Srushti Varma:‘న్యాయం చేయరా దేవుడా’.. ఇప్పుడు ఈ పాట సోషల్ మీడియాను ఏ రేంజ్‌లో షేక్ చేసేస్తుందో అందరికీ తెలిసిందే. ఉదయం లేచిన మొదలు రాత్రి పడుకునే వరకు ఎక్కడో ఒకచోట ఈ పాట లిరిక్స్ తగులుతూనే ఉన్నాయి. అంతలా జనాలను పిచ్చెక్కించేస్తుంది ఈ సాంగ్. చంద్రబోస్ ఇచ్చిన సాహిత్యం మరింత హైలెట్‌గా మారింది. అంతకంటే హైలెట్‌గా స్టార్ సింగర్ సునీత ఈ పాటను తనదైన గాత్రంతో పాడడం ఇంకా ఇంకా సెన్సేషన్‌గా మారింది. మహావీర్ ఏలేందర్ అదిరిపోయే మాస్ బీట్‌ను సమకూర్చారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ పాట దుమ్ము దులిపేస్తుంది.
‘ధర్మస్థల నియోజకవర్గం’ నుంచి స్పెషల్ సాంగ్:
మూవింగ్ డ్రీమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై రూపాయితో ఉన్న సరికొత్త చిత్రమే ‘ధర్మస్థల నియోజకవర్గం’. ఈ సినిమాలో కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ (Srushti Varma)స్పెషల్ సాంగ్ చేశారు. జై జ్ఞాన ప్రభా తోట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి తాజాగా ‘న్యాయం చేయరా దేవుడా’ అంటూ ఒక పాటను రిలీజ్ చేశారు. మూవీ నుంచి విడుదలైన ఈ పాట ఇండస్ట్రీని షేక్ చేసి పడేస్తుంది. ముఖ్యంగా సింగర్ సునీత పాడిన ఈ పాట అందరినీ ఆకట్టుకుంటుంది.
also read:“న్యాయం చేయరా దేవుడా”.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సాంగ్!
అదిరిపోయే స్టెప్పులతో శ్రష్టి వర్మ:
ఈ స్పెషల్ సాంగ్‌లో సృష్టి వర్మ తన అందచందాలను విపరీతంగా ఆరబోసేసింది. అదిరిపోయే స్టెప్పులతో యువతను ఉర్రూతలూగించింది. నడుమున గిరగిరా తిప్పేస్తూ, బాడీని మెలికలు తిప్పుతూ కుర్రాళ్లకు పిచ్చెక్కించేస్తుంది. ఇక లిరిక్స్ విషయానికొస్తే.. నేటి జనరేషన్ వాళ్లకు నచ్చే టైప్‌లో ఉండడం ఇంకా హైలైట్. ‘మైసూర్ ప్యాలెస్‌లో ఉండాల్సిన దాన్ని.. మామూలు ఇంటిలో ఉంటున్నాను’ అంటూ పిచ్చెక్కించే లిరిక్స్ ఇచ్చేశారు చంద్రబోస్. ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో దుమ్ము దులిపేస్తుంది.
శ్రష్టి వర్మ ఎక్స్‌ప్రెషన్స్, గ్లామర్ డోస్, ఎనర్జిటిక్ డాన్స్ మూవ్స్.. వామ్మో, ఒకటో రెండో.. ప్రతిదీ కూడా హైలెట్‌గా మారింది. మరీ ముఖ్యంగా సాంగ్‌లో సృష్టి వర్మ వేసే డాన్స్ స్టెప్ అయితే విపరీతంగా ట్రెండ్ అవుతుంది. నో డౌట్.. ఈ పాటకు సంబంధించిన రీల్స్ మిలియన్స్ దాటిపోతాయని అంటున్నారు జనాలు.
also read:KA Productions: నుంచి క్రేజీ అనౌన్స్‌మెంట్.. పోస్టర్ చూస్తే గూస్‌బంప్సే!
సెప్టెంబర్ 4న గ్రాండ్ రిలీజ్ :
వరాహి మ్యూజిక్ ద్వారా విడుదలైన ఈ వీడియో సాంగ్ లాంచ్ కార్యక్రమంలో చంద్రబోస్‌తో పాటు ఆయన తనయుడు నందవనమాలిని కూడా పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 4న పీవీఆర్ ఐమాక్స్ పిక్చర్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా హాట్ టాపిక్‌గా మారింది.




