Sunday, August 30, 2026
HomeLATESTIrumudi:నైజాంలో దుమ్ము లేపేస్తున్న ఇరుముడి కలెక్షన్స్..!

Irumudi:నైజాంలో దుమ్ము లేపేస్తున్న ఇరుముడి కలెక్షన్స్..!

Irumudi: రవితేజ హీరోగా శివానిర్వాన దర్శకత్వంలో వచ్చిన ఇరుముడి సినిమా కలెక్షన్స్ తెలంగాణలోని నైజాం ఏరియాలో భారీగా పెరిగిపోయాయి.

on
- Advertisement -banner Ad

Irumudi:మాస్ హీరో రవితేజ, డైరెక్టర్ శివా నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ఇరుముడి. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడమే కాకుండా రవితేజ కెరియర్ లోనే గుర్తుండిపోయే చిత్రంగా నిలుస్తోంది. భిన్నమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి మొదటి రోజు నుంచే అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఈ చిత్రంలోని కొన్ని సీన్స్ వివాదాస్పదంగా మారినప్పటికీ కలెక్షన్స్ పైన ప్రభావం పడుతుందని అందరూ అనుకున్నారు. కానీ కలెక్షన్స్ జోరు పైన ఎలాంటి ప్రభావం చూపించలేదు. రోజురోజుకి కలెక్షన్స్ పెరుగుతూనే ఉంది.

నైజాం మార్కెట్లో ఇరుముడి జోరు..

ముఖ్యంగా తెలంగాణలోని నైజాం మార్కెట్లో ఇరుముడి చిత్రం తిరుగులేని ఆదిపత్యాన్ని ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. మొదటి వారంలోనే తెలంగాణ వ్యాప్తంగా రూ.50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కేవలం ఏడు రోజులలోనే రూ.26 కోట్లకు పైగా డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చినట్లుగా వినిపిస్తోంది. సాధారణంగా వర్కింగ్ డే అయిన ఏడవ రోజు కూడా తెలంగాణలో సుమారుగా మూడు కోట్లకు పైగా టికెట్లు బుక్ అయ్యాయని వినిపిస్తోంది. దీంతో రవితేజ ఇరుముడి(Irumudi) చిత్రానికి ఉన్న క్రేజ్ చాలా స్పష్టంగా కనిపిస్తోందని చెప్పవచ్చు.

- Advertisement -
Advertisement

also read:Sirisha:రెండో పెళ్లితో సర్‌ప్రైజ్ ఇచ్చిన ‘మొగలిరేకులు’ నటి శిరీష..!

లాంగ్ వీకెండ్ లో మరిన్ని కలెక్షన్స్..

ప్రస్తుతం ఇలాగే కొనసాగితే లాంగ్ వీకెండ్ కి ఇరుముడి కలెక్షన్స్ మరింత కలిసి వచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తున్నాయి. అలాగే ఆదివారం రోజున అదనంగా కలెక్షన్స్ రాబట్టే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో తెలంగాణలో 70 కోట్ల గ్రాస్ మార్క్ చేరుకుంటుందని అంచనా వేస్తున్నాయి ట్రేడ్ వర్గాలు. ధమాకా సినిమా తర్వాత రవితేజ కెరియర్ లో ఆ స్థాయిలో మళ్లీ కలెక్షన్స్ జోరు కనిపిస్తున్న చిత్రం ఇరుముడి అని సినీ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. ముఖ్యంగా రవితేజ ఎనర్జీ, ప్రియా భవాని శంకర్, బేబీ నక్షత్ర నటన ఈ చిత్రానికి మరింత ఆకర్షణగా నిలిచింది. డైరెక్టర్ శివ దర్శకత్వం ఈ సినిమాకే ప్రధాన బలం అని చెప్పవచ్చు.

- Advertisement -
Advertisement

also read:Irumudi movie:ఇరుముడి వివాదం.. నారా లోకేష్ కి లేఖ. !

సినిమాపై అంచనాలు పెంచేసిన సాంగ్స్..

ఈ చిత్రంలోని మల్లెపూల పల్లకి పాట బ్లాక్ బాస్టర్ గా నిలిచి మరీ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేలా చేసిందని చెప్పవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ ఇతర ప్రాంతాలలో కూడా ఈ సినిమాకి మంచి ఆదరణ లభిస్తున్నది. నైజాం మార్కెట్లో నమోదైన ఈ సరికొత్త రికార్డులతో ఇప్పుడు ఇరుముడి సినిమా మరొకసారి ప్రత్యేకంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే పలు థియేటర్లలో హౌస్ ఫుల్ బోర్డు కనిపిస్తోంది. ఈ లాంగ్ వీకెండ్ ముగిసే సరికి మరిన్ని సరికొత్త రికార్డులను సృష్టిస్తుందని రవితేజ అభిమానులు భావిస్తున్నారు. మరి ఫైనల్ గా ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో చూడాలి ఈ ఇరుముడి చిత్రం.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you