TV:డైలీ పనులతో బిజీగా గడిపిన తర్వాత సాయంత్రం ఇంట్లోనే రిలాక్స్ అవుతూ సినిమా చూడాలని ఎవరికి ఉండదు చెప్పండి. హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి సినిమా చూడాలి అని అంతా అనుకుంటారు. అలా భావించే సినీ అభిమానులకు తెలుగు టీవీ ఛానళ్లు ఎన్నో చిత్రాలను సిద్ధం చేశాయి. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, లవ్ స్టోరీలతో పాటు హాలీవుడ్ డబ్బింగ్ మూవీలు కూడా నేటి ప్రసార జాబితాలో ఉన్నాయి. మరి ఆగస్టు 25, మంగళవారం ఏ ఛానల్‌లో(TV) ఏ సినిమా ఎప్పుడు ప్రసారం కానుందో చూద్దాం.
డీడీ యాదగిరి:
డీడీ యాదగిరిలో ఉదయం 9 గంటలకు ‘అమెరికన్ సీజ్’ తెలుగు డబ్బింగ్ హాలీవుడ్ మూవీ ప్రసారం కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు ‘మా వారి గోల’, రాత్రి 9.30 గంటలకు ‘వైఫ్’ టెలికాస్ట్ అవుతాయి.
ALSO READ:Srushti Varma:”న్యాయం చేయరా దేవుడా”.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సాంగ్!
ఈ టీవీ ఛానళ్లు:
ఈటీవీలో ఉదయం 9 గంటలకు, అర్ధరాత్రి 12 గంటలకు ‘శుభ సంకల్పం’ ప్రసారం కానుంది. ఈటీవీ ప్లస్‌లో మధ్యాహ్నం 3 గంటలకు ‘నచ్చావులే’ సందడి చేయనుంది.
ఈటీవీ సినిమాలో ఉదయం 7 గంటలకు ‘శుభవార్త’, 10 గంటలకు ‘బాలరాజు’, మధ్యాహ్నం 1 గంటకు ‘ఆదిత్య 369’, సాయంత్రం 4 గంటలకు ‘స్నేహితులు’ ప్రసారం కానున్నాయి. రాత్రి 7 గంటలకు ‘సుందరకాండ’, 10 గంటలకు ‘#బ్రో’, అర్ధరాత్రి 1 గంటకు ‘అదృష్టం’ సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి.
ALSO READ:KA Productions: నుంచి క్రేజీ అనౌన్స్‌మెంట్.. పోస్టర్ చూస్తే గూస్‌బంప్సే!
జెమిని ఛానళ్లలో:
జెమిని టీవీలో ఉదయం 9 గంటలకు ‘ఆర్య 2’, మధ్యాహ్నం 3.30 గంటలకు ‘ఆ1 ఎక్స్‌ప్రెస్’ ప్రసారం కానుంది. జెమిని లైఫ్‌లో ఉదయం 11 గంటలకు ‘తప్పు చేసి పప్పుకూడు’, సాయంత్రం 4.30 గంటలకు ‘నా నువ్వే’ వస్తాయి.
జెమిని మూవీస్‌లో ఉదయం 7 గంటలకు ‘ఏమండోయ్ శ్రీవారు’, 10 గంటలకు ‘మాతృదేవోభవ’, మధ్యాహ్నం 1 గంటకు ‘సుబ్బు’, సాయంత్రం 4 గంటలకు నాని ‘గ్యాంగ్ లీడర్’, రాత్రి 7 గంటలకు ‘భద్ర’, 10 గంటలకు ‘9 నెలలు’ ప్రసారం కానున్నాయి.
జీ తెలుగు, జీ సినిమాలు:
జీ తెలుగులో ఉదయం 3 గంటలకు ‘బ్రూస్ లీ’, 9 గంటలకు ‘తఢాఖా’, సాయంత్రం 5 గంటలకు ‘భాయ్’ టెలికాస్ట్ అవుతాయి. జీ సినిమాల్లో ఉదయం 7 గంటలకు ‘చంటి’, 9 గంటలకు ‘భలే దొంగలు’, మధ్యాహ్నం 12 గంటలకు ‘శ్రీమంతుడు’, 3 గంటలకు ‘జయం మనదేరా’, సాయంత్రం 6 గంటలకు ‘నా పేరు సూర్య’, రాత్రి 9 గంటలకు ‘ఆకాశగంగ 2’ ప్రసారం కానున్నాయి.
స్టార్ మా ఛానళ్లు:
స్టార్ మాలో ఉదయం 9 గంటలకు ‘నిన్నుకోరి’ ప్రసారం కానుంది. స్టార్ మా మూవీస్‌లో ఉదయం 7 గంటలకు ‘లంబసింగి’, 9 గంటలకు ‘కనులు కనులు దోచాయంటే’, మధ్యాహ్నం 12 గంటలకు ‘రాజా రాణి’, 3 గంటలకు ‘ప్రతిరోజూ పండగే’, సాయంత్రం 6 గంటలకు ‘కుబేర’, రాత్రి 9.30 గంటలకు ‘శుభం’ ఉన్నాయి.
స్టార్ మా గోల్డ్‌లో ఉదయం 11 గంటలకు ‘దూకుడు’, మధ్యాహ్నం 2.30 గంటలకు ‘రాధాగోపాలం’, సాయంత్రం 5 గంటలకు ‘హ్యాపీ’, రాత్రి 8 గంటలకు ‘డిటెక్టివ్’ ప్రసారం కానున్నాయి.
ఇలా మంగళవారం సినీ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా పలు ఛానళ్లలో విభిన్నమైన సినిమాలు అందుబాటులో ఉండనున్నాయి.




