Friday, August 28, 2026
HomeLATESTSirisha:రెండో పెళ్లితో సర్‌ప్రైజ్ ఇచ్చిన ‘మొగలిరేకులు’ నటి శిరీష..!

Sirisha:రెండో పెళ్లితో సర్‌ప్రైజ్ ఇచ్చిన ‘మొగలిరేకులు’ నటి శిరీష..!

Sirisha:‘మొగలిరేకులు’ సీరియల్‌తో తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైన నటి శిరీష రెండో వివాహం చేసుకుని సర్‌ప్రైజ్ ఇచ్చారు.

on
- Advertisement -banner Ad

Sirisha:బుల్లితెరపై తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి శిరీష మరోసారి వార్తల్లో నిలిచారు. కొంతకాలంగా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో వార్తల్లో కనిపించిన ఆమె.. తాజాగా రెండో వివాహం చేసుకుని అభిమానులను సర్‌ప్రైజ్ చేశారు. ప్రముఖ నటుడు, యాంకర్ మహేంద్ర బొర్రాల (మహి)తో శిరీష వివాహం శుక్రవారం ఉదయం కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిగింది.

‘సిరి వెడ్స్ మహి’ అంటూ ప్రకటించిన శిరీష :

తన పెళ్లి విషయాన్ని శిరీష స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. వివాహానికి సంబంధించిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. “ఎట్టకేలకు రహస్యం బయటపడింది. శాశ్వత బంధం మొదలైంది. జీవితాంతం ఈ బంధం సంతోషంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సిరి వెడ్స్ మహి” అంటూ తన ఆనందాన్ని పంచుకున్నారు. దీంతో ఆమె పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

- Advertisement -
Advertisement

also read:Irumudi movie:ఇరుముడి వివాదం.. నారా లోకేష్ కి లేఖ. !

‘మొగలిరేకులు’తో గుర్తింపు :

శిరీష తన నటనా ప్రస్థానాన్ని ప్రముఖ సీరియల్‌ ‘మొగలిరేకులు’తో ప్రారంభించారు. ఈ సీరియల్‌లో తనదైన నటనతో ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుని బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటూ పలు విజయవంతమైన సీరియల్స్‌లో నటించారు. ‘రాములమ్మ’, ‘స్వాతి చినుకులు’, ‘చెల్లెలి కాపురం’, ‘కలవారి కోడలు కనకమహాలక్ష్మి’, ‘త్రిశూలం’ వంటి ధారావాహికల్లో విభిన్న పాత్రలు పోషించి మెప్పించారు. కుటుంబ కథా నేపథ్యంతో సాగే సీరియల్స్‌లో తన సహజమైన నటన, భావోద్వేగాలను చక్కగా పలికించే తీరు ద్వారా శిరీషకు(Sirisha) ప్రత్యేకమైన గుర్తింపు లభించింది. ముఖ్యంగా బుల్లితెర ప్రేక్షకుల్లో ఆమెకు మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఏర్పడింది. తన కెరీర్‌లో ఎన్నో విభిన్న పాత్రలను పోషిస్తూ నటిగా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు.

- Advertisement -
Advertisement

also read:OTT:వార్తలో పేరు వస్తే మరణం ఖాయం.. ఈ సిరీస్‌ చూస్తే షాక్ అవుతారు!

నటుడు, యాంకర్‌గా మహేంద్ర :

మహేంద్ర బొర్రాల కూడా బుల్లితెర ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేని పేరే. శిరీషను వివాహం చేసుకున్న ఆయన.. రేడియో జాకీగా తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత యాంకర్‌గా మారి పలు టీవీ కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. తన మాటతీరుతో, యాంకరింగ్‌ శైలితో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అనంతరం నటనపై ఆసక్తితో బుల్లితెరపై నటుడిగానూ అడుగుపెట్టారు. ‘ఇంటింటి రామాయణం’, ‘మగువ ఓ మగువ’ వంటి పలు సీరియల్స్‌లో కీలక పాత్రల్లో కనిపించి మెప్పించారు. యాంకర్‌గా, నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మహేంద్ర.. శిరీషతో వివాహం తర్వాత కూడా టీవీ రంగంలో కొనసాగుతున్నారు. తాజాగా శిరీష రెండో వివాహం నేపథ్యంలో మహేంద్ర పేరు మరోసారి చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -
Advertisement

ఓ కార్యక్రమంలో అనుకోకుండా పరిచయమైన శిరీష, మహేంద్రల మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారినట్లు తెలుస్తోంది. ఇరు కుటుంబాల అంగీకారంతో వీరిద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఈ కొత్త జంటకు టీవీ సెలబ్రిటీలు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you