Tollywood:టాలీవుడ్ డ్యాన్సర్స్ అసోసియేషన్ లో గత కొద్దిరోజులుగా వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ వివాదం రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. పైగా ఇది కేవలం డ్యాన్సర్స్ మధ్య జరుగుతున్న అంతర్గత గొడవలా కనిపిస్తున్నప్పటికీ దీని వెనక టాలీవుడ్ లో ఇద్దరు స్టార్ కొరియోగ్రాఫర్ల మధ్య ఆదిపత్య పోరు అన్నట్టుగా వినికిడి. నిన్నటిదాకా ఇద్దరు టాప్ మాస్టర్లు మధ్య సాగిన ఈ వార్ ఇప్పుడు ఏకంగా తెలుగు ఫిలిం ఫెడరేషన్ వర్సెస్ డ్యాన్సర్స్ అసోసియేషన్ గా మారిపోయింది. ఈ వివాదం సర్దుమణుగుతుందని భావించినప్పటికీ, ఇప్పుడు తిరుగుబాటు కనిపిస్తూ ఉండడంతో ఈ విషయం ఫిలింనగర్లో హాట్ టాపిక్ గా మారింది.
డ్యాన్సర్స్ అసోసియేషన్ లో ఉప ఎన్నికలు..
టాలీవుడ్(Tollywood) లో స్టార్ కొరియోగ్రాఫర్లుగా పేరు సంపాదించిన శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ మధ్య గత కొంతకాలంగా కోల్డ్ వార్ నడుస్తోంది. ప్రస్తుతం డ్యాన్సర్స్ అసోసియేషన్ కి జానీ మాస్టర్ భార్య సుమలత అధ్యక్షురాలిగా ఉన్నారు. మొత్తం 17 మంది సభ్యులతో కూడినటువంటి ఈ కమిటీలో రెమ్యునరేషన్ స్కామ్ జరుగుతోందని జనరల్ సెక్రెటరీ, ట్రెజరర్ ను ప్రెసిడెంట్ సుమలత సస్పెండ్ చేశారు. అయితే ఆమె తీసుకున్న ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ శేఖర్ మాస్టర్ వర్గానికి చెందిన మరో ఎనిమిది మంది ఈసీ సభ్యులు సైతం తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో అసోసియేషన్ లో ఒక్కసారిగా పదిమంది సభ్యులు ఖాళీ అవ్వడం జరిగింది.
సుమలత కీలక వ్యాఖ్యలు..
ఇక్కడే అసలు ఇబ్బంది ఎదురయ్యింది. ఖాళీ అయిన ఆ పది స్థానాల భర్తీ కోసం మాత్రమే ఎన్నికలు ఉపయోగించాలంటూ సుమలత పట్టుబడినప్పటికీ అందుకు శేఖర్ మాస్టర్ వర్గం నుంచి ఎవరు ఒప్పుకోలేదు. అసోసియేషన్ పూర్తిగా రద్దు చేసి మరీ మొదటి నుంచి పూర్తిస్థాయి ఎన్నికలు నిర్వహించాలంటూ తెరమీదికి తీసుకువచ్చారు. ఈ పంచాయతీ కాస్త ఇప్పుడు తెలుగు ఫిలిం ఫెడరేషన్ ముంగిటకి చేరింది. దీంతో సుమలతతో పాటుగా సస్పెండ్ అయిన సభ్యులతో ఒక కీలకమైన సమావేశం నిర్వహించింది ఫెడరేషన్.
ALSO READ:Oh sukumari:ఓ సుకుమారి మూవీ రివ్యూ.. ప్రేక్షకులను మెప్పించిందా?
వ్యతిరేకత మొదలు..
అయితే ఈ ఫెడరేషన్ కేవలం ఏకపక్షంగా నిర్వహించారని శేఖర్ మాస్టర్ వర్గం నుంచి వచ్చిన వాదనలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని తమ వైపు నుంచి న్యాయాన్ని వినలేదంటూ సుమలత టీం కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఫెడరేషన్ వైఖరి పైన తిరుగుబాటు ప్రకటించారు డ్యాన్సర్స్ అసోసియేషన్. దీంతో ఇందులో ఓటింగ్ నిర్వహించగా 75 మంది సభ్యులు ఉప ఎన్నికలకు జై కొట్టారని తెలుస్తోంది.
ALSO READ:The Odyssey:ది ఒడిస్సీ మూవీ రివ్యూ.. యాక్షన్ డ్రామా మూవీకి హైలెట్స్ అవే..!
ఉప ఎన్నికలు ఎప్పుడంటే?
ఉప ఎన్నికల షెడ్యూల్ విషయానికి వస్తే జూలై 21వ తేదీన నామినేషన్ల స్వీకరణ, 22వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ, జులై 26న పోలింగ్ ఫలితాలు కూడా వెలువడనున్నాయి. సుమలత వర్గం ఈ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికల జరపడానికి దూకుడు ప్రదర్శిస్తూ ఉంటే మరొకవైపుగా మొత్తం కార్యవర్గానికి ఎన్నికలు జరపాలని వ్యతిరేక వర్గం పట్టుబడుతోంది




