుదలై.. ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రాలు ఓటీటీలో ఎప్పుడెప్పుడు వస్తాయా అని ప్రేక్షకులు సైతం ఎదురుచూస్తూ ఉన్నవారికి తాజాగా ఒక గుడ్ న్యూస్ వచ్చింది. మలయాళ స్టార్ హీరో టోవినో థామస్ నటించిన పీరియడ్ యాక్షన్ డ్రామా చిత్రం ‘పల్లి చట్టంబి’. థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకి భారీ స్పందన రావడంతో ఇప్పుడు ఓటీటి లో కూడా చూడడానికి ప్రేక్షకులకు మరింత ఆసక్తి కనబరుస్తున్నారు. ముఖ్యంగా చారిత్రక నేపథ్యం సెంటిమెంటుతో పాటు యాక్సిడెంట్ ఎలిమెంట్స్ కూడా అద్భుతంగా ఉండడంతో ఈ సినిమాని చూడడానికి మక్కువ చూపుతున్నారు.

ఓటిటి డేట్ లాక్ చేసుకున్న పల్లి చట్టంబి..

ఈ ఏడాది ఏప్రిల్ 15వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల అయింది. ఈ చిత్రానికి డీజో జోష్ ఆంటోని దర్శకత్వం వహించగా.. ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి అందరి చేత ప్రశంసలు అందుకుంది. జులై 24 నుంచి ఈ సినిమా సోనీ లీవ్ ఓటీటీలో(OTT) స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా సంస్థ అఫీషియల్ గా ప్రకటించింది. థియేటర్లలో మిస్సయిన ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఇప్పుడు ఓటీటిలో చూడవచ్చు. ఈ చిత్రంలో టోవినో థామస్ కు జోడిగా కయదూ లోహర్ నటించింది.

- Advertisement -
Advertisement

also read:Indraja:ఇంద్రజకు జబర్దస్త్ బంపర్ ప్యాకేజ్..ఒక్క ఎపిసోడ్‌కే హీరోయిన్స్ కి మించిన పారితోషికం!

స్టోరీ విషయానికి వస్తే:

1950వ కాలం నాటి నేపథ్యంలో తెరకెక్కించిన కథ ఇది. కృష్ణ పిళ్ళై అనే వ్యక్తి కేంద్రంగా సాగుతుంది. ముఖ్యంగా చిన్నతనంలో దారుణమైన దాడిలో తన కుటుంబాన్ని కోల్పోయినటువంటి కృష్ణను.. ఒక మత గురువు, అక్కడ స్థానిక కుటుంబాలు ఆదరిస్తూ పెంచుతారు. కృష్ణ జీవితంలో వరుస విషాదాలు ఎదురైన అన్యాయానికి ఎదురుగా నిలబడే సంకల్పంతోనే అతడు పైకి ఎదుగుతారు. అలా పోతన క్రిస్టోఫర్ అనే పేరుతో కనియార్ గ్రామానికి చేరుకొని అక్కడి ప్రజల విశ్వాసాన్ని పొందుతారు. అలా గ్రామంలో అందరికీ విద్య అందించాలనే లక్ష్యంతో పాఠశాలను కూడా ఏర్పాటు చేయాలనుకుంటారు. అదే ఊరిలో కనే రెబ్బకాతో కృష్ణకు పరిచయం ఏర్పడుతుంది. ఆ తర్వాత కథ చాలా ఎమోషనల్ గా ముందుకు వెళుతుంది. అలాగే గ్రామంలో వరుసగా హింసాత్మకమైన ఘటనలు చేసుకోవడంతో కృష్ణ ఒక పెద్ద కుట్రను గుర్తిస్తారు. అయితే ఆ కుట్రను బయట పెట్టడానికి అతను చేసే పోరాటమే ఈ సినిమా ప్రధాన అంశము. చివరికి భూస్వామితో జరిగే తుది పోరాటమే ఈ సినిమా కథ. అయితే ఈ సినిమా ఒక భాగమే కాదు సీక్వెల్ కూడా ఉన్నట్లు సమాచారం.

- Advertisement -
Advertisement

also read:Rajamouli :అందరు అనుకున్నట్లే జరిగింది..రాజమౌళి నెక్స్ట్ సినిమా పై బిగ్ బ్లాస్టింగ్ అప్డేట్!?

నటీనటులు ఎవరంటే?

నటీనటుల విషయానికొస్తే.. టోవినో థామస్, కాయాదు లోహార్, శత్రు, విజయ్ రాఘవన్, టీజీ రవి, అలెగ్జాండర్ ప్రశాంత్ తదితరులు కీలకమైన పాత్రలో నటించారు. ఈ చిత్రంలో అతిధి పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించారు. గ్రామీణ నేపథ్యంలో సాగే సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకుంటుంది.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you