Spirit :ప్రస్తుతం సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రెండు చిత్రాలు ఒకటి ‘వారణాసి’ అయితే, మరొకటి ‘స్పిరిట్’. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా, ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా తెరకెక్కుతున్న ‘వారణాసి’పై ఎన్ని అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇండియన్ బాక్సాఫీస్ హిస్టరీని ఈ సినిమా తిరగరాస్తుంది అంటూ ఎంతోమంది ఆశగా వెయిట్ చేస్తున్నారు. దానికి తగ్గట్టే హై ఎక్స్‌పెక్టేషన్స్‌తో రిలీజ్ అవుతున్న మూవీ ‘స్పిరిట్’. ప్రభాస్ హీరోగా, తృప్తి హీరోయిన్‌గా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీపై కూడా భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి.
వారణాసి వర్సెస్ స్పిరిట్ :
రెండిటికి రెండే అనే విధంగా ‘వారణాసి వర్సెస్ స్పిరిట్’ (Spirit )అంటూ సోషల్ మీడియాలో తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. తాజాగా ‘వారణాసి వర్సెస్ స్పిరిట్’ అనే ఇష్యూపై ఆసక్తికరంగా స్పందించాడు సందీప్ రెడ్డి వంగా. రోమాంచం ఈవెంట్‌లో రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సందీప్ రెడ్డి వంగా ఇచ్చిన ఆన్సర్ అభిమానులను ఆకట్టుకుంటుంది. మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘వారణాసి’ ఏప్రిల్ 7న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. మరో పక్క ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘స్పిరిట్’ మూవీ మార్చి 5న థియేటర్లలోకి విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు.
also read:TV:బుధవారం టీవీలో వచ్చే సినిమాలివే..అన్నీ సూపర్ డూపర్ హిట్సే..!
రెండు బడా సినిమాల మధ్య గ్యాప్ సరిపోతుందా?:
రెండు పెద్ద సినిమాలు , బడా సినిమాల మధ్య గ్యాప్ కేవలం 30 రోజులు. ఇది సరిపోతుందా..? అంటూ రిపోర్టర్ ప్రశ్నించారు. దీనికి సమాధానంగా సందీప్ రెడ్డి వంగా.. “స్పిరిట్ కంటే వారణాసి ఇంకా చాలా పెద్దది అండి. రెండు సినిమాలకు మొత్తం 32 రోజుల గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ సరిపోతుందని అనుకుంటున్నాను” అంటూ సందీప్ రెడ్డి వంగా తనదైన స్టైల్‌లో మాస్ ఆన్సర్ ఇచ్చారు. ఒకపక్క ‘స్పిరిట్’ను తక్కువ చేయకుండా, మరో పక్క ‘వారణాసి’ని తక్కువ చేయకుండా సందీప్ రెడ్డి వంగా ఇచ్చిన ఆన్సర్ భలే బాగుంది. అంతేకాదు, ఒకవేళ సరిపోదు, ఆ 32 రోజుల వ్యవధి అనుకుంటే కచ్చితంగా మేము పక్కకు తప్పుకుంటాం అంటూ నవ్వుతూ బదులిచ్చారు.
సినిమా అంటే ఇదే విధంగా ఉండాలి.. హెల్తీ కాంపిటీషన్ ఉండాలి అంటూ సందీప్ రెడ్డి వంగా చెప్పాకే అర్థమైంది అన్న విషయాన్ని జనాలు హైలైట్ చేస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ‘స్పిరిట్ వర్సెస్ వారణాసి’ హాట్ టాపిక్‌గా బాగా ట్రెండ్ అవుతోంది.
also read:TV:బుధవారం టీవీలో వచ్చే సినిమాలివే..అన్నీ సూపర్ డూపర్ హిట్సే..!
నలుగురి మధ్య మంచి బాండింగ్:
మహేష్ బాబుకు రాజమౌళితో, అదే విధంగా సందీప్ రెడ్డి వంగాతో మంచి సాన్నిహిత్యం ఉంది. ఇక ప్రభాస్‌కు రాజమౌళికి మధ్య ఉన్న బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నలుగురూ మంచి ఫ్రెండ్స్. ఆ కారణంగా ఒక సినిమాకు ఒకరు సపోర్ట్ చేసుకుంటూ, అర్థం చేసుకుంటూ ఇలా పక్కకు తప్పుకునే ప్రాబ్లం లేదు అనే విధంగా ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు.




