Tuesday, August 25, 2026
HomeLATESTKA Productions: నుంచి క్రేజీ అనౌన్స్‌మెంట్.. పోస్టర్ చూస్తే గూస్‌బంప్సే!

KA Productions: నుంచి క్రేజీ అనౌన్స్‌మెంట్.. పోస్టర్ చూస్తే గూస్‌బంప్సే!

KA Productions:కిరణ్ అబ్బవరం బ్యానర్‌ KA Productions నుంచి మరో ఆసక్తికరమైన మూవీ అనౌన్స్‌మెంట్ వచ్చింది.

on
- Advertisement -banner Ad

KA Productions:కిరణ్ అబ్బవరం.. ఈ పేరు చెబితే ఒకప్పుడు జనాలు చాలా సైలెంట్‌గా ఉండేవాళ్లు. అతడు ఇండస్ట్రీలోకి హీరోగా వచ్చాడు, సక్సెస్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడు.. ఇంతవరకే మాట్లాడుకునే వాళ్లు. కానీ ఇప్పుడు అదే పేరు చెబితే మాత్రం వేలాది మంది జనాలు ఓ రేంజ్‌లో అరుపులు, కేకలు పెడుతూ ఉంటారు. అంతలా ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు కిరణ్ అబ్బవరం. కిరణ్ అబ్బవరం తాజాగా నటించిన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఎంత పెద్ద సూపర్ డూపర్ హిట్ అయింది అనేది అందరికీ తెలిసిందే. కిరణ్ అబ్బవరం పేరు మరొకసారి సోషల్ మీడియాలో మార్మోగిపోవడానికి ఈ సినిమా ప్రధాన కారణం అని చెప్పుకోక తప్పదు.

మరో కొత్త సినిమాతో కిరణ్ :

ఇప్పుడు ఈ యంగ్ హీరో మరో కొత్త సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. యంగ్ హీరో కిరణ్(KA Productions) అబ్బవరం సినిమా కథల విషయంలో ఎంత పర్ఫెక్ట్‌గా ఆలోచిస్తాడు అన్న విషయం అందరికీ తెలుసు. కమర్షియల్ ఫార్ములాకు భిన్నంగా కొత్త కొత్త కాన్సెప్ట్లు, కొత్త జోనర్లతో ప్రేక్షకులు ఎలాంటి సినిమాలు తీసుకువస్తే ఎంజాయ్ చేస్తారు, ఆ అనుభూతిని ఫీల్ అవుతారు అనే విధంగా కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

- Advertisement -
Advertisement

ఇప్పటికే ‘చెన్నై లవ్ స్టోరీ’తో అది బాగా రుజువైంది. అంతేకాదు, కిరణ్ అబ్బవరం హీరోగా జీ స్టూడియోస్ నిర్మాణంలో రాబోతున్న భారీ పాన్ ఇండియా మైథలాజికల్ సినిమా ‘ఇంద్రపుత్ర’. దీనికి సంబంధించి టైటిల్ కూడా అధికారికంగా ప్రకటించేశారు. దీనిపై హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. కచ్చితంగా ఈ సినిమాతో వేరే లెవెల్ హిట్ అందుకుంటాడు కిరణ్ అబ్బవరం అని ఓ రేంజ్‌లో ప్రశంసిస్తున్న మూమెంట్‌లోనే..మరో ఆసక్తికరమైన సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చేసింది.

also read:Simran :ఓరి మీ దుంపల్ తెగ..సిమ్రాన్ రెండో పెళ్లి పై ఘాటు కామెంట్స్..!

- Advertisement -
Advertisement

మరో ఆసక్తికరమైన సినిమా అనౌన్స్‌మెంట్ :

కిరణ్ అబ్బవరం ‘కేఏ ప్రొడక్షన్’ బ్యానర్‌పై ‘తిమ్మరాజుపల్లి టీవీ’ వంటి ప్రాజెక్టును తీసుకొచ్చిన ఆయన, ఇప్పుడు మరొక ఆసక్తికరమైన సినిమాను అనౌన్స్ చేశారు. అయితే ఈ స్టోరీ ఏంటి అనేది పూర్తిగా సీక్రెట్‌గా దాచేశారు. కె.వి. ప్రొడక్షన్స్, పౌర్ణమి ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా ఈ కొత్త సినిమాను నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. కిరణ్ అబ్బవరం ఈ సినిమాను సమర్పిస్తుండగా, అనూష్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. హైలెట్ ఏంటంటే.. తనుజ పుట్టస్వామి ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నారు.

also read:Rasha Thadani:బ్యాక్ లెస్ అందాలతో యువతకు చెమటలు పట్టిస్తున్న రాషా తడానీ!

- Advertisement -
Advertisement

భయంకరమైన పోస్టర్‌తో ట్విస్ట్:

ఈ సినిమా ప్రకటనలోనే మేకర్స్ అద్భుతమైన ట్విస్ట్ పెట్టేశారు. దీంతో క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఎవరైనా సినిమాని అనౌన్స్ చేసేటప్పుడు హీరో, హీరోయిన్, టైటిల్ ఇలాంటివి చేస్తూ ఉంటారు. చిన్న క్లూ అయినా ఇస్తారు. అయితే ఈ ప్రాజెక్టు విషయంలో మాత్రం టోటల్ డిఫరెంట్. పక్షి కాళ్లను పోలిన ఒక భయంకరమైన ఆకారంతో కూడిన పోస్టర్ మాత్రమే విడుదల చేశారు. దీంతో ఈ పోస్టర్ వెనక ఉన్న అర్థం ఏమిటి అనేది కనుక్కోవడానికి ఇప్పుడు జనాలు తెగ ట్రై చేస్తున్నారు.

అభిమానుల్లో పెరిగిన ఆసక్తి:

కిరణ్ అబ్బవరం ఏం చేసినా చాలా డిఫరెంట్‌గా చేస్తాడు. ఇప్పుడు ఈ సినిమా విషయంలోనూ అదే చేయబోతున్నాడు అంటూ ఆయన టాలెంట్‌ను ప్రశంసిస్తున్నారు అభిమానులు. చూడాలి మరి.. కిరణ్ అబ్బవరం ఈ విషయంలో ఎంతవరకు సక్సెస్ అవుతాడు అనేది చూడాలి…

 

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you