Saturday, August 29, 2026
HomeLATESTirumudi:రవితేజ ‘ఇరుముడి’ మూవీని మిస్ చేసుకున్న ముగ్గురు స్టార్ హీరోలు వీళ్లే..!

irumudi:రవితేజ ‘ఇరుముడి’ మూవీని మిస్ చేసుకున్న ముగ్గురు స్టార్ హీరోలు వీళ్లే..!

irumudi:మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ మూవీ ను ముందుగా కొంతమంది స్టార్ హీరోలు మిస్ చేసుకున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

on
- Advertisement -banner Ad

irumudi:ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ‘ఇరుముడి’ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. జనాలు చిన్నా పెద్దా, స్టార్ సెలబ్రిటీలు, కామన్ పీపుల్, ఉద్యోగాలు చేసే వాళ్లు, ఇంట్లో ఉండే ముసలి వాళ్లు ఎవరైనా సరే ‘ఇరుముడి’ సినిమా గురించి మాట్లాడుకోకుండా ఉండలేకపోతున్నారు. అంత చక్కగా ఎక్కించాడు డైరెక్టర్ శివ నిర్వాణ ఈ సినిమాని. శివ నిర్వాణలో ఇంత టాలెంట్ ఉందా అంటూ ఈ సినిమా చూసిన తర్వాత బయటపడింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

ఇంకా పక్కాగా చెప్పాలంటే ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘ఇరుముడి’ (irumudi)సినిమా ఫీవర్ నడుస్తుందని చెప్పాలి. ఎక్కడ చూసినా సరే ‘ఇరుముడి’ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా తండ్రి, కూతురు సెంటిమెంట్ సినిమాలో బాగా పండింది. దానికి తోడు అయ్యప్ప స్వామి నేపథ్యం ఉండడంతో సినిమాను చూసేందుకు అందరూ ఆసక్తి చూపిస్తున్నారు.

- Advertisement -
Advertisement

థియేటర్లలో ‘మల్లెపూల పల్లకి’ పాటకు మంచి స్పందన :

ఇంకా పక్కాగా ‘మల్లెపూల పల్లకి’ పాట థియేటర్లలో కొవ్వు పువ్వు వేస్తుంది. అంత చక్కగా తెరకెక్కించాడు డైరెక్టర్ శివ నిర్వాణ. రవితేజ కెరీర్‌లో మొట్టమొదటి రూ.100 కోట్ల గ్రాస్ సాధించిన చిత్రంగా చరిత్ర సృష్టించింది ఈ సినిమా. ఇప్పుడు వంద కోట్లు కాదు.. ఏకంగా రూ.200 కోట్లు దాటేసే స్థాయికి వెళ్లిపోయిందని ట్రేడ్ నిపుణులు అంటున్నారు.

నలుగురు స్టార్ హీరోలకు ముందుగా కథ:

‘ఇరుముడి’ సినిమా ఇంత పెద్ద సక్సెస్ కావడంతో ఈ సినిమా గురించి మరికొన్ని విషయాలు ఇంట్రెస్టింగ్‌గా మారాయి. అసలు ఈ సినిమాను ఎలా రాసుకున్నాడు డైరెక్టర్ శివ నిర్వాణ? ముందుగా ఏ హీరోతో చేయాలి అనుకున్నాడు? వాళ్లు ఎందుకు రిజెక్ట్ చేశారు? అనే విషయాలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి.

- Advertisement -
Advertisement

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం.. డైరెక్టర్ శివ నిర్వాణ ఈ కథను ముందుగా గోపీచంద్ కోసం రాసుకున్నారట. గోపీచంద్ హైట్‌కి, వెయిట్‌కి, పర్సనాలిటీకి ఈ క్యారెక్టర్ బాగా సూట్ అవుతుంది అని ఆలోచించారట. గోపీచంద్‌కి కూడా వివరించారట. కానీ గోపీచంద్ ఆల్రెడీ కొన్ని సినిమాలతో బిజీగా ఉండడంతో ఈ మూవీని రిజెక్ట్ చేయాల్సి వచ్చింది అంట.

ALSO READ:Jabardasth Varsha:‘మల్లెపూల పల్లకి’ పాటకు జబర్దస్త్ వర్ష అదిరిపోయే డ్యాన్స్.. వీడియో వైరల్!

- Advertisement -
Advertisement

నాగచైతన్యకు కూడా కథ చెప్పిన శివ నిర్వాణ:

ఆ తర్వాత తన ఫేవరెట్ హీరో అక్కినేని నాగచైతన్యకు వినిపించారట. ఆల్రెడీ శివ నిర్వాణ, నాగచైతన్య కాంబోలో ‘మజిలీ’ వచ్చింది. సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ కాంబినేషన్ మరోసారి రిపీట్ చేయాలి అన్న ఉద్దేశంతో నాగచైతన్యకు చెప్పారట.నాగచైతన్య ఎంత బిజీగా ఉన్నాడో అందరికీ తెలిసిందే. దాదాపు మూడేళ్లపాటు కాల్‌షీట్స్ ఇవ్వడానికి కూడా రెడీగా లేరు. దాంతో ఆయన ఈ సినిమా రిజెక్ట్ చేయాల్సి వచ్చింది.

ALSO READ:Tollywood:సినిమా ఆడకపోతే గుండు గీయించుకుంటా.. హీరోయిన్ ఓపెన్ ఛాలెంజ్. !

సూర్య, కార్తీ కూడా రిజెక్ట్ చేశారా?:

ఇక ఈ సినిమాను కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకి కూడా చెప్పారట. మొదట ఈ సినిమాను తెలుగు, తమిళం రెండు భాషల్లో ఒకేసారి తీయాలని డిసైడ్ అయ్యారట. తమిళ్ వెర్షన్ కోసం సూర్యను అనుకున్నారట. సూర్య అదే టైమ్‌కి బిజీగా ఉండడంతో ఈ సినిమా రిజెక్ట్ చేశారట. ఇక కార్తీకి కూడా ఈ కథ వివరించినట్లు తెలుస్తుంది. కార్తీ కూడా కొన్ని కారణాల చేత ఈ సినిమా రిజెక్ట్ చేశారట.

చివరికి రవితేజ వద్దకు వచ్చిన లక్కీ ఛాన్స్:

ఇలా ఇంత మంచి సినిమాను నలుగురు స్టార్ హీరోలు రిజెక్ట్ చేయాల్సి వచ్చింది. తమిళనాడులో కార్తీక్ స్వామిని ఎలా పూజిస్తారో అందరికీ తెలిసిందే. అలా వర్కౌట్ అవుతుంది అంటూ తెలుగు, తమిళంలో ఈ సినిమాను తీయాలనుకున్నారట.కానీ ఫైనల్లీ ఆ లక్కీ ఛాన్స్ రవితేజ వద్దకు వచ్చి ఆగింది. రవితేజ కెరీర్‌లోనే సూపర్ డూపర్ హిట్ సినిమాగా నిలిచింది.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you