Monalisa: సోషల్ మీడియా ద్వారా చాలామంది పాపులారిటీ సంపాదించుకొని సినీ సెలబ్రిటీలుగా మారిన వారు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో ప్రయాగ్ రాజ్ కుంభమేళాలో సోషల్ మీడియా ద్వారా ఒక్కసారిగా పాపులారిటీ సంపాదించుకుంది మోనాలిసా. అప్పటినుంచి ఆమె పేరు ఏదో ఒక విషయంలో వైరల్ గా మారింది. అంతేకాకుండా ఒక ప్రొడ్యూసర్ ఏకంగా ఆమెతో సినిమాని కూడా అనౌన్స్ చేశారు. ఆ తర్వాత తెలుగులో కూడా పలు చిత్రాలలో నటించేందుకు అవకాశాలు అందుకుంది. అయితే అటువంటి తరుణంలోనే మోనాలిసా ప్రేమ వివాహం వల్ల నిరంతరం వార్తలలో నిలుస్తూనే ఉంది.
మళ్లీ పోలీసులను ఆశ్రయించిన మోనాలిసా..
పెళ్లి అనంతరం కుంభమేళ మోనాలిసా (Monalisa)భర్త పైన కూడా పలు రకాల కేసులు నమోదయ్యాయి. మోనాలిసా తల్లిదండ్రులు తన కూతురికి 18 సంవత్సరాలు నిండకుండానే వివాహం చేసుకున్నారంటూ ఆరోపణలు చేశారు. ఇటువంటి తరుణంలోని మోనాలిసా తనకు ప్రాణహాని ఉందని ఆరోపిస్తూ కేరళలోని ఎర్నాకులం స్టేషన్లో కంప్లైంట్ కూడా చేసింది. తనకు రక్షణ కల్పించాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది. మోనాలిసా తన న్యాయవాది తో కలిసి ఆదివారం సాయంత్రం ఎర్నాకులం పోలీస్ స్టేషన్ కి వెళ్లి తన భద్రత గురించి కోరుతూ ఒక దరఖాస్తు సమర్పించినట్లు సమాచారం.
also read:OTT:4 ఏళ్ల నిరీక్షణకు తెర.. మృణాల్ ఠాకూర్ కొత్త సినిమా నేరుగా OTTలోకి!
ప్రాణహాని ఉందంటూ ఆరోపణలు..
ఈ సందర్భంగా మోనాలిసా మాట్లాడుతూ.. తన తండ్రి తన పాస్పోర్టు డబ్బులు తీసుకున్నారని, దీనితో తనకు ప్రాణహాని ఉందంటూ ఆరోపణలు చేసింది. మోనాలిసా భర్త ఫర్మాన్ ఖాన్ పై కిడ్నాప్ ఆరోపణలు ఉన్నాయని, మోనాలిసా మైనర్ అంటూ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మధ్యప్రదేశ్ పోలీసులు సైతం కేసు నమోదు చేశారు. కానీ మోనాలిసా మాత్రం తాను మేజర్ ని అని , తన ఇష్టపూర్వకంగానే తన పెళ్లి జరిగిందంటూ తెలియజేసింది.
also read:NBK 111: హీరో బాలకృష్ణకు గాయాలు.. ఇప్పుడు ఎలా ఉందంటే?
స్పందించిన పోలీసులు..
గత నెలలో మోనాలిసా తనకు ప్రాణహాని ఉందంటూ కేరళ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆమెకు పోలీసులు సైతం రక్షణ కల్పించాలంటూ కోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు మళ్లీ పోలీసులను మోనాలిసా ఆశ్రయించడంతో మరొకసారి ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. తదుపరి చర్యల పైన కొచ్చి నగర పోలీస్ కమిషనర్ తో సంప్రదించిన తర్వాతే ఎలాంటి నిర్ణయం తీసుకుంటామంటూ ఎర్నాకులం పోలీస్ స్టేషన్ అధికారులు తెలియజేశారు. మోనాలిసా కుంభమేళలో తన ప్రత్యేకమైన రూపంతో అందంతో అందరిని ఆకట్టుకోవడంతో సోషల్ మీడియాలో ఓవర్ నైట్ కి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అనంతరం పలు సినిమాలలో నటించే అవకాశాలు అందుకున్న మోనాలిసా ఇలా ఫర్మాన్ ఖాన్ తో వివాహం కుటుంబ వివాదాల వల్ల నిరంతరం ఈమె పేరు వార్తల్లో నిలుస్తోంది.




