Varanasi:దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం “వారణాసి”(Varanasi). ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాల నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా(Priyanka Chopra)పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం అభిమానులను ప్రత్యేక సర్ప్రైజ్ అందించింది. ఆమె పాత్రకు సంబంధించిన రెండు ప్రత్యేక లుక్ పోస్టర్లను అంతర్జాతీయ మీడియా వేదికగా విడుదల చేసింది.
మందాకిని పాత్రలో ప్రియాంక:
విడుదలైన పోస్టర్లో ఒకదానిలో ప్రియాంక చోప్రా “మందాకిని” అనే పాత్రలో కనిపించారు. సాంప్రదాయ దుస్తులు ప్రశాంతమైన హవ భావాలతో ఆమె లుక్ ఆకట్టుకునేలా ఉంది. పాత్రలోని గంభీరత, ఆధ్యాత్మికతను ప్రతిబింబించేలా ఈ డిజైన్ రూపొందించాలని సినీవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ పోస్టర్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో జెడ్ స్పీడ్ లో ట్రెండ్ అవుతుంది.
ALSO READ:Tollywood: డ్యాన్సర్స్ అసోసియేషన్ లో ముదురుతున్న వివాదం.. ఎన్నికలు తప్పవా?
చిల్ మోడ్ లో మరో స్టైలిష్ లుక్ :
రెండో పోస్టర్ లో మాత్రం ప్రియాంక పూర్తి భిన్నమైన స్టైల్ లో దర్శనమిచ్చారు. కూల్ అండ్ కాన్ఫిడెంట్ లుక్ లో కనిపిస్తూ ఆధునిక శైలిని ప్రతిబింబించారు. ఒకే చిత్రంలో రెండు విభిన్న కోణాలను చూపించేలా పోస్టర్లను రూపొందించడం అభిమానుల్లో మరింత ఆసక్తి పెంచింది. ఆమె పాత్ర కథలో కీలకమైన మలుపులకు కారణమవుతుందని చర్చ కూడా మొదలైంది.
ALSO READ:Oh sukumari:ఓ సుకుమారి మూవీ రివ్యూ.. ప్రేక్షకులను మెప్పించిందా?
సోషల్ మీడియాలో భారీ స్పందన :
ప్రియాంక చోప్రా అభిమానులతో పాటు మహేష్ బాబు(Mahesh babu), రాజమౌళి అభిమానులు కూడా ఈ పోస్టులను పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు. పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి ప్రత్యేక అప్డేట్ ఇవ్వడంతో మేకర్స్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. పోస్టర్లలోని విజువల్ క్వాలిటీ పాత్ర రూపకల్పన పై సినీ అభిమానుల్లో వేరే లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి.
భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం ఎప్పటికే దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రాజమౌళి దర్శకత్వం, మహేష్ బాబు హీరోగా నటించడం.. ప్రియాంక చోప్రా కీలక పాత్ర పోషించడం వంటి అంశాలు సినిమాపై అంచనాలను మరింత పెంచేస్తున్నాయి. తాజాగా విడుదలైన న్యూ పోస్టర్స్ తో వారణాసి పై ప్రేక్షకుల్లో ఆసక్తి మరో స్థాయికి చేరుకుంది అనడంలో సందేహం లేదు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్డేట్ ల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Grace when she smiles.
Fire when she doesn’t.Mandakini… @PriyankaChopra in #Varanasi pic.twitter.com/4lYerYbm4Q
— rajamouli ss (@ssrajamouli) July 18, 2026




