Tuesday, July 21, 2026
HomeLATESTChiranjeevi :35 ఏళ్ల తర్వాత తన జాన్ జిగిడి దోస్త్ కి ఛాన్స్ ఇచ్చిన చిరంజీవి..!?

Chiranjeevi :35 ఏళ్ల తర్వాత తన జాన్ జిగిడి దోస్త్ కి ఛాన్స్ ఇచ్చిన చిరంజీవి..!?

Chiranjeevi :మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మెగా 158 చిత్రంలో సీనియర్ నటుడు శరత్‌కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం

on
- Advertisement -banner Ad

Chiranjeevi :మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో అభిమానులను అలరిస్తూనే ఉన్నారు. ఇటీవల విడుదలైన “మన శంకర వరప్రసాద్” సినిమా ఎంత పెద్ద హిట్ అయింది అనేది అందరికీ తెలిసిందే. ప్రెసెంట్ దర్శకుడు బాబీ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన “వాల్తేరు వీరయ్య” సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో ఈ కాంబోపై మరిన్ని అంచనాలు ఏర్పడ్డాయి.

గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న చిత్రం :

చిరంజీవి (Chiranjeevi )కెరియర్లో 158వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాను కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవిని మరోసారి పవర్ఫుల్ పాత్రలో చూపించేందుకు దర్శకుడు బాబి సిద్ధమవుతున్నట్లు సమాచారం.

- Advertisement -
Advertisement

ALSO READ:TV:స్టేజ్‌పైనే సుధీర్ షర్ట్ కాలర్ పట్టుకున్న అనిల్ రావిపూడి..!

35 ఏళ్ల తర్వాత శరత్ కుమార్ ఎంట్రీ:

ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం ఫిలిమ్ వర్గాలలో తెగ ట్రెండ్ అవుతుంది. ప్రముఖ నటుడు శరత్ కుమార్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించనున్నారు అనే ప్రచారం గట్టిగా జరుగుతుంది. ఇదే కనుక నిజమైతే చిరంజీవి – శరత్ కుమార్ కలిసి దాదాపు 35 ఏళ్ల తర్వాత ఒకే సినిమాలో కనిపించనున్నట్లు అవుతుంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో “గ్యాంగ్ లీడర్” వచ్చింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ చరిత్రనే తిరగ రాసింది అలాగే “స్టువర్ట్‌పురం” పోలీస్ స్టేషన్ చిత్రంలో కూడా ఇద్దరు కలిసి నటించారు. ఈ కొత్త సినిమాలో శరత్ కుమార్ పాత్రకు మల్టీ షేడ్స్ లో ఉంటాయి అని , నెగిటివ్ టచ్ తో కూడిన క్యారెక్టర్ లో ఆయన కనిపించే అవకాశం ఉంది అంటూ సినీ వర్గాలల్లో ప్రచారం కొనసాగుతుంది. అయితే దీనిపై చిత్ర బృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

- Advertisement -
Advertisement

ALSO READ:Chiranjeevi:చిరంజీవి అభిమానులకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్..?

చిరు-శరత్ కుటుంబాల మధ్య ప్రత్యేక బాండింగ్:

చిరంజీవి – శరత్ కుమార్ మధ్య వ్యక్తిగతంగా కూడా మంచి స్నేహబంధం ఉంది. గతంలో తన క్లిష్ట్ పరిస్థితుల్లో ఉన్న సమయంలో చిరంజీవి ఎంతో అండగా నిలిచారని శరత్ కుమార్ పలుమార్లు వెల్లడించారు. అలాగే శరత్ కుమార్ సతీమణి అని రాధిక కూడా చిరంజీవితో అనేక విజయవంతమైన చిత్రాలలో నటించారు. ఇక ఈ చిత్రంలో యువ నటి అనశ్వర రాజన్ చిరంజీవి కుమార్తె పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం . దీంతో ఈ సినిమాపై హై ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you