Jabardasth Varsha:రవితేజ రీసెంట్‌గా నటించిన మూవీ ‘ఇరుముడి’. ఈ సినిమా ఆగస్టు 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సూపర్ డూపర్ హిట్ టాక్‌తో థియేటర్లలో దూసుకుపోతుంది. ఎంత హిట్ సంపాదించుకుంది అంటే.. ఆ తర్వాత వచ్చిన ‘టాక్సిక్’ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయడానికి కూడా జనాలు ఒప్పుకోవడం లేదు. మాకు ‘ఇరుముడి’ సినిమానే కావాలి, రవితేజ సినిమా అంతా బాగుంది అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఫ్యామిలీ ఆడియన్స్‌ను కంటతడి పెట్టిస్తున్న రవితేజ:
ఇక ఫ్యామిలీ ఆడియన్స్ అయితే థియేటర్‌కి వెళ్లి ఎమోషనల్‌గా బయటకు వస్తున్నారు. రవితేజలో ఇంత టాలెంట్ ఉందా? ఏడిపించేశాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమా ఫుల్ క్రేజీ హిట్ అందుకుంది. ముఖ్యంగా ఈ సినిమా ఇప్పటికే రూ.150 కోట్లకు పైగా కలెక్షన్ సాధించినట్లు తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమా రూ.200 కోట్ల క్లబ్‌లోకి కూడా చేరే ఛాన్సెస్ పుష్కలంగా ఉన్నాయి అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ముఖ్యంగా ఈ సినిమాలోని ‘మల్లెపూల పల్లకి’ పాట ఎంత హిట్ సంపాదించుకుందో అందరికీ తెలిసిందే. సినిమా రిలీజ్‌కి ముందే ఈ పాట క్రేజీ హిట్ సాంగ్స్‌లో ఒకటిగా నిలిచిపోయింది. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత పాట లిరిక్స్, స్టెప్స్ అందరికీ బాగా నచ్చేశాయి.
ఆధ్యాత్మిక భావనతో, భక్తి భావంతో సోషల్ మీడియా వేదికగా రీల్స్ చేసి షేర్ చేస్తున్నారు. కామన్ పీపుల్ మాత్రమే కాదు.. స్టార్ సెలబ్రిటీలు కూడా ఈ ‘మల్లెపూల పల్లకి’ సాంగ్‌కు బాగా రీల్స్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఈ ‘మల్లెపూల పల్లకి’ సాంగ్ మారుమోగిపోతుంది.
also read:Tollywood:సినిమా ఆడకపోతే గుండు గీయించుకుంటా.. హీరోయిన్ ఓపెన్ ఛాలెంజ్. !
వర్ష డ్యాన్స్‌కు ప్రశంసల వర్షం:
తాజాగా ఈ పాటకు జబర్దస్త్ వర్ష(Jabardasth Varsha) కూడా డ్యాన్స్ చేసింది. అయ్యప్ప స్వాముల తరహాలో సాంప్రదాయ దుస్తులు ధరించిన జబర్దస్త్ వర్షా.. ఈ పాటకు తన బృందంతో కలిసి చక్కగా డ్యాన్స్ చేసింది. ఈ పాటకు అన్ని పాజిటివ్ కామెంట్స్ రావడం గమనార్హం. వర్షాపై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. ఈ వీడియోను చాలామంది సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వన్ ఆఫ్ ద టాప్ రన్నింగ్ రేంజ్‌లో దూసుకుపోతుంది. అంటే ‘మల్లెపూల పల్లకి’ పాటకు ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.
also read:Ananya pandey:విజయ్ దేవరకొండ హీరోయిన్ లవ్ బ్రేకప్..!
‘ఇరుముడి’కి రవితేజ నటనే మెయిన్ ప్లస్:
రవితేజ హీరోగా నటించిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్ రవితేజ నటన. చాలా ఎమోషనల్‌గా, చాలా రియలిస్టిక్‌గా నటించారు. దివ్య ప్రకాశ్ కుమార్ ఇచ్చిన సంగీతం ఈ సినిమా రేంజ్‌ను ఎక్కడికో తీసుకెళ్లిపోయింది అని చెప్పడంలో సందేహం లేదు. ఇక బేబీ నక్షత్ర, సాయికుమార్, శ్వాసిక నటించిన పాత్రలు కూడా జనాలను బాగా ఆకట్టుకున్నాయి.
View this post on Instagram




