Friday, August 28, 2026
HomeLATESTFriday TV Movies:ఈ శుక్రవారం టీవీలో అదిరిపోయే సినిమాలు.. పూర్తి లిస్ట్ ఇదే!

Friday TV Movies:ఈ శుక్రవారం టీవీలో అదిరిపోయే సినిమాలు.. పూర్తి లిస్ట్ ఇదే!

Friday TV Movies:వారాంతానికి స్వాగతం పలుకుతూ తెలుగు టీవీ ఛానెళ్లు ప్రేక్షకుల కోసం అదిరిపోయే సినిమాల విందును సిద్ధం చేశాయి.

on
- Advertisement -banner Ad

Friday TV Movies:తెలుగు టీవీ ఛానెళ్లు ప్రేక్షకులను అలరించేందుకు సినిమాల సందడిని సిద్ధం చేశాయి. ప్రతి వారం మాదిరిగానే ఈ శుక్రవారం కూడా వివిధ రకాల చిత్రాలతో వినోదాల విందు అందించనున్నాయి. కుటుంబ సభ్యులంతా కలిసి చూసే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లు, ఆకట్టుకునే ప్రేమకథలు, ఉత్కంఠ రేపే యాక్షన్ సినిమాలు, కడుపుబ్బా నవ్వించే కామెడీ చిత్రాలతో పాటు మాస్ ప్రేక్షకులను మెప్పించే సినిమాలు కూడా టెలివిజన్‌లో ప్రసారం కానున్నాయి(Friday TV Movies). కొత్త సినిమాలతో పాటు ఇప్పటికే ప్రేక్షకాదరణ పొందిన చిత్రాలు కూడా బుల్లితెరపై సందడి చేయనున్నాయి. మరి ఏ ఛానెల్‌లో ఏ సినిమా, ఎప్పుడు ప్రసారం కానుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..!

డీడీ యాదగిరి:

డీడీ యాదగిరిలో ఉదయం 9 గంటలకు తెలుగు డబ్‌ హాలీవుడ్‌ మూవీ “లంబోర్గిణి” ప్రసారం కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు “మావిడాకులు”, రాత్రి 9.30 గంటలకు “మురళీకృష్ణుడు” సినిమాలను చూడొచ్చు.

- Advertisement -
Advertisement

also read:Friday ott movies:ఫ్రైడే ఓటిటి మూవీస్..!

ఈటీవీ ఛానెళ్లలో :

ఈటీవీ ప్లస్‌లో మధ్యాహ్నం 3 గంటలకు “సమరసింహారెడ్డి” ప్రసారం కానుంది. ఈటీవీలో ఉదయం 9 గంటలకు, అర్ధరాత్రి 12 గంటలకు “ముద్దుల మావయ్య”ను ప్రసారం చేయనున్నారు.

- Advertisement -
Advertisement

ఈటీవీ సినిమాలో ఉదయం 7 గంటలకు “ఇష్టం”, 10 గంటలకు “అల్లరి పిల్ల”, మధ్యాహ్నం 1 గంటకు “శుభాకాంక్షలు”, సాయంత్రం 4 గంటలకు “జోరు”, రాత్రి 7 గంటలకు “గుండమ్మ కథ”, రాత్రి 10 గంటలకు “జగడం”, అర్ధరాత్రి 1 గంటకు “ఇష్టం” ప్రసారం కానున్నాయి.

also read:Chiranjeevi:ఇరుముడి సినిమాపై చిరంజీవి ట్వీట్ వైరల్!

- Advertisement -
Advertisement

జెమినిలో సినిమాల జాతర :

జెమిని టీవీలో ఉదయం 9 గంటలకు “పుట్టింటికి రా చెల్లి, మధ్యాహ్నం 3.30 గంటలకు “అన్నమయ్య” ప్రసారం కానుంది.

జెమిని మూవీస్‌లో “కలలు కనే కళ్ళు”, “కోటీశ్వరుడు”, “ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి”, “పెళ్లాల రాజ్యం”, “కత్తి కాంతారావు”, “గుండె ఝల్లుమంది”, “శివరామరాజు”, “పట్టుదల” వంటి చిత్రాలు వివిధ సమయాల్లో ప్రసారం కానున్నాయి.

జీ తెలుగు, జీ సినిమాలు:

జీ తెలుగులో ఉదయం 3 గంటలకు “జై చిరంజీవ”, 9 గంటలకు “హలో”, సాయంత్రం 5 గంటలకు “రారండోయ్ వేడుక చూద్దాం” ప్రసారం కానున్నాయి.

జీ సినిమాలులో “ఆట”, “జయసూర్య”, “అన్నవరం”, “రోషగాడు”, “బొమ్మరిల్లు”, “రోబో 2.0”, “యుగానికి ఒక్కడు” చిత్రాలు ప్రేక్షకులను అలరించనున్నాయి.

స్టార్ మా ఛానెళ్లలో:

స్టార్ మాలో “వివేకం”, “హలో బ్రదర్‌”, “విశ్వాసం” సినిమాలు ప్రసారం కానున్నాయి. స్టార్ మా మూవీస్‌లో “హనుమంతు”, “అప్పట్లో ఒకడుండేవాడు”, “అర్జున్‌”, “ఛత్రపతి”, “వినయ విధేయ రామ”, “క్రాక్‌”, “S/O సత్యమూర్తి” వంటి సినిమాలు సందడి చేయనున్నాయి.

స్టార్ మా గోల్డ్‌లో “బల్లెం”, “పోతేపోనీ”, “అన్నాచెల్లెల్లు”, “రక్త సంబంధం”, “అందరివాడు”, “ఈగ”, “టక్‌ జగదీష్‌” తదితర చిత్రాలు ప్రసారం కానున్నాయి. మొత్తంగా శుక్రవారం తెలుగు టీవీ ఛానెళ్లలో సినిమాల విందు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించనుంది.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you