Saturday, August 29, 2026
HomeLATESTAnanya pandey:విజయ్ దేవరకొండ హీరోయిన్ లవ్ బ్రేకప్..!

Ananya pandey:విజయ్ దేవరకొండ హీరోయిన్ లవ్ బ్రేకప్..!

Ananya pandey: ప్రముఖ హీరోయిన్ అనన్య పాండే తాజాగా తన బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ చెప్పుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

on
- Advertisement -banner Ad

Ananya pandey:బాలీవుడ్లో హీరోయిన్ గా పేరు సంపాదించిన నటి అనన్య పాండే గురించి తాజాగా ఒక విషయం బాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది. గత కొంతకాలంగా ఏదో ఒక విషయంలో వార్తలలో నిలుస్తున్న అనన్య పాండే(Ananya pandey).. తన బాయ్ ఫ్రెండ్ వాకర్ బ్లాంకోతో గత రెండేళ్లుగా ప్రేమాయణం నడుపుతోందని జోరుగా వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు తాజాగా ఆ బంధాన్ని పరస్పర అంగీకారంతో విడిపోయినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం ఇప్పుడు బాలీవుడ్ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది.

అంబానీ పెళ్లి వేడుకలలో బాయ్ ఫ్రెండ్ తో అనన్య..

2024 మధ్యలో జరిగిన అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహ వేడుకలలో అనన్య, వాకర్ మధ్య పరిచయం ఏర్పడిందని, ఆ పరిచయం కాస్త ప్రేమగా మారిందని , గతంలో వార్తలు వినిపించాయి. వీరిద్దరూ జంటగా కలిసి పలు రకాల ప్రైవేట్ కార్యక్రమాలకు కూడా హాజరు కావడంతో వీరి బంధం పైన వార్తలు మరింత వైరల్ గా మారాయి. అంతేకాకుండా అనన్య వాకర్ పేరుతో గుర్తుగా ఉన్న లాకెట్ ను కూడా ధరించడం వీరి రిలేషన్ కి దాదాపుగా ధ్రువీకరించినట్టుగా అనిపించింది. కానీ ఎప్పుడూ కూడా వీరి బంధం పైన బహిరంగంగా స్పందించలేదు.

- Advertisement -
Advertisement

also read:Irumudi:నైజాంలో దుమ్ము లేపేస్తున్న ఇరుముడి కలెక్షన్స్..!

నటిగా ఫిలింఫేర్ అందుకున్న అనన్య..

ఇప్పుడు తాజాగా వీరి మధ్య విభేదాలు వచ్చాయని , దీంతో ఎటువంటి గొడవలు పడకుండా స్నేహపూర్వకంగానే వేరువేరు మార్గాలను ఎంచుకున్నట్లుగా వినిపిస్తోంది. గతంలో అనన్య పాండే ఆదిత్య రాయ్ కపూర్ తో కలిసి ప్రేమాయణం నడిపిన సంగతి అందరికీ తెలిసిందే.. ఇప్పుడు మరొకసారి బ్రేకప్ అవ్వడంతో ఈ విషయం వైరల్ గా మారింది. 2019లో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 చిత్రం ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న అనన్య ఆ సినిమాతో నటిగా ఫిలింఫేర్ అవార్డు కూడా అందుకుంది. విజయ్ దేవరకొండ సరసన లైగర్ అనే సినిమాలో నటించి భారీ డిజాస్టర్ ని మూటకట్టుకుంది.

- Advertisement -
Advertisement

also read:Sirisha:రెండో పెళ్లితో సర్‌ప్రైజ్ ఇచ్చిన ‘మొగలిరేకులు’ నటి శిరీష..!

అనన్య లవ్ బ్రేకప్..

ఓటీటీలో వచ్చిన గెహ్రాయియాన్, ఖో గయే హమ్ కహా వంటి చిత్రాలను నటించి..తన నటనకు ప్రశంసలు అందుకుంది. అటు బాక్స్ ఆఫీస్ వద్ద కూడా డ్రీమ్ గర్ల్ 2 చిత్రంతో కమర్షియల్ విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ ..ఎన్నో వెబ్ సిరీస్లలో కూడా నటించి ప్రత్యేకమైన గుర్తింపు అందుకుంది. కానీ వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొంటున్న ఈ ఇబ్బందులు ప్రస్తుతం అనన్య సినీ కెరీర్ ని ఇబ్బందులలో పడేసేలా.కనిపిస్తున్నాయి. ఇటీవలే కేసరి చాప్టర్ 2 చిత్రంలో లాయర్ పాత్రలో నటించి అద్భుతంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం కార్తీక్ ఆర్యన్ తో నటిస్తున్న సినిమా పైనే ఈమె భారీగా అంచనాలు పెట్టుకుంది. తాజాగా బ్రేకప్ ని వీలైనంత త్వరగా మర్చిపోయి మరి తన కెరీర్ ని మొదలు పెట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you