Tuesday, July 21, 2026
HomeLATESTNBK 111: హీరో బాలకృష్ణకు గాయాలు.. ఇప్పుడు ఎలా ఉందంటే?

NBK 111: హీరో బాలకృష్ణకు గాయాలు.. ఇప్పుడు ఎలా ఉందంటే?

NBK 111: NBK 111 సినిమా షూటింగు శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో కాకినాడ పోర్టులో జరుగుతున్న షూటింగ్లో బాలకృష్ణకు గాయాలైనట్లు సమాచారం.

on
- Advertisement -banner Ad

NBK 111:టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ, హిందూపురం ఎమ్మెల్యే గా మంచి పేరు సంపాదించారు. బాలకృష్ణ సీనియర్ హీరోలలో సక్సెస్ఫుల్ హీరోగా కూడా పేరు సంపాదించారు. ముఖ్యంగా విభిన్నమైన కథలతో అభిమానులను ఆకట్టుకుంటున్న బాలకృష్ణ ప్రస్తుతం (NBK 111) చిత్రంలో నటిస్తున్నారు. విచిత్రాన్ని డైరెక్టర్ గోపీచంద్ మరినేని దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్లో భాగంగా కాకినాడ పోర్టులో యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ జరుగుతోంది. యాక్షన్ సీక్వెన్స్ చేస్తూ ఉన్న సమయంలో బాలకృష్ణకి గాయమైనట్లుగా తెలుస్తోంది. దీంతో అక్కడ వెంటనే అప్రమత్తమైన సిబ్బంది బాలకృష్ణను ఆసుపత్రికి తరలించారు.

షూటింగ్లో బాలయ్యకి గాయాలు..

బాలకృష్ణకు గాయం అయిందనే విషయం అభిమానులకు తెలియగానే.. ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ విషయం పైన ఇప్పటివరకు ఎవరు కూడా అధికారికంగా స్పందించలేదు. బాలకృష్ణకు వైద్య పరీక్షల అనంతరం కొన్ని రోజులపాటు విశ్రాంతి అవసరమంటూ వైద్యులు సూచించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గోపీచంద్ మలినేని భారీ యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్న సమయంలో ఇలాంటి ఘటన జరగడంతో చిత్ర బృందం కూడా నిరుత్సాహంతో ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరిగేలా చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్ స్టార్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు.

- Advertisement -
Advertisement

ALSO READ:Naga Chaitanya:నాగార్జున కెరీర్ సక్సెస్‌కు కారణం ఇదే.. చైతన్య చెప్పిన ఆసక్తికర విషయం!

డిసెంబర్ 24 టార్గెట్గా షూటింగ్ పనులు చక చక..

ఈ చిత్రంలో బాలకృష్ణకు జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. సంగీతాన్ని థమన్ అందిస్తున్నారు. అలాగే కీలకమైన పాత్రలో మంచు మనోజ్ కూడా నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాని ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న విడుదల చేసేలా చిత్ర బృందం ప్లాన్ చేశారు. మరి బాలయ్య గాయం వల్ల ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ కూడా ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. గతంలో బాలకృష్ణ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వచ్చిన వీర సింహారెడ్డి చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుందో చెప్పాల్సిన పని లేదు. అందుకే ఇప్పుడు NBK 111 పైన భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.

- Advertisement -
Advertisement

ALSO READ:Chiranjeevi :35 ఏళ్ల తర్వాత తన జాన్ జిగిడి దోస్త్ కి ఛాన్స్ ఇచ్చిన చిరంజీవి..!?

బాలకృష్ణ గాయం పై స్పందించిన డైరెక్టర్..

తాజాగా బాలకృష్ణ గాయం పైన డైరెక్టర్ గోపిచంద్ మలినేని ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. కాకినాడలో షూటింగ్ జరుగుతూ ఉండగా బాలకృష్ణ గారికి స్వల్ప కండర గాయం అయిందని, వైద్యుల సలహా మేరకు ఒక చిన్నపాటి శస్త్ర చికిత్స చేయించుకోవలసి ఉంటుందని తెలిపారు. సినిమా పట్ల ఆయనకు ఉన్న క్రమశిక్షణ, కష్టపడే తత్వం NBK 111 చిత్ర బృందంలోని ప్రతి ఒక్కరికి కూడా స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. అభిమానులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన పనిలేదు. త్వరగా కోలుకొని తిరిగి షూటింగ్లో చేరుతారని తెలియజేశారు. ఈ విషయం విన్న అభిమానులు సైతం కాస్త ఊపిరి పీల్చుకున్నారు.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you