Tuesday, July 21, 2026
HomeLATESTToxic:టాక్సిక్ నుంచి మరో సాంగ్ రిలీజ్.. మొత్తం రొమాన్స్..!

Toxic:టాక్సిక్ నుంచి మరో సాంగ్ రిలీజ్.. మొత్తం రొమాన్స్..!

Toxic: టాక్సిక్ మూవీ నుండి తాజాగా మరో రొమాంటిక్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాట సినిమాపై మరిన్ని అంచనాలను పెంచుతోంది.

on
- Advertisement -banner Ad

Toxic:కేజిఎఫ్ చిత్రాలతో దేశవ్యాప్తంగా భారీ పాపులారిటీ సంపాదించారు రాకింగ్ స్టార్ యష్. ఆ తర్వాత అంతే మోస్ట్ వాంటెడ్ చిత్రంగా నటిస్తున్న చిత్రం టాక్సిక్(Toxic). ఈ చిత్రం గ్యాంగ్స్టర్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతోంది. పాన్ ఇండియా లెవెల్లో ఈ చిత్రాన్ని డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో చాలా గ్రాండ్గా విడుదల కాబోతోంది. ఇందులో భాగంగా ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఇప్పటికే టాక్సిక్ సినిమా నుంచి విడుదలైన ప్రతి అప్డేట్ కూడా సినిమా అంచనాలను భారీగా పెంచేస్తోంది.

టాక్సిక్ నుండి మరో రొమాంటిక్ సాంగ్ రిలీజ్..

ముఖ్యంగా ఈ సినిమాలో హీరోయిన్స్ గురించి ఒక చర్చ అయితే జోరుగా సాగుతోంది. రొమాన్స్ సీన్స్ మరింత హైలెట్గా నిలవనున్నాయట. అలాగే మొదట విడుదలైన తబాహీ పాటలో యష్ – కియారా మధ్య సాగిన రొమాన్స్ వీడియోలు, ఫోటోలు సైతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. ఇప్పుడు తాజాగా ఇదే సినిమా నుంచి మరొక పాట” మనసాగదే ” అనే రెండవ రొమాంటిక్ సింగిల్ ని మేకర్స్ సైతం విడుదల చేశారు.

- Advertisement -
Advertisement

also read:Monalisa: ప్రాణహని ఉంది.. కుంభమేళ మోనాలిసా కామెంట్స్!

అదరగొట్టేసిన జంట..

ఈ పాటను హీరో యష్, బాలీవుడ్ బ్యూటీ తారాసుతారియా మధ్య సాగేటువంటి రొమాంటిక్ కెమిస్ట్రీ ప్రేక్షకులను మరింత ఆకట్టుకునేలా కనిపిస్తోంది. ముఖ్యంగా బాత్ టబ్ లో గన్ తో లవ్ ప్రపోజ్ చేసే సీన్ చాలా వెరైటీగా డిఫరెంట్ గా ఉందంటూ పలువురి నేటిజన్స్ సైతం కామెంట్స్ చేస్తున్నారు. మాస్ అండ్ ఇంటెన్స్ యాక్షన్ లుక్ కు చాలా విభిన్నంగా యష్ రొమాంటిక్ లుక్కులో మరింత ఆకట్టుకున్నారని చెప్పవచ్చు. ఈ పాట సోషల్ మీడియాలో భారీ స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకుంది.

- Advertisement -
Advertisement

also read:OTT:4 ఏళ్ల నిరీక్షణకు తెర.. మృణాల్ ఠాకూర్ కొత్త సినిమా నేరుగా OTTలోకి!

ప్రమోషన్స్ తో సినిమాపై భారీ హైప్..

టాక్సిక్ సినిమాలో నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్ తదితర నటీనటులు కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ప్రమోషన్స్ లో భాగంగా కొన్ని రకాల అప్డేట్లు ఇస్తున్న చిత్ర బృందం.. యాక్షన్ కంటే ఎక్కువగా గ్లామర్ రొమాన్స్ కి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తోంది. అంతేకాకుండా గత కొద్దిరోజులుగా ఈ సినిమా నుంచి మరో ట్రైలర్ రాబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసేలా ఉంటుందని వినిపిస్తోంది. ఏది ఏమైనప్పటికీ యష్ ప్రమోషన్స్ కి అదిరిపోయే రెస్పాన్స్ మాత్రం లభిస్తోంది. మరి సినిమా ఎలా ఆకట్టుకుంటుందో చూడలి మరి.

- Advertisement -
Advertisement

 

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you