Tollywood:ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలు సైతం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. కంటెంట్ బాగుంటే చాలు స్టార్ హీరో హీరోయిన్స్ లేకుండానే సినిమాలు సక్సెస్ అవుతున్నాయి. అలా ఇప్పుడు తాజాగా యంగ్ హీరోయిన్ శ్వేతా లక్ష్మణ్(Shwetha Lakshman) సహా.. లైఫ్ ఆఫ్ సంజు అనే చిత్రంలో నటించింది. ఈ సినిమా సెప్టెంబర్ 4న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గురువారం హైదరాబాదులో జరగగా.. ఈ వేడుకకు ప్రముఖ నిర్మాత బన్నీ వాసు హాజరయ్యారు. అయితే ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో హీరోయిన్ శ్వేతా లక్ష్మణ్ మాట్లాడిన మాటలు అందరిని ఆశ్చర్యానికి గురిచేసాయి.
కథపై అమితమైన నమ్మకం.. నిలబడుతుందా?
ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలకు, మీడియా మిత్రులకు, కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుతూ.. అలాగే వంశీ బన్నీ వాసు వంటి ప్రముఖ నిర్మాతల(Tollywood) మద్దతు ఇస్తున్నందుకు ఆనందంగా ఉంది.. ప్రొడ్యూసర్ తేజ, డైరెక్టర్ నిశాంత్ దోటి, హీరో కుమార్ కాసరం తో పాటుగా టీం అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఈ సినిమా ప్రస్థానం గురించి మాట్లాడింది. తమ వద్ద పెద్ద బడ్జెట్ లేకపోయినా పెద్ద స్టార్ కాస్ట్యూమ్స్ లేకపోయినా తమకి ఉన్న ఒకే ఒక బలం సినిమా కథపై తమకి నమ్మకం ఉందని , ఆ నమ్మకంతోనే ఈ చిత్రాన్ని రూపొందించినట్లు తెలిపింది శ్వేతా లక్ష్మణ్.
also read:Ananya pandey:విజయ్ దేవరకొండ హీరోయిన్ లవ్ బ్రేకప్..!
స్టోరీ పై హీరోయిన్ కామెంట్..
ఈ సినిమా ఒక లవ్ స్టోరీ గా మాత్రమే కాకుండా.. ప్రస్తుతం మన జీవితంలో జరుగుతున్న, జరిగిన, జరగబోయే, జరగకూడదనుకున్న ఎమోషన్స్ అన్నిటిని కూడా ఇందులో చాలా చక్కగా చూపించామని ఆమె వివరించారు. కొన్నిసార్లు మనం తీసుకునే ఒక చిన్నపాటి నిర్ణయం మన జీవితాన్ని ఎలా మార్చేస్తుంది? వాటి ఎమోషన్స్ ని కూడా ఈ చిత్రంలో చాలా అందంగా చూపించామంటూ శ్వేత లక్ష్మణ్ తెలిపారు.ప్రేక్షకులకు కేవలం విజ్ఞప్తి చేయడం లేదు ఈ సినిమాతో తాను చాలెంజ్ చేస్తున్నానంటూ తెలిపింది.
also read:Irumudi:నైజాంలో దుమ్ము లేపేస్తున్న ఇరుముడి కలెక్షన్స్..!
హీరోయిన్ ఓపెన్ ఛాలెంజ్..
ఈ సినిమా చూసిన తర్వాత మీరందరూ ఎంత మంచి సినిమా తీశారు అంటూ థియేటర్ నుంచి బయటికి వస్తారని , ఎవరు డిసప్పాయింట్ అవ్వరని, ఒకవేళ అలా డిసప్పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి నేను అమీర్పేట సెంటర్లో నిలుచొని గుండు గీయించుకుంటాను అంటూ ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చింది. అంత స్ట్రాంగ్ కంటెంట్తో ఈ సినిమా మేము తీశామంటూ తెలిపింది శ్వేతా లక్ష్మణ్. దీంతో ఆమె మాటలు సైతం ఒక్కసారిగా అందరిని ఆశ్చర్యానికి గురిచేసాయి. తెలుగు ప్రేక్షకులు మంచి సినిమాలను గుండెల్లో పెట్టుకొని ఆదరిస్తారని, అందుకే తాము ఇలా బలమైన కంటెంట్తో సరసమైన ధరలలో థియేటర్లలోకి వస్తున్నామని తెలిపింది. మరి సెప్టెంబర్ 4న థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి మరి.
View this post on Instagram




