Tuesday, August 25, 2026
HomeLATESTSimran :ఓరి మీ దుంపల్ తెగ..సిమ్రాన్ రెండో పెళ్లి పై ఘాటు కామెంట్స్..!

Simran :ఓరి మీ దుంపల్ తెగ..సిమ్రాన్ రెండో పెళ్లి పై ఘాటు కామెంట్స్..!

Simran :నటి సిమ్రాన్ రెండో పెళ్లి చేసుకున్నారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

on
- Advertisement -banner Ad

Simran :సోషల్ మీడియాలో ఏదైనా ఒక ఫొటో కానీ, వీడియో కానీ వైరల్ అయిందంటే చాలు.. దాని గురించి ఇక రాద్ధాంతం ఏ రేంజ్ లో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. దానికి సంబంధించి ఒక మూడు రోజుల వరకు ఏదో ఒక వార్తను ట్రెండింగ్‌లోకి తీసుకొస్తూనే ఉంటారు. గత 24 గంటల నుంచి సోషల్ మీడియాలో సిమ్రాన్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు బాగా వైరల్ అవుతున్నాయి. ఆమె రెండో పెళ్లి చేసుకున్నట్లు కొంతమంది ఫేక్ వార్తలు క్రియేట్ చేస్తున్నారు. మరికొందరు ఘాటుగా స్పందిస్తున్నారు. దీంతో సిమ్రాన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అవి ఆమె రెండో పెళ్లి ఫొటోలు కాదు.. ఓ సినిమా పూజా కార్యక్రమాల్లో దిగిన ఫొటోలు అని, ఇలాంటి చీప్ కామెంట్స్ చేయొద్దంటూ మండిపడుతున్నారు.

సిమ్రాన్ సెకండ్ ఇన్నింగ్స్‌:

సిమ్రాన్(Simran) తన సెకండ్ ఇన్నింగ్స్‌ను ఎంత చక్కగా ప్లాన్ చేసుకుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. మంచి మంచి రోల్స్‌లో నటిస్తూ హీరోయిన్‌గా ఎలాంటి క్రెడిట్ సంపాదించుకుందో.. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ అంతకంటే డబుల్ క్రేజ్ సంపాదించుకుంటుంది. తాజాగా సిమ్రాన్ ఒక స్పెషల్ సినిమాలో నటించేందుకు సైన్ చేసింది. ఇందులో జయరామ్‌తో కలిసి ఆమె నటించబోతుంది. ఈ క్రమంలోనే పూజా కార్యక్రమానికి ఇద్దరూ చాలా పద్ధతిగా సంప్రదాయ దుస్తుల్లో వచ్చారు. పూలదండలు వేసుకొని ఆకర్షణీయంగా కనిపించారు. దీంతో ఒక్కసారిగా ఇద్దరూ రెండో పెళ్లి చేసుకోబోతున్నారు అనే రూమర్స్ బాగా స్ప్రెడ్ అయిపోయాయి.

- Advertisement -
Advertisement

also read:Rasha Thadani:బ్యాక్ లెస్ అందాలతో యువతకు చెమటలు పట్టిస్తున్న రాషా తడానీ!

కేవలం సినిమా పూజా కార్యక్రమం కోసం:

అయితే, ఇది కేవలం సినిమా పూజా కార్యక్రమం కోసం మాత్రమే దిగిన ఫొటోలు అంటూ క్లారిటీ వచ్చింది. కానీ ఈ విషయం తెలుసుకోకుండా కొందరు చిల్లరగాళ్లు ఈ ఫొటోల గురించి తప్పుతప్పుగా క్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దీనిపై అటు జయరామ్ ఫ్యాన్స్, ఇటు సిమ్రాన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఏం మౌషులు రా సామీ..మీకు పనీపాటా లేదా..? ఇలాంటివి ఎలా సృష్టిస్తారు రా బాబు అంటూ ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -
Advertisement

also read:Rashmika mandanna:గాయం తర్వాత మొదటిసారి బయటకు వచ్చిన రష్మిక..!

సోషల్ మీడియా అంటేనే అంతే:

సోషల్ మీడియా అంటేనే ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చిత్రీకరించే వేదిక అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా సిమ్రాన్‌కు సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమె పేరు ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఆ ఫొటో చుట్టూ ఎన్నో రకాల చర్చలు, ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే ఇందులో నిజానిజాలు తెలుసుకోకుండా స్పందించడం సరికాదని పలువురు సూచిస్తున్నారు. మొత్తానికి ఒకే ఒక్క ఫొటోతో సిమ్రాన్ పేరు 24 గంటల పాటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

- Advertisement -
Advertisement

సోషల్ మీడియాను ఎంత నెగెటివ్‌గా వాడుతున్నారు కొందరు చిల్లరగాళ్లు అని చెప్పడానికి ఇది మరో బిగ్ ఎగ్జాంపుల్‌గా మారింది. ఇకపై సోషల్ మీడియాలో ఏదైనా వార్త వైరల్ అయితే.. దాని గురించి ఆలోచించే ముందు అది నిజమా? కాదా? అన్నది కూడా తెలుసుకోవాలని సినీ ప్రముఖులు సూచిస్తున్నారు.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you