TV:బుధవారం (ఆగస్టు 26) తెలుగు టీవీ ఛానళ్లలో సినీ అభిమానులకు మంచి వినోదం అందనుంది. ఈటీవీ, జెమిని, జీ తెలుగు, జీ సినిమాలు, స్టార్ మా, స్టార్ మా మూవీస్, స్టార్ మా గోల్డ్ వంటి ఛానళ్లలో ఉదయం నుంచి అర్ధరాత్రి(TV) వరకు పలు సినిమాలు ప్రసారం కానున్నాయి. ముఖ్యంగా స్టాలిన్, శ్రీమంతుడు, చందమామ, సర్కారు వారి పాట, జనతా గ్యారేజ్, మిస్టర్ బచ్చన్, గోలీమార్ వంటి సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాయి.
డీడీ యాదగిరిలో మూడు సినిమాలు:
డీడీ యాదగిరి ఛానల్లో ఉదయం 9 గంటలకు హాలీవుడ్ తెలుగు డబ్బింగ్ మూవీ కరెక్టివ్ మెజర్స్ ప్రసారం కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు వైఫ్, రాత్రి 9.30 గంటలకు చిరంజీవులు టెలికాస్ట్ కానున్నాయి.
ఈటీవీ సినిమాలు:
ఈటీవీలో ఉదయం 9 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు లాహిరి లాహిరి లాహిరిలో సినిమా ప్రసారం కానుంది. ఇక ఈటీవీ ప్లస్‌లో మధ్యాహ్నం 3 గంటలకు దీవించండి సినిమా టెలికాస్ట్ అవుతుంది.
ALSO READ:Sobhita Dhulipala:”150 రోజులు చైతూకి దూరంగా ఉన్నా”..పెళ్లి పై శోభిత సెన్సేషనల్ కామెంట్స్..!
ఈటీవీ సినిమాలో వరుసగా మూవీస్:
ఈటీవీ సినిమాలో ఉదయం 7 గంటలకు “మామాశ్రీ”, 10 గంటలకు “అద్దాల మేడ”, మధ్యాహ్నం 1 గంటకు “మా ఆయన బంగారం” ప్రసారం కానున్నాయి. సాయంత్రం 4 గంటలకు “కోకిల”, 7 గంటలకు “బడ్జెట్ పద్మనాభం”, రాత్రి 10 గంటలకు “చలాకీ మొగుడు చాదస్తపు పెళ్లాం” టెలికాస్ట్ కానున్నాయి. అర్ధరాత్రి 1 గంటకు మరోసారి “మామాశ్రీ” ప్రసారం అవుతుంది.
ALSO READ:Bigg Boss :విజయవాడ నుంచి బిగ్‌బాస్‌కి.. రోహిత్ నాయుడు గురించి ఈ విషయాలు తెలుసా?
జెమిని ఛానళ్లలో క్లాస్, మాస్ సినిమాలు:
జెమిని లైఫ్‌లో ఉదయం 11 గంటలకు “బొంబాయి ప్రియుడు”, సాయంత్రం 4.30 గంటలకు “1945” సినిమాలు ప్రసారం కానున్నాయి. జెమిని టీవీలో ఉదయం 9 గంటలకు “పందెంకోడి 2”, మధ్యాహ్నం 3.30 గంటలకు “గోలీమార్” టెలికాస్ట్ అవుతాయి.
జెమిని మూవీస్‌లో అర్ధరాత్రి 1.30 గంటలకు “చాప్టర్ 6”, ఉదయం 4.30 గంటలకు “సింహం పులి”, 7 గంటలకు “స్టేట్ రౌడీ”, 10 గంటలకు “లవ్ టుడే”, మధ్యాహ్నం 1 గంటకు “డాన్ శీను”, సాయంత్రం 4 గంటలకు “రాజా విక్రమార్క”, 7 గంటలకు “అయోధ్య రామయ్య”, రాత్రి 10 గంటలకు “రుద్రుడు” ప్రసారం కానున్నాయి.
జీ తెలుగు, జీ సినిమాల్లో స్టార్ హీరోల సినిమాలు:
జీ తెలుగు ఛానల్లో ఉదయం 9 గంటలకు “స్టాలిన్”, మరో ప్రసారంగా “సంతోషం”, సాయంత్రం 5 గంటలకు “ఏమాయ చేశావే” సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి.
జీ సినిమాలు ఛానల్లో ఉదయం 3 గంటలకు “జయం మనదేరా”, 7 గంటలకు “శివ వేద”, 9 గంటలకు “బ్రదర్ ఆఫ్ బొమ్మాళి”, మధ్యాహ్నం 12 గంటలకు “శ్రీమంతుడు”, 3 గంటలకు “భైరవం”, సాయంత్రం 6 గంటలకు “చందమామ”, రాత్రి 9 గంటలకు “లౌక్యం”, అర్ధరాత్రి 12 గంటలకు “కాశీ” ప్రసారం కానున్నాయి.
స్టార్ మా, స్టార్ మా మూవీస్‌లో అదిరిపోయే లైనప్:
స్టార్ మా ఛానల్లో తెల్లవారుజామున 1.30 గంటలకు “మళ్లీ మళ్లీ ఇది రాని రోజు”, ఉదయం 4 గంటలకు “సింహా”, 9 గంటలకు “మిస్టర్ బచ్చన్” సినిమాలు ప్రసారం కానున్నాయి.
స్టార్ మా మూవీస్‌లో తెల్లవారుజామున 3 గంటలకు “చంద్రలేఖ”, ఉదయం 7 గంటలకు “భళా తందనాన”, 9 గంటలకు “చిన్నా”, మధ్యాహ్నం 12 గంటలకు “నువ్వే నువ్వే”, 3 గంటలకు “ఆదికేశవ”, సాయంత్రం 6 గంటలకు “సర్కారు వారి పాట”, రాత్రి 9.30 గంటలకు “జనతా గ్యారేజ్” ప్రసారం కానున్నాయి.
స్టార్ మా గోల్డ్‌లోనూ వరుస సినిమాలు:
స్టార్ మా గోల్డ్‌లో తెల్లవారుజామున 2.30 గంటలకు “మకుటం”, ఉదయం 5 గంటలకు “కాయ్ రాజా కాయ్”, 8 గంటలకు “మజా”, 11 గంటలకు “రాజుగారి గది 3” ప్రసారం కానున్నాయి. మధ్యాహ్నం 2.30 గంటలకు “విజయదశమి”, సాయంత్రం 5 గంటలకు “శ్రీనివాస కళ్యాణం” ప్రసారం కానున్నాయి. ఇలా బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు వివిధ జానర్లకు చెందిన సినిమాలు తెలుగు టీవీ ఛానళ్లలో సందడి చేయనున్నాయి.




